
ఐపీఎల్-2025 (IPL 2025)కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం పది జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. తమ హోం గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి కొన్ని జట్లను గాయాల బెడద వెంటాడుతోంది. అందులో ఒకటి రాజస్తాన్ రాయల్స్. అరంగేట్ర సీజన్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్.. అప్పటి నుంచి మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా విజేతగా నిలిచి తమ పదిహేడు ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని రాజస్తాన్ భావిస్తోంది. అయితే కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడం ఆర్‌ఆర్‌కు ప్రధాన సమస్యగా మారింది.
తొలి మ్యాచ్‌కు దూరం..
ఈ ఏడాది సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.ఈ మ్యాచ్‌కు సంజూ శాంసన్ దూరమయ్యే అవకాశముంది. ఐపీఎల్‌లో పాల్గోనేందుకు శాంసన్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (నేషనల్ క్రికెట్ అకాడమీ) నుండి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు.
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతడి కుడి చూపుడు వేలుకు గాయమైంది. చూపుడు వేలు విరిగిపోవడంతో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతడు ఆరు వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ ఫైనల్‌కు సైతం సంజూ దూరమయ్యాడు.
అయితే ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న శాంసన్.. మార్చి 16 లేదా మార్చి 17న రాజస్తాన్ రాయల్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరుతాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు రాజస్తాన్ జట్టులో చేరడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వైద్య సిబ్బంది ఇంకా క్లియరన్స్ ఇవ్వలేదు.
తాజాగా సంజూకు వైద్య సిబ్బంది ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్య ఎదుర్కోలేదని, వికెట్ కీపింగ్ సమయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అయితే భారత టీ20 జట్టులో సంజూ కీలక సభ్యునిగా ఉండడంతో పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండా అతడి ఆడించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఒకట్రెండు రోజుల్లో సంజూ ఫిట్‌నెస్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ సంజూ తొలి మ్యాచ్‌లో ఆడినా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఉండనున్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్-2025కు రాజస్తాన్ టీమ్..
బ్యాటర్లు: సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, నితీష్ రాణా, శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోడ్
ఆల్ రౌండర్లు: రియాన్ పరాగ్, వనిందు హసరంగా
బౌలర్లు: సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఫజల్‌హక్ ఫరూకీ, క్వేనా మఫాకా, ఆకాష్ మధ్వల్, యుధ్వీర్ సింగ్, కుమార్ కార్తికేయ, అశోక్ శర్మ
చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment