Cheer Leader
-
గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణంగా చంపేశాడు..
న్యూయార్క్ : ఓ చీర్ గర్ల్‌ను తన బాయ్‌ఫ్రెండ్ ఎవరికీ అనుమానం రాకుండా చంపేశాడు. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్న తాము శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో అనుమానాస్పదంగా ఆమె చనిపోయిందంటూ తొలుత నమ్మించినప్పటికీ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడు ప్రేమగానే తన గర్ల్‌ప్రెండ్‌ను దగ్గరకు తీసుకున్నా తర్వాత ఓ సైకోలాగ మారి ఆమెను శారీరకంగా హింసించి చంపేసినట్లు దర్యాప్తు బృందాలు తేల్చేశాయి. వివరాల్లోకి వెళితే మార్క్ హోర్టన్ అనే ఓ యువకుడు కేలీ మండాడి (19) అనే చీర్ గర్ల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవలె అతడితో డేటింగ్ వెళ్లిన కేలీ అనూహ్యంగా తీవ్ర గాయాల పాలయింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడే ప్రాణాలు కోల్పోయింది. వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో అనుమానాస్పందంగా ఆమె ప్రాణాలుకోల్పోయినట్లు మార్క్ చెప్పాడు. ఈ సంఘటన గత ఏడాది (2017) అక్టోబర్ 31న చోటు చేసుకుంది. అయితే, అతడిపై రేప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా గతంలో కూడా అతడిపై లైంగిక దాడి నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు. సైకోలాగా మారి భౌతికంగా కేలీని హింసించిన కారణంగానే ఆమె చనిపోయినట్లు వైద్య నిపుణులు చెప్పారు. టెక్సాస్‌కు చెందిన కేలీ త్రినిటీ యూనివర్సిటీలో చీర్‌గర్ల్‌గా పనిచేస్తోంది. -
తొలి చీర్ లీడర్ ఓ మగాడు!
ఆ నేడు 2 నవంబర్ 1898 ఆడేవాళ్లను ఉత్సాహపరచడం, ఆటను చూసేవాళ్లను ఉల్లాసపరచడం చీర్ లీడర్ల విధి. ఆట డల్‌గా ఉన్నప్పుడు, ప్రేక్షకులు డీలా పడి ఉన్నప్పుడు సడెన్‌గా ఈ చీర్ లీడర్లు ప్రత్యేక్షమై ఆడి, పాడి.. స్టేడియం లోపల, బయట చురుకు పుట్టించి అదృశ్యమైపోతారు. క్రికెట్ బాగా పాపులర్ అయ్యాక ఈ చీర్లీడర్ల సంప్రదాయం ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించింది. నిజానికి ఈ సంప్రదాయం క్రికెట్‌తో మొదలవలేదు. అసలు ఆడవాళ్లతోనే మొదలవలేదు! 1898లో ప్రిన్స్టన్ యూనివర్శిటీ పట్టభద్రుడు థామస్ పీబిల్స్ అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు ఒక కార్యక్రమం ఏదైనా చేపట్టాలని అనుకున్నాడు. ఫుట్‌బాల్ అభిమానులను ఆనందడోలికల్లో ముంచెత్తేందుకు ఒక లీడర్ ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. వెంటనే జానీ కాంప్‌బెల్ అనే విద్యార్థి ‘నేనుంటాను’ అని ముందుకు వచ్చాడు. పెద్దగా అరిచి, విజిల్స్ వేసే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు. అలా 1898 నవంబర్ 2న జానీ కాంప్‌బెల్ ఫుట్‌బాల్ ఆట ద్వారా తొలి చీర్ లీడర్ అయ్యాడు. చరిత్రలో అదే తొలి ‘చీర్ లీడింగ్’ అయింది.