'వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షను భగ్నం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ పేరు వింటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.