chathisghar border
-
సరిహద్దుపై డేగ కన్ను
వేమనపల్లి: దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం. ఒకవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేపై మావోలు దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. దీం తో తెలంగాణ మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్ సరిహద్దు ప్రాణహిత, గోదావరి నదీ తీరం వెంటా డేగకళ్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా గ్రా మాలు అప్పటికే పోలీసుల రక్షణ వలయంలోకి వెళ్లి పోయాయి. ప్రాణహితానది అవతలి వైపున్న గడిచిరోలి జిల్లా అభయారణ్యం మావోయిస్టులకు షెల్టర్‌జోన్. ఎతైనా.. గుట్టలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఎన్నికల స మయంలో మావోలు తమ ఉనికి చాటుకునేందుకు అవకాశాలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా పోలీస్ బలగాలు నిఘా తీవ్రతరం చేశాయి. ఎన్నికల ప్రక్రియకు మాత్రం ఆటంకం కలగకుండా అన్ని పీఎస్‌లపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంట రామగుండం పోలీస్‌కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షితా కే. మూర్తి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చో టులేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గ్రామాల్లో ఓటింగ్ సరళి పెంచేందుకు గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మా ర్చి 26న తీరం వెంట భారీ కూబింగ్ నిర్వహించారు. అదే రోజు ముక్కిడిగూడెం, కల్లంపల్లి గ్రా మస్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుహక్కు ప్రాధాన్యత, మావోల ప్రజావ్యతిరేక విధానాలపై వివరించారు. ప్రాణహిత ఫెర్రీపాయింట్‌ల వద్దకు డ్రోన్ కెమెరాల సహాయంతో తీరం వెంట గస్తీ నిర్వహిస్తున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్ సీఐ జగదీష్, ఎస్సై భూమేష్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర నిఘా.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రాణాహిత తీరం వెంట నిరంతర నిఘా కొనసాగుతోంది. జిల్లాలో 53 ఒకప్పటి మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో 98 పోలింగ్‌స్టేషన్లున్నాయి. సుమారు 88 మంది మావోయిస్ట్ మాజీ సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లు ఉన్నారు. వీరందరితో సమావేశాలు నిర్వహించి, అసాంఘిక శక్తులకు సహకరించొద్దని వారిని బైండోవర్ చేశారు. నది వెంట 16 ఫెర్రీ పాయింట్లుండగా వచ్చి పోయే ప్రయాణికుల మీద దృష్టి సారించారు. పడవలు నడిపే బోట్‌రైడర్లు, జాలరులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీస్స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు అనుమానిత వ్య క్తుల సమాచారం తెలుసుకుంటున్నారు. యాక్షన్‌టీంలాంటి వాటి సంచారాన్ని తిప్పికొట్టేందుకు కౌంటర్ యాక్షన్ టీం, క్యూఆర్టీ, టాస్క్‌ఫోర్స్ టీం లను ఏర్పాటు చేశారు. యాక్షన్‌టీం సభ్యుల ఫొటోలను గ్రామాల్లో గోడలపై అంటించి వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేయిస్తున్నారు. సరిహద్దు వెంట ఉన్న సుమారు 284 కల్వర్టులను ప్రత్యేకపోలీస్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలను నిర్వహించారు. -
ఎన్కౌంటర్ కలకలం
కోనరావుపేట(వేములవాడ): ఒడిశాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ కోనరావుపేట మండలంలో కలకలం రేపింది. ఇదే మండలంలోని శివంగాలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క ఎన్కౌంటర్లో ఉన్నట్లు ప్రచారం కావడంతో మండలకేంద్రంతో పాటు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని పుస్పూల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భధ్రాతా బలగాలకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్ట్ మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. ఆమెపేరు జ్యోతి అని తెలియడంతో కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామంతో పాటు మండలం ఉలిక్కిపడింది. చివరికి శివంగాలపల్లికి చెందిన జ్యోతి కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. జ్యోతి నేపథ్యం ఇదీ... కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల నర్సయ్య, భూదవ్వల కూతురు జ్యోతి అలియాస్ జ్యోతక్క. ఐదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో, 6–10 వరకు కోనరావుపేట ఉన్నత పాఠశాలలో, ఇంటర్ సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో చదివింది. 2004లో శివంగాలపల్లిలో అప్పటి దళ కమాండర్ పద్మక్క గ్రామంలో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశాన్ని కళ్లారా చూసి, మాటల్ని విన్న జ్యోతి ఉద్యమం పట్ల ఆకర్షితురాలైంది. కళాశాలలో చదువుతుండగానే సీవో రఘు ఆధర్యంలో దళంలోచేరి అజ్ఞాతంలోకి వెళ్లింది. మదిమల్ల ఎల్జీఎస్ దళ స భ్యురాలిగా ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, కథలాపూర్, నిజామాబాద్ జిల్లా సిరికొండ, భీంగల్ ప్రాంతాల్లో పనిచేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ లో దళకమాండర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల్లో ఆందోళన... గురువారం ఎన్కౌంటర్ జరిగిందని, అందులో వీరి కూతురు ఉందని ప్రచారం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నర్సయ్య, భూదవ్వ దంపతులకు ముగ్గురు కూతుళ్లు వినోద, ప్రేమల, జ్యోతి, ఇద్దరు కుమారులు మల్లయ్య, సుధాకర్ ఉన్నారు. వీరిలో మల్లయ్య మృతి చెందగా, జ్యోతి అజ్ఞాతంలో ఉంటుంది. ఎప్పటికైనా తమ కూతురు రాకపోతుందాని వృద్ధ తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు. -
ఛత్తీస్‌లో నలుగురు మావోల ఎన్కౌంటర్
పర్ణశాల(భద్రాచలం): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మహిళా దళ కమాండర్‌తో పాటు ముగ్గురు సభ్యులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా కథనం ప్రకారం.. కుకడాంజోర్ పోలీస్‌స్టేషన్ పరిధి గుమియాబెడా ఆడవుల్లో కూంబింగ్ జరుపుతున్న జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు సమీపంలోని దట్టమైన అడవిలోకి పారిపోయారు. అనంతరం ఘటన స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు నాలుగు తుపాకులు, డిటొనేటర్లు, విద్యుత్ తీగలు, బ్యాటరీలు, నిత్యావసర వస్తువులు, పేలుడు పదార్థాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దళ కమాండర్ రత్త జార, దళ సభ్యుడు సోములను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరిద్దరి తలలపై రూ.5లక్షల వరకు రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. కాంకేర్ జిల్లాలో ఇద్దరిని చంపిన మావోయిస్టులు: కాంకేర్ జిల్లా బందె పోలీస్‌స్టేషన్ పరిధిలో తాడంవెలి గ్రామం నుంచి మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతంలోని తాడ్గూడ రోడ్డులో కనిపించాయి. ఆగస్టు 26వ తేదీన సోను పధా(35), సోమ్జీ పధా(40)తోపాటు పాండురాం అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. పాండురాం తప్పించుకోగా సోను, సోమ్జీలను మావోయిస్టులు గొంతుకోసి చంపారు. ఇన్ఫార్మర్ల నెపంతోనే వారిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పొరుగు మావోయిస్టుల చొరబాటు
బరంపురం: అన్నంత పనే అయింది. అందరూ ఊహిస్తున్నట్లే జరిగింది. పోలీసు అధికారులు అనుమానిస్తున్నట్లుగానే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంతకాలంగా నిశబ్దంగా ఉన్న కొందమాల్ జిల్లా సరిహద్దుల్లో ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మవోయిస్టులు చొరబడి వారి కార్యకలాపాలకు కారిడార్‌గా ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలు రుజువుచేస్తున్నాయి. సీపీఐ మవోయిస్టులకు స్థావరాలుగా ఉండే మల్కన్‌గిరి, రాయగడ, గజపతి, గంజాం, కొందమాల్ జిల్లాల సరిహద్దులైన ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ మవోయిస్టులు ఒడిశా రాష్ట్రంలో కార్యకలాపాలను వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం బల్లిగుడా దట్టమైన అటవీ ప్రాంతంలో గంజాం, కొందమాల్ జిల్లాల ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ జవాన్ల సంయుక్త ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొరముండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుమారు గంటకు పైగా ఇరువైపులా కాల్పులు జరిగిన అనంతరం తమ ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు కామన్‌కుల్, సూన్‌పూర్ దట్టమైన అడవిలోకి జారుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న పలు ల్యాప్టాప్స్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మావోయిస్టు శిబిరంలో స్వాధీన పర్చుకున్న లీఫ్లెట్స్ తెలుగులో ఉండడంతో ఆంధ్ర మావోయిస్టులు కొందమాల్ సరిహద్దుల్లో చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విస్తృతంగా కూంబింగ్ కొందమాల్‌లో మావోయిస్టులు చొరబడకుండా గంజాం, గజపతి, కొందమాల్, రాయగడ జిల్లాల సరిహద్దుల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. కొందమాల్ జిల్లా నాలుగు వైపులా సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ బృందాలు స్థానిక పోలీసుల సహకారంతో కూంబింగ్ అఫరేషన్ చేపడుతున్నాయి. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న కొందమాల్ సరిహద్దులు ఆంధ్ర మావోయిస్టుల చొరబాట్లతో అలజడి సృష్టిస్తున్నాయి. భయాందోళనలో గిరిజనులు కొద్ది రోజుల క్రితం సాలిమా జంగిల్, కామన్‌కుల్, బొరముండా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులతో గిరిజన గూడాల్లో భయాందోళనలు రేగుతున్నాయి. మావోయిస్టు నేత సవ్యసాచి అరెస్ట్ తరువాత సీపీఐ మావోయిస్టు నాయకుడు మేడారం బాలకృష్ణ అలియాస్ నికిల్ సారథ్యం వహించి గంజాం, గజపతి, రాయగడ జిల్లాలను తమ కారిడార్‌గా చేసుకుని దళాన్ని పట్టిష్టపరిచినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కార్యకలాపాలు విస్తరించేందుకు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు రాయగడ అటవీ సరిహద్దుల్లో చొరబడి శిబిరాలు నిర్వాహిస్తున్నట్లు పోలీసులు సేకరించిన అధారాలు తెలియజేస్తున్నాయి. మేడారం బాలకృష్ణ నాయకత్వంలో రాయగడ, గజపతి, గంజాం, కొందమాల్ జిల్లాల సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, పార్టీని విస్తృత పరిచి, ఉనికిని చాటుకునేందుకు హింసాత్మక దాడులకు సిద్ధమవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో కొత్త సవాల్ ఇప్పటికే రాష్ట్రంలోని కొరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాలో మావోయిస్టులు విస్తారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు పాల్పడుతున్న వరుస దాడులు, కిడ్నాప్‌లు, ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుండగా ప్రస్తుతం కొందమాల్‌లో ఆంధ్ర మావోయిస్టుల చొరబాటు కొత్త సవాల్‌గా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాయగడ, గజపతి, కొందమాల్, గంజాం జిల్లాల సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ బృందాల సహాయంతో పోలీసులు కూంబింగ్ అపరేషన్ విస్తృతంగా చేపట్టి అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నట్లు పోలీస్ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. -
ఖమ్మం సరిహద్దుల్లో హైఅలర్ట్
రేపటి నుంచి అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు భారీగా చేరుకుంటున్న ప్రత్యేక బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ చర్ల (ఖమ్మం జిల్లా): ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను తరలిస్తున్నారు. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దులోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ప్రధానంగా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని చర్ల, దుమ్మగూడెం, వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతానికి వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు, మిలిటెంట్లు, మాజీ మిలిటెంట్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని మావోల కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బలగాలను కలుపుకొని జాయింట్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో అధికార పార్టీనేతలతో పాటు, ప్రధాన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు. మావోయిస్టు టార్గెట్లుగా ఉన్న వారిని తక్షణమే స్వగ్రామాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలంటూ సూచనలు చేశారు.