తొలి చీర్ లీడర్ ఓ మగాడు! | A man in the first cheerleader! | Sakshi
Sakshi News home page

తొలి చీర్ లీడర్ ఓ మగాడు!

Published Sun, Nov 1 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

తొలి చీర్ లీడర్ ఓ మగాడు!

తొలి చీర్ లీడర్ ఓ మగాడు!

ఆ  నేడు 2 నవంబర్ 1898
 
ఆడేవాళ్లను ఉత్సాహపరచడం, ఆటను చూసేవాళ్లను ఉల్లాసపరచడం చీర్ లీడర్‌ల విధి. ఆట డల్‌గా ఉన్నప్పుడు, ప్రేక్షకులు డీలా పడి ఉన్నప్పుడు సడెన్‌గా ఈ చీర్ లీడర్లు ప్రత్యేక్షమై ఆడి, పాడి.. స్టేడియం లోపల, బయట చురుకు పుట్టించి అదృశ్యమైపోతారు. క్రికెట్ బాగా పాపులర్ అయ్యాక ఈ చీర్‌లీడర్ల సంప్రదాయం ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించింది. నిజానికి ఈ సంప్రదాయం క్రికెట్‌తో మొదలవలేదు.  అసలు ఆడవాళ్లతోనే మొదలవలేదు! 1898లో ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ పట్టభద్రుడు థామస్ పీబిల్స్ అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు ఒక కార్యక్రమం ఏదైనా చేపట్టాలని అనుకున్నాడు. ఫుట్‌బాల్ అభిమానులను ఆనందడోలికల్లో ముంచెత్తేందుకు ఒక లీడర్ ఉంటే బాగుంటుందని అనుకున్నాడు.

వెంటనే జానీ కాంప్‌బెల్ అనే విద్యార్థి ‘నేనుంటాను’ అని ముందుకు వచ్చాడు. పెద్దగా అరిచి, విజిల్స్ వేసే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు. అలా 1898 నవంబర్ 2న జానీ కాంప్‌బెల్ ఫుట్‌బాల్ ఆట ద్వారా తొలి చీర్ లీడర్ అయ్యాడు. చరిత్రలో అదే తొలి ‘చీర్ లీడింగ్’ అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement