బిల్ క్లింటన్ తాతయ్యాడు... | Chelsea Clinton gives birth to daughter | Sakshi
Sakshi News home page

బిల్ క్లింటన్ తాతయ్యాడు

Published Sat, Sep 27 2014 5:47 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Chelsea Clinton gives birth to daughter

అమెరికా :దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా (34) శుక్రవారం రాత్రి పాపకు జన్మనిచ్చింది.  పాపకు జన్మనివ్వడం తనకెంతో ఆనందంగా ఉందని చెల్సియా ట్వీట్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ మార్క్ మెజ్విన్‌స్కీతో  చెల్సియా కు 2010 లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ న్యూయార్క్ సిటీలో నివసిస్తున్నారు. 2014 ఏప్రిల్‌లో చెల్సియా తల్లి కాబోతున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే.
 
‘‘జీవితంలో అంతుచిక్కని విషయాలు జరుగుతుంటాయి. పుట్టబోయే బిడ్డ కూతురో, కొడుకో తెలుసుకోకూడదని నేను, నా భర్త నిర్ణయించుకున్నాము. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్నాము. పుట్టబోయేది ఎవరైనా ప్రపంచంలోని గొప్ప మహిళా నాయకుల మధ్య పెరుగుతారని చెప్పగలను.’’ అని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement