వారిని ఇంట్లో పెట్టి తాళం వేయండి!
మాస్కో: ఆ మహిళల్ని ఇంట్లో పెట్టి తాళం వేయండి. వారిని బయటకు వెళ్లనీయకుండా కట్టడి చేయండి. అప్పుడు వారు ఏ విధమైన కామెంట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయరు' అంటూ చెచన్యా రిపబ్లిక్ నేత ఎ. కాదీరోవ్ మహిళా నెటిజన్లపై మండపడ్డారు. కాదీరోవ్ బహు భార్యత్వంపై సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో వచ్చిన విమర్శలకు ఇదే సరైన మార్గమంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనే వివాహం చేసుకున్న కాదీరోవ్.. ఈమధ్యనే 17ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడం వివాదానికి ఆజ్యం పోసింది. ఆ వివాహ వేడుకను సినిమా స్టైల్ లో ప్రభుత్వ కార్యాలయం చేసుకోవడంతో పాటు ఓ స్థానిక టెలివిజన్ కూడా ప్రసారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో మహిళా నెటిజన్లు కూడా అధిక సంఖ్యలో కాదీరోవ్ ను దుమ్మెత్తిపోశారు. దీనిపై కాదీరోవ్ స్పందిస్తూ వారి నోటికే కాకుండా.. ఇంటికి కూడా తాళం వేస్తే బాగుంటుందని ప్రతి దాడికి దిగారు. కాగా, ఆ యువతిని ఆమె తల్లి దండ్రులైనా అప్పగించి ఉండాలి లేదా కాదీరోవ్ అయినా బలవంతంగా మభ్య పెట్టి పెళ్లి చేసుకుని ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.