గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణంగా చంపేశాడు.. | Boyfriend Murder His Girlfriend | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణంగా చంపేశాడు..

Published Fri, Mar 2 2018 8:14 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

Boyfriend Murder His Girlfriend - Sakshi

లైంగిక దాడికి పాల్పడ్డ మార్క్‌ హోర్టన్‌, చనిపోయిన బాధితురాలు కేలీ మందాడి (ఫైల్‌ ఫొటోలు)

న్యూయార్క్‌ : ఓ చీర్‌ గర్ల్‌ను తన బాయ్‌ఫ్రెండ్‌ ఎవరికీ అనుమానం రాకుండా చంపేశాడు. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్న తాము శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో అనుమానాస్పదంగా ఆమె చనిపోయిందంటూ తొలుత నమ్మించినప్పటికీ షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. అతడు ప్రేమగానే తన గర్ల్‌ప్రెండ్‌ను దగ్గరకు తీసుకున్నా తర్వాత ఓ సైకోలాగ మారి ఆమెను శారీరకంగా హింసించి చంపేసినట్లు దర్యాప్తు బృందాలు తేల్చేశాయి. వివరాల్లోకి వెళితే మార్క్‌ హోర్టన్‌ అనే ఓ యువకుడు కేలీ మండాడి (19) అనే చీర్‌ గర్ల్‌ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే, ఇటీవలె అతడితో డేటింగ్‌ వెళ్లిన కేలీ అనూహ్యంగా తీవ్ర గాయాల పాలయింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడే ప్రాణాలు కోల్పోయింది. వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో అనుమానాస్పందంగా ఆమె ప్రాణాలుకోల్పోయినట్లు మార్క్‌ చెప్పాడు. ఈ సంఘటన గత ఏడాది (2017) అక్టోబర్‌ 31న చోటు చేసుకుంది. అయితే, అతడిపై రేప్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా గతంలో కూడా అతడిపై లైంగిక దాడి నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు. సైకోలాగా మారి భౌతికంగా కేలీని హింసించిన కారణంగానే ఆమె చనిపోయినట్లు వైద్య నిపుణులు చెప్పారు. టెక్సాస్‌కు చెందిన కేలీ త్రినిటీ యూనివర్సిటీలో చీర్‌గర్ల్‌గా పనిచేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement