girl friend murder
-
రూ. 1.5 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు గర్ల్‌ఫ్రెండ్ హత్య
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో విషాదం చోటు చేసుకుంది. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయమన్నందుకు గర్ల్‌ఫ్రెండ్‌ని దారుణంగా హత్య చేసి.. ఓ చర్చి సమీపంలోని చెత్త కుప్పలో పడేశాడు నిందితుడు. మృతురాలిని కుషిత పుంజార్‌గా గుర్తించారు పోలీసులు. ఆ వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన బిపిన్ కందులూనా, ముంబైకి చెందిన కుషిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో కుషిత గతంలో బిపిన్‌కు 1.5లక్షల రూపాయలు ఇచ్చింది. కొంతకాలం బాగానే సాగిన వీరి బంధంలో కొద్ది రోజులుగా గొడవలు మొదలయ్యాయి. తనను వివాహం చేసుకోవాల్సిందిగా కుషిత, బిపిన్ మీద ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేని బిపిన్ ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు. బిపిన్‌కు తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్థం చేసుకున్న కుషిత.. గతంలో తాను అతడికి ఇచ్చిన 1.5లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అంతేకాక తనను మోసం చేసినందుకుగాను అతడిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించసాగింది. ఈ క్రమంలో కుషిత మీద కోపం పెంచుకున్న బిపిన్ ఆమెను అవమానించడమే కాక దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేశాడు. హత్య చేసిన తర్వాత బిపిన్ సొంత రాష్ట్రం పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు బిపిన్ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లి చేసుకుందాం.. ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు -
పెళ్లి చేయలేదని ప్రియురాలు, ఆమె తల్లి హత్య
సాక్షి, చెన్నై: పెళ్లి చేయలేదన్న ఆగ్రహంతో కార్పొరేషన్ ఉద్యోగి ప్రియురాలిని, ఆమె తల్లిని హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొరుక్కుపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. చెన్నై కొరుక్కుపేట అనంతనాయగినగర్‌కు చెందిన వెంకటమ్మ (50), వెంకటేశన్ దంపతులకు కుమార్తె రజిత (24) ఉంది. వెంకటేశన్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో రజితకు కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగం లభించింది. అదే ప్రాంతానికి చెందిన భూపాలన్ కుమారుడు సతీష్ (32) కార్పొరేషన్లో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీరి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను వెంకటమ్మ వ్యతిరేకించింది. అంతేగాక అదే ప్రాంతానికి చెందిన ఒక యువకునితో రజితకు పెళ్లి చేసేందుకు గత వారం నిశ్చితార్థం జరిపించింది. దీంతో సతీష్ గురువారం రాత్రి వెంకటమ్మతో గొడవకు దిగాడు. అనంతరం వెంకటమ్మ, రజిత ఒంటిపై పెట్రోల్ పోసి తాను నిప్పంటించుకున్నాడు. ముగ్గురూ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న ఆర్కేనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడి హత్య కేసులో ఇద్దరి అరెస్టు: చెన్నై నొలంబూరు వావిన్ సమీపంలో గురువారం యువకుడిని హత్య చేసిన కేసులో శుక్రవారం విష్ణు (33), భాస్కర్ (44)ను పోలీసులు అరెస్టు చేశారు. -
కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!
గువాహటి : ప్రేమించిన యువతిని హత్యచేసిన ఓ యువకుడికి గువాహటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సహకరించిన అతని తల్లి, సోదరికి జీవిత ఖైదు విధిస్తూ గత బుధవారం తీర్పునిచ్చింది. హత్యకు గురైన యువతి 2015లో ఇంటర్ స్టేట్ ఫస్ట్ విద్యార్థి కావడం గమనార్హం. చార్జిషీట్ ప్రకారం.. శ్వేత అగర్వాల్, గోవింద్ సింఘాల్ ప్రేమించుకున్నారు. 2017, డిసెంబర్ 4న యువతి గోవింద్ ఇంటికి వెళ్లారు. అయితే, పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం మొదలైంది. దీంతో గోవింద్ శ్వేత తలను గోడకేసి బాదాడు. తలకు బలమైన గాయమవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తల్లి, సోదరి సాయంతో గోవింద్ శ్వేతపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి అందరినీ నమ్మించే యత్నం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు శ్వేత హత్యకు గురైనట్టు తేల్చారు. ఆ ముగ్గురిపై మర్డర్ కేసు నమోదు చేశారు. కోర్టు వారిని దోషులుగా తేల్చింది. రెండేళ్ల అనంతరం గోవింద్‌కు మరణ శిక్ష, అతని తల్లి, సోదరికి జీవిత ఖైదు విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోరు తీర్పునిచ్చింది. -
ప్రేయసి మరో యువకుడితో స్నేహం చేస్తోందని..
సాక్షి, న్యూఢిల్లీ : తన ప్రియురాలు వేరే యువకుడితో స్నేహం చేస్తోందని ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంత పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. రివాజ్ ఖాన్ (20) అనే యువకుడు ఓ మైనర్ బాలికను గత 11 నెలలుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక గతకొంత కాలంగా వేరే యువకుడితో చనువుగా ఉంటోందని ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం సాయంత్ర ఇదే విషయంపై ఇద్దరి మధ్య స్పల్ప వాగ్వాదం జరిగింది. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. అంతేకాకుండా శవాన్ని రెండు ముక్కలుగా చేసి గొనె సంచిలో ప్యాక్ చేసి సమీపంలోని బారాపుల్లా ఫ్లైఓవర్ కిందగల మురికి కాలువలో పడేశాడు. హత్యచేసిన అనంతరం తానే స్వయంగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. తన ప్రేయసి వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న కారణంతో ఆమెను హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో.. కేసు నమోదు చేశారు. అతని సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణంగా చంపేశాడు..
న్యూయార్క్ : ఓ చీర్ గర్ల్‌ను తన బాయ్‌ఫ్రెండ్ ఎవరికీ అనుమానం రాకుండా చంపేశాడు. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్న తాము శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో అనుమానాస్పదంగా ఆమె చనిపోయిందంటూ తొలుత నమ్మించినప్పటికీ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడు ప్రేమగానే తన గర్ల్‌ప్రెండ్‌ను దగ్గరకు తీసుకున్నా తర్వాత ఓ సైకోలాగ మారి ఆమెను శారీరకంగా హింసించి చంపేసినట్లు దర్యాప్తు బృందాలు తేల్చేశాయి. వివరాల్లోకి వెళితే మార్క్ హోర్టన్ అనే ఓ యువకుడు కేలీ మండాడి (19) అనే చీర్ గర్ల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవలె అతడితో డేటింగ్ వెళ్లిన కేలీ అనూహ్యంగా తీవ్ర గాయాల పాలయింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడే ప్రాణాలు కోల్పోయింది. వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో అనుమానాస్పందంగా ఆమె ప్రాణాలుకోల్పోయినట్లు మార్క్ చెప్పాడు. ఈ సంఘటన గత ఏడాది (2017) అక్టోబర్ 31న చోటు చేసుకుంది. అయితే, అతడిపై రేప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా గతంలో కూడా అతడిపై లైంగిక దాడి నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు. సైకోలాగా మారి భౌతికంగా కేలీని హింసించిన కారణంగానే ఆమె చనిపోయినట్లు వైద్య నిపుణులు చెప్పారు. టెక్సాస్‌కు చెందిన కేలీ త్రినిటీ యూనివర్సిటీలో చీర్‌గర్ల్‌గా పనిచేస్తోంది. -
పిస్టోరియస్కు ఐదేళ్ల జైలుశిక్ష
బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా తన తీర్పు వెలువరించారు. తన స్నేహితురాలిని తుపాకితో కాల్చిచంపినందుకు పిస్టోరియస్ ఐదు సంవత్సరాల పాటు జైల్లోనే ఉండాలని తీర్పు ఇచ్చారు. 2013 సంవత్సరంలో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తన స్నేహితురాలు రీవా స్టీన్‌క్యాంప్‌ను పిస్టోరియస్ కాల్చి చంపాడు. అయితే.. అది హత్య కాదని, హత్యకు దారితీసిన పరిస్థితి (కల్పబుల్ హోమిసైడ్) అని జడ్జి భావించారు. అందుకే ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మరో కేసులో మూడేళ్ల సస్పెండ్ శిక్ష కూడా పిస్టోరియస్కు విధించారు.