Chechnya
-
ఉక్రెయిన్‌పై వార్.. ఊహించినట్లే రష్యా అడుగులు!
ఉక్రెయిన్‌పై యుద్ధంలో మాస్కో వర్గాలు.. పాశ్చాత్య దేశాల ఊహకు తగ్గట్లే అడుగులు వేస్తున్నాయి. ప్రధాన నగరాలు, ఆపై అణు రియాక్టర్లు, అటుపై పోర్టు సిటీలు దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా వర్గాలు ఊహించినట్లే మరొకటి జరిగింది. రెండు దేశాల మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి ఇతర దేశాల ఫైటర్లను రష్యా నియమించుకుంటోంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ విధ్వంసానికి దిగినప్పటికీ.. ఉక్రెయిన్ దళాల నుంచి ప్రతిఘటనే ఎదురవుతోంది. రష్యా సైన్యం భారీగా నష్టపోతోంది. ఇప్పటికే ఎంతో మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు చంపేశాయి. మరెందరో రష్యన్ సైనికులు ఉక్రెయిన్ కు బంధీలుగా చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి. ఇక రష్యా కాంట్రాక్ట్ ఫైటర్లను నియమించుకుంటున్న విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. నలుగురు అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. సిరియాతో పాటు చెచెన్యా ఫైటర్లను ఇప్పటికే నియమించుకుందట రష్యా. ఇందుకోసం ఫైటర్లతో ఆరు నెలల ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నట్లు సమాచారం. రోజూ 200 నుంచి 300 డాలర్ల జీతం వీళ్లకు ముట్టజెప్పనుంది రష్యా. రాజధాని కీవ్ ముట్టడి కోసమే ఈ నియామకాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రైవేట్ ఫైటర్లు నగరాల ముట్టడిలో రాటుదేలిన వాళ్లని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎంత మందిని, ఈ రెండు దేశాల నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా నియమించుకుందా? అనే సమాచారం మాత్రం వెల్లడించలేదు సదరు కథనం. మరోవైపు ఈ యుద్ధంలో రష్యా గనుక సిరియా సాయం తీసుకుంటే.. తాము ఉక్రెయిన్‌కు మద్ధతుగా రంగంలోకి దిగుతామని సిరియా రెబెల్స్ ఇప్పటికే ప్రకటించేశారు. చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేరళ హోటల్ నిర్ణయం వైరల్ -
‘కరోనాపై అతిగా భయపడకండి’
గ్రోంజీ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌పై చెచన్యా నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెడ్లీ వైరస్ గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మనిషి ఏదో ఒకరోజు మరణించాల్సిందేనని ఆ దేశ నేత రందాన్ కదిరోవ్ అన్నారు. ప్రజలు తమ చేతుల్లో లేని దాని గురించి బాధపడరాదని, సంప్రదాయ వైద్య చిట్కాలను విడిచిపెట్టరాదని సూచించారు. చైనా నుంచి వ్యాప్తి చెందిన వైరస్‌పై ఆందోళనతో ప్రజలకు కంటిమీద కునుకు లేదని, అది తమకు సోకి తాము మరణిస్తామని ప్రజలు ఆందోళన చెందుతున్నారని స్ధానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. వ్యాధి గురించి భయపడాల్సిన పనిలేదని..మీరు ఎప్పుడైనా మరణిస్తారు..మీ సమయం రాకముందే మరణించాలని ప్రయత్నిండం మానండని హితవు పలికారు. ముస్లిం మెజారిటీ రిపబ్లిక్ చెచెన్యా అధినేతగా దీర్ఘకాలం వ్యవహరించిన కదిరోవ్ కరోనాపై అతిగా ఆలోచించి అనవసర భయాలకు లోనుకావద్దని సూచించారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలని, వెల్లుల్లి అధికంగా వాడాలని చెప్పుకొచ్చారు. ఇక 13 లక్షల జనాభా కలిగిన చెచెన్యాలో డెడ్లీ వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకూ ఒక్క కేసూ నమోదు కాలేదు. చదవండి : అవును అది చైనా వైరసే.. -
హోమోసెక్సువల్స్ కోసం కాన్సంట్రేషన్ క్యాంపులు
- ప్రపంచంలోనే తొలిసారి ప్రారంభించిన చెచెన్యా రిపబ్లిక్ - దారుణ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తున్న వ్యతిరేకత గ్రోజ్నీ: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను హింసించేందుకు జర్మన్ నియంత హిట్లర్ ప్రత్యేకంగా ఏర్పాటుచేయించిన కాన్సంట్రేషన్ క్యాంపుల గురించి చాలానే చదివాం. 'కాన్సంట్రేషన్ క్యాంపులో ఉండటంకంటే చచ్చి నరకానికి వెళ్లడమే నయం' అనుకునేంత స్థాయిలో క్రూరహింసలు అమలయ్యేవక్కడ! సరిగ్గా అలాంటి క్యాంపులనే, స్వలింగ సంపర్కుల(హోమోసెక్సువల్స్)ను శిక్షించేందుకు ప్రారంభించింది చెచెన్యా సర్కారు. అధికారిక ఉత్తర్వులతో మంగళవారం ప్రారంభమైన ఈతరహా కాన్సంట్రేషన్ క్యాంపుల ఏర్పాటు ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతోన్న స్వలింగసంపర్కులను నిరోధించేందుకు, వారిని సంస్కరించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అర్గూన్ సహా పలు నగరాల్లో ఈ క్యాంపులు ఏర్పాటయ్యాయి. గతవారం దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో 100 మంది స్వలింగ సంపర్కులు పట్టుబడ్డారు. వారిలో పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు కాల్చిచంపినట్లు సమాచారం. అలా పట్టుబడిన స్వలింగ సంపర్కులను కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించి తీవ్రంగా హింసిస్తున్నారని, కరెంట్ షాకులు ఇచ్చి చంపేస్తున్నారని ఎల్.జి.బి.టి హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. 'ఈ దేశంలో హోమోసెక్సువల్స్ ఉండటానికి వీల్లేదని, అలవాట్లు మార్చుకోనివారు దేశం విడిచి వెళ్లాలని పోలీసులు బెదిరిస్తున్నారు'అని ఓ కార్యకర్త ఆరోపించాడు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్,గే,బైసెక్సువల్,ట్రాన్స్ జెండర్(ఎల్.జి.బి.టి) హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్వలింగ సంపర్కం అంశం చుట్టూ తిరిగే 'మూన్ లైట్' సినిమా ఈ ఏటి ఆస్కార్ ఉత్తమ చిత్రంగా నిలవడం ఎల్.జి.బి.టి హక్కుల పోరాటానికి మరింత ఊపునిచ్చినట్లయింది. ఈ తరుణంలోనే చెచెన్యా రిపబ్లిక్ తీసుకున్న తీవ్రనిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ప్రస్తుతానికి రష్యాలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ, ఇస్లాం సంప్రదాయాలు అధికంగా పాటించే చెచెన్యా ప్రాంతం.. చెచెన్యా రిపబ్లిక్ పేరుతో ప్రత్యేక గుర్తింపు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
వారిని ఇంట్లో పెట్టి తాళం వేయండి!
మాస్కో: ఆ మహిళల్ని ఇంట్లో పెట్టి తాళం వేయండి. వారిని బయటకు వెళ్లనీయకుండా కట్టడి చేయండి. అప్పుడు వారు ఏ విధమైన కామెంట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయరు' అంటూ చెచన్యా రిపబ్లిక్ నేత ఎ. కాదీరోవ్ మహిళా నెటిజన్లపై మండపడ్డారు. కాదీరోవ్ బహు భార్యత్వంపై సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో వచ్చిన విమర్శలకు ఇదే సరైన మార్గమంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనే వివాహం చేసుకున్న కాదీరోవ్.. ఈమధ్యనే 17ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడం వివాదానికి ఆజ్యం పోసింది. ఆ వివాహ వేడుకను సినిమా స్టైల్ లో ప్రభుత్వ కార్యాలయం చేసుకోవడంతో పాటు ఓ స్థానిక టెలివిజన్ కూడా ప్రసారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహిళా నెటిజన్లు కూడా అధిక సంఖ్యలో కాదీరోవ్ ను దుమ్మెత్తిపోశారు. దీనిపై కాదీరోవ్ స్పందిస్తూ వారి నోటికే కాకుండా.. ఇంటికి కూడా తాళం వేస్తే బాగుంటుందని ప్రతి దాడికి దిగారు. కాగా, ఆ యువతిని ఆమె తల్లి దండ్రులైనా అప్పగించి ఉండాలి లేదా కాదీరోవ్ అయినా బలవంతంగా మభ్య పెట్టి పెళ్లి చేసుకుని ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. -
చెచెన్యాలో మిలిటెంట్ల కాల్పులు
10 మంది పోలీసుల మృతి ఎదురుకాల్పుల్లో 9 మంది తీవ్రవాదుల హతం గ్రోజ్నీ: రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో మిలిటెంట్లు గురువారం పేట్రేగిపోయారు. పలుకార్లలో వచ్చిన తీవ్రవాదులు ఒక చెక్‌పోస్టు వద్ద ఉన్న 10 మంది ట్రాఫిక్ పోలీసులను కాల్చిచంపారు. తీవ్రవాదులు వస్తున్న కార్లను ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులను కాల్చి చంపారని చెచెన్ అధ్యక్షుడు రంజాన్ కదిరోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తీవ్రవాదులు సెంట్రల్ గ్రోజ్నీలోని ఒక ఆరంతస్థుల భవనాన్ని ఆక్రమించుకున్నారని, ఆరు గంటలకుపైగా జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించారని తెలిపారు. మరికొందరు తీవ్రవాదులు సిటీ స్కూల్లో ఉన్నారని, వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కాకసస్లో ఆందోళనలు సర్వసాధారణమైనప్పటికీ, కదిరోవ్ తీసుకున్న పటిష్ట భద్రతా చర్యలతో కొన్నేళ్లుగా గ్రోజ్నీలో ఎలాంటి హింసాయుత సంఘటనలూ చెలరేగలేదు.