ముంబై: ఓపెనర్ అశ్విన్ హెబర్ (136 బంతుల్లో 132; 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు బోణీ కొట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 91 పరుగుల తేడాతో రైల్వేస్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 49.2 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అశ్విన్ శతకంతో విజృంభించగా... కెపె్టన్ శ్రీకర్ భరత్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
రైల్వేస్ బౌలర్లలో రాహుల్ శర్మ 4, యువరాజ్ సింగ్ మూడు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో రైల్వేస్ 41.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ ఉపేంద్ర యాదవ్ (64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం బాదగా... మొహమ్మద్ సైఫ్ (46; 5 ఫోర్లు), సూరజ్ అహుజా (40; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఆంధ్ర బౌలర్లలో వినయ్ కుమార్ 4, శశికాంత్ మూడు వికెట్లు తీశారు. తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం రాజస్తాన్‌తో ఆంధ్ర జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment