పీఆర్ రోడ్డు పనుల తనిఖీ
కేసముద్రం : కేంద్ర సామాజిక తనిఖీ బృం దం బాధ్యులు బుధవారం మండలంలోని ఇనుగుర్తిలో తారు రోడ్డు పనులను పరిశీ లించారు. ఇనుగుర్తి నుండి మేచరాజ్పల్లి గ్రామం వరకు రూ.2.94కోట్లతో తారు రోడ్డు నిర్మించారు. ఈ మేరకు పీఎంఆర్డి వెంకటేష్‌తో పాటు తనిఖీ బృందం బాధ్యు లు రోడ్డు పనులను పరిశీలించగా పలువురు తండా వాసులు నాణ్యత పాటించలేదని ఫిర్యాదు చేశారు.
అలాగే, లాలు తం డా వద్ద మూలమలుపులు ఉండగా రోడ్డు పనులు చేపట్టకపోవడంతో సంబంధిత అధికారులతో వెంకటేష్ మాట్లాడారు. ఆ ప్రాంతంలో రైతుల నుంచి భూమి సేకరిం చాల్సి ఉందని వారు చెప్పారు. దీంతో స్థాని క రైతులతో పీఎంఆర్‌డీ సమావేశం కాగా.. మూలమలుపు ప్రాంతాల్లో భూమి కలిగి ఉన్న రైతులు పంటలు పండే పొలాలు ఇచ్చేది లేదని తెలిపారు. పాత రోడ్డు స్థానంలోనే కొత్తగా వేయాలని కోరారు. కార్యక్రమంలో డీఈ రాజ్‌కుమార్, ఏఈ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.