Chelsea
-
మహేశ్ సరసన ఇండోనేషియా బ్యూటీ
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఓ హీరోయిన్గా నటిస్తారనే వార్త కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని ఫాలో అవుతున్నారు చెల్సియా. అలాగే మహేశ్‌బాబు– రాజమౌళి సినిమాల అప్డేట్స్ను ఇన్‌స్టాలో చెల్సియా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో మహేశ్‌కు జోడీగా చెల్సియా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కానుందట. -
చెల్సీ జట్టును అధిగమిస్తాం
హ్యారీ కేన్ ఇంటర్వూ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) టైటిల్ రేసులో చెల్సీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టోటెన్హామ్ హాట్స్పర్ నేడు (శనివారం) లివర్‌పూల్‌తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ స్ట్రయికర్ హ్యారీ కేన్ మరోసారి రాణించి జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తోంది. ఇప్పటికే అతను ఈ సీజన్లో 16 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న హాట్స్పర్ మరో విజయంతో చెల్సీపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. లివర్‌పూల్‌తో ఈ మ్యాచ్ మీకు ఎంత కీలకంగా భావిస్తున్నారు? ఈపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెల్సీకి మాకు తొమ్మిది పాయిట్ల తేడా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి దీన్ని మరింత తగ్గించి వారిపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాం. మేం వారిని అందుకోవాలంటే ఈ మ్యాచ్ కీలకమే. ఇది జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మా ప్రయత్నం మేం చేస్తాం. కొన్ని పాయింట్లు వారు కోల్పోతారని ఆశిస్తున్నాం. లివర్‌పూల్ జట్టు హల్, అర్సెనల్, వాట్ఫోర్ట్ల చేతిలో ఓడింది. ఇది ఎవరు ఊహించారు? అందుకే ఎలాంటి అవకాశాన్ని కూడా మేం కోల్పోం. వారిని అందుకోవడం సాధ్యమే. ఇక లివర్‌పూల్ మీకు ఎలాంటి పోటీ ఇస్తుందనుకుంటున్నారు? మా చివరి మ్యాచ్ మిడిల్స్బరోలా కాకుండా ఇది మరింత పోటాపోటీగా ఉండనుంది. ఆ జట్టులో నాణ్యమైన అటాకింగ్ ఆటగాళ్లున్నారు. వారితో ప్రమాదమే. మేం కూడా మా శక్తిసామర్థ్యాల మేరకు ఆడగలిగితే విజయం సులభంగానే లభిస్తుంది. టోటెన్హామ్తో ఒప్పందం కుదుర్చుకున్నాక జట్టుకు కీలకంగా మారారు. మున్ముందు ఇదే జట్టుతో కొనసాగాలనుకుంటున్నారా? కొత్తగా ఏదైనా చేయడానికి ఇది మంచి చోటని భావిస్తున్నాను. ప్రపంచ అత్యుత్తమ మేనేజర్లలో ఒకరు మాతో ఉన్నారు. అలాగే త్వరలోనే మాకు కొత్త స్టేడియం రాబోతోంది. భవిష్యత్ చాలా బాగుండే అవకాశం ఉంది. ఈ క్లబ్‌కు ఆడుతున్నందుకు సంతోషంగా ఉన్నాను. అలాగే చాలా ఏళ్లపాటు ఇక్కడే ఆడాలని కోరుకుంటున్నాను. -
ఆ భారీ పేలుడు ఫుటేజీ బయటకొచ్చింది
-
ఆ భారీ పేలుడు ఫుటేజీ బయటకొచ్చింది
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లోగల మన్హటన్ శివారులోని చెల్సియాలో ఓ చెత్తకుండీలో శక్తిమంతమైన పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. 29మంది తీవ్రంగా గాయపడటానికి కారణమైన ఈ బాంబు స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30కి జనసమ్మర్ద ప్రాంతంలో జరిగింది. దీని ధాటికి చుట్టుపక్కల భవనాల కిటికీలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదే సమయంలో దీనికి దగ్గర్లోనే ప్రెజర్ కుక్కర్ బాంబు హడలెత్తించింది. వైర్లతో కూడిన దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ పేలుడు సంభవించిన చెల్సియాలోని ఓ జిమ్ లోపలా బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో రికార్డయిన ప్రకారం జనాలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై వెళుతున్నారు. ఆ చోటు ప్రశాంతంగా ఉందా సమయంలో. కొంతమంది వ్యక్తులు అలా జిమ్ దాటుకుంటూ ముందుకు వెళ్లారో లేదో వెంటనే వెనుకకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీని ధాటికి ఆ జిమ్ లోని వస్తువులతోపాటు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. నాలుగువైపులా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఆధారాలకోసం ఆరా తీస్తున్నారు. -
బిల్ క్లింటన్ తాతయ్యాడు...
అమెరికా :దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా (34) శుక్రవారం రాత్రి పాపకు జన్మనిచ్చింది. పాపకు జన్మనివ్వడం తనకెంతో ఆనందంగా ఉందని చెల్సియా ట్వీట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మార్క్ మెజ్విన్స్కీతో చెల్సియా కు 2010 లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ న్యూయార్క్ సిటీలో నివసిస్తున్నారు. 2014 ఏప్రిల్‌లో చెల్సియా తల్లి కాబోతున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘జీవితంలో అంతుచిక్కని విషయాలు జరుగుతుంటాయి. పుట్టబోయే బిడ్డ కూతురో, కొడుకో తెలుసుకోకూడదని నేను, నా భర్త నిర్ణయించుకున్నాము. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్నాము. పుట్టబోయేది ఎవరైనా ప్రపంచంలోని గొప్ప మహిళా నాయకుల మధ్య పెరుగుతారని చెప్పగలను.’’ అని ఆమె తెలిపారు.