chemical factories
-
హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం.. ఆరు బృందాలుగా..
హైదరాబాద్: ఐటీ అధికారులు హైదరాబాద్‌లో మూడు చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌లోని రెండు కెమికల్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం ఆరు బృందాలతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ కెంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇష్టారాజ్యంగా కెమికల్ వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలు
సాక్షి, నర్సాపూర్: నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు కాలుష్య జలాలను ఇష్టారాజ్యంగా వదులుతుండటంతో రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాలను వ దులుతున్న కెమికల్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో పలు కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అందులోని వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా డంపింగ్ కేంద్రానికి తరలించాల్సి ఉండగా అలా కాకుండా బహిరంగంగా కాలువల ద్వారా బయటకు వదిలేస్తున్నారు. డంపింగ్ కేంద్రాలకు వ్యర్థాలను తరలిస్తే భారీ ఖర్చు అవుతుందనే ఉద్ధేశంతో పరిశ్రమ ఆవరణ నుంచే బయటకు వదిలేస్తున్నారు. వ్యర్థాలు పారిన ప్రదేశంలో పచ్చని గడ్డితో పాటు భూగర్భజలాలు సైతం కలుషితమవుతున్నాయి. దీంతో సమీప పంటలు దెబ్బతింటున్నాయి. కాలువ ద్వారా వస్తున్న కెమికల్ నీటిని తాగి మూగజీవాలు సైతం మృత్యువాత పడిన సంఘటన లు ఉన్నాయి. వర్షాకాలంలోనైతే నేరుగా కాలువల ద్వారా గ్రామ చెరువులోకి చేరుతున్నాయి. వ్యర్థాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు పరిశ్రమ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. బిజ్లిపూర్ గ్రామ శివారులో ఉన్న పరిశ్రమ వ్యర్థాలను ఇష్టారాజ్యంగా బయటకు వదులుతుండడంతో పలువురు రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం.. నవాబుపేటలోని పలు కెమికల్ పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ రసాయనాలతో పంటలు పాడైపోతున్న విషయం గురించి గతంలో రైతులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడికి వచ్చిన అధికారులు వ్యర్థ రసాయనాల శాంపిల్స్‌ను సేకరించి చేతులు దులుపుకున్నారు. సంబంధిత పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. పంటలు పాడైపోతున్నాయి.. గ్రామ శివారులో ఉన్న పరిశ్రమలోని వ్యర్థాలను బయటకు వదులుతుండడంతో పంటలు పాడైపోతున్నాయి. దీంతో పాటు బోరుబావుల నీరు సైతం కలుషితమయ్యాయి. పలుమార్లు కంపెనీ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదు. కాలువ ద్వారా వస్తున్న వ్యర్థ రసాయనాల నీరు తాగి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. – మహిపాల్‌రెడ్డి, రైతు నవాబుపేట చర్యలు తీసుకుంటాం.. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం. రైతుల ఫిర్యాదు మేరకు నవాబుపేట గ్రామ పరిధిలో వస్తున్న కెమికల్ వ్యర్థాల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. గతంలో ఫిర్యాదులు అందడంతో సంబంధిత పరిశ్రమలకు నోటీసులు జారీ చేశాం. – రవీందర్, పీసీబీ ఈఈ -
మమ్మల్ని చంపి కంపెనీ కట్టుకోండి
పిఠాపురం : ‘పచ్చని పల్లె ప్రాంతాల్లో మందులు కంపెనీలు పెట్టి ప్రాణాంతకమైన విషవాయువులతో మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా? దానికి ముందే మమ్మల్ని చంపేసి మీరు కంపెనీలు కట్టుకోండి’ అంటూ దివీస్ భూసేకరణపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులవృత్తులు, కూలిపని తప్ప ఏపనీ రాని తమను ఎక్కడకు తరిమేద్దామని కుతంత్రాలు పన్నుతున్నారంటూ తొండంగి మండల తీర ప్రాంత వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ ఏర్పాటుకు నిర్దేశించిన తొండంగి మండలం తీరప్రాంత గ్రామాలైన పంపాదిపేట, శృంగవృక్షంపేట, కొత్తపాకలు, ఒంటిమామిడి, తాటాకులపాలెం, నర్శిపేట, దానవాయిపేట, ఓడముసలయ్యపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది ప్రజలు గురువారం భూసేకరణకు వ్యతిరేకంగా తాటాకులపాలెంలో భారీ సమావేశం నిర్వహించారు. ప్రాణాలను పణంగా పెట్టైనా భూములను కాపాడుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే పిల్లాపాపలతో సహా జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈసమావేశంలో స్థానిక పెద్దలు ఎ. అరుణ్‌కుమార్, గంపల దండు, కడారి బుజ్జిబాబు, మేరుగు ఆనందహరి, మట్ల ముసలయ్య తదితరులు మాట్లాడుతూ మందుల కంపెనీ ఏర్పాౖటెతే గాలి, నీరు, వాతావరణం కలుషితమై ఎవరూ బతకలేరని, చివరకు సముద్రంలో చేపలు కూడా దొరకవని అన్నారు. ఈ సమావేశం రైతుల ఆత్మక్షోభ అని, దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభత్వాలు పట్టించుకోపోతే మారణహోమానికి నాంది అవుతుందన్నారు. స్థానిక మంత్రి కల్పించుకుని వెంటనే ఈ భూసేకరణను నిలుపుదల చేయించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. భూసేకరణ పేరుతో ఎవరు వచ్చినా గ్రామాల్లో తిరగనివ్వరాదని, భూసేకరణ నిలిపేసినట్టు ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. పోలీసులు వచ్చి అక్రమ కేసులు పెట్టినా, ఎవరు బెదిరించినా ఉద్యమాన్ని ఆపకూడదని నిర్ణయించుకున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతు దేవుడిగా (శ్రీకృష్ణుడిగా ) పూజించుకున్న స్థానిక నేత ఇప్పుడు శత్రువుగా మారి తమని నాశనం చేయాలని చూస్తున్నాడని, దానికి తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. మత్స్యకారులు, గీత కార్మికులు, ఇతర కులాలకు చెందిన అందరూ జీవనోపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రోగాలను వ్యాపింపజేసే కంపెనీలను ఇక్కడకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న నేతల మాయ మాటలను నమ్మి కొందరు తమ విలువైన భూములను అప్పగించడం మానుకోవాలని హితవు పలికారు. సుమారు 13 గ్రామాలకు చెందిన ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీల చెర నుండి రక్షించాలి
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో 2006లో అప్పటి లోక్‌సభ సభ్యురాలు, రేణుకాచౌదరి నాలుగు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నానని, కాటన్ పార్క్ నిర్మాణం కో సం చుట్టు పక్కల రైతుల నుంచి ఎకరం సగటు ధర లక్షా పది వేల చొప్పున కొనుగోలు చేశారు. సుమారు 42 ఎకరాల భూ మి రైతుల నుంచి తీసుకొని ఏపీఐఐసీకి ఇచ్చారు. అది జరిగి నేటికి పదేళ్లు. కానీ కాటన్ పార్కు నిర్మించలేదు. కొంత మంది నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు దొడ్డిదారిన కోల్డ్ స్టోరేజీలకు, వివిధ ప్రైవేటు కంపెనీలకు ఈ భూమిని ధారా దత్తం చేస్తున్నారు. అందులో భాగమే అక్కడ వెలసిన 'స్పైకా ఇండస్ట్రీస్' కెమికల్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ద్వారా వివిధ రకాల వ్యర్థాలు ఎన్ఎస్పీ కాలువలోకి రావడంతో వ్యవసాయ భూ ముల భూసారం దెబ్బతింటున్నది. ఆ వ్యర్థ రసాయనాలు గాలిలో కలిసి చుట్టు పక్కల ప్రజలు అనారోగ్యంతో బాధపడు తున్నారు. ఆ సమస్య గురించి చుట్టుపక్కల జనం స్థానిక, జిల్లా అధికారులకు పలు మార్లు తమ గోడు వెలిబుచ్చినా ఫలి తం లేదు. ఈ సమస్య ఇలా ఉండగా, మరో భారీ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి జాయింట్ కలెక్టర్ నిర్వహించిన ప్రజా భిప్రాయ సేకరణలో ఆ నాలుగు గ్రామాల ప్రజలూ ప్రజాప్రతి నిధులూ అక్కడ ఫ్యాక్టరీ వద్దని గట్టిగా చెప్పారు. దీంతోపాటు ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా (అన్నారుగూడెం, గోపాలపేట) పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఇవేవీ లెక్క చేయకుండా బల్క్‌డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా రోడ్డెక్కి 'రసాయన ఫ్యాక్టరీ బాధిత పోరాట సమితి' గా ఏర్పడి, నిత్యం ఆందోళన లు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఈ నాలుగు గ్రామాల రైతులూ వ్యవ సాయానికీ దూరం కావాల్సి వస్తుంది. వర్షా కాలంలో ఈ వ్యర్థ రసాయనాలు ఆ మండలాల పరిధిలోని 150 గ్రామాలకు తాగునీటిని అందించే బోడేపూడి సుజల స్రవంతి పథకానికి ఆధారమైన వైరా చెరువులో కలిసే ప్రమా దం ఉంది. ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేదు. పైగా డ్రగ్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత మంత్రి ఈ విషయమై విచారణ చేపట్టి, మా పల్లెల్ని కాపాడాలని విజ్ఞప్తి. - కృష్ణారావు, రసాయనిక ఫ్యాక్టరీ బాధిత పోరాట సమితి, అన్నారుగూడెం, మొబైల్ : 9949803523