చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం
శాసనసభలో మజ్లిస్ పక్ష నేత, మజ్లిస్ పార్టీ అదినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి ఐదోసారి గెలిచారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరసగా 1999 నుంచి గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది సయ్యద్ షాహీజాదిపై 80263 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. అక్బరుద్దీన్ ఒవైసీకి 95311 ఓట్లు రాగా, సయ్యద్‌కు కేవలం 15075 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఎమ్.సీతారామిరెడ్డికి పద్నాలుగు వేల ఓట్లకు పైగా వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానానికి పరిమితం అయింది. అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లిం నేత.
2014లో అక్బరుద్దీన్ 59279 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. అక్బరుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఆరుసార్లు లోక్ సభకు, ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ రెండుసార్లు శాసనసభ, నాలుగు సార్లుగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. చాంద్రాయణగుట్టలో ఇంతకు ముందు ఐదుసార్లు అమానుల్లాఖాన్ గెలిచారు. ఈయన మూడుసార్లు ఇండిపెండెంటుగా, మరోసారి మజ్లిస్ అభ్యర్ధిగా, ఇంకోసారి సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఎమ్.బి.టి పార్టీ తరుపున గెలిచారు. అయితే 1999లో అమానుల్లాఖాన్‌ను అక్బరుద్దీన్ ఓవైసీ ఓడిరచారు. చాంద్రాయణగుట్టలో మజ్లిస్ మళ్లీ గెలిచింది. అలాగే ఇక్కడ అన్నిసార్లు ముస్లింలే గెలిచారు.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..