ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో 2006లో అప్పటి లోక్‌సభ సభ్యురాలు, రేణుకాచౌదరి నాలుగు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నానని, కాటన్ పార్క్ నిర్మాణం కో సం చుట్టు పక్కల రైతుల నుంచి ఎకరం సగటు ధర లక్షా పది వేల చొప్పున కొనుగోలు చేశారు. సుమారు 42 ఎకరాల భూ మి రైతుల నుంచి తీసుకొని ఏపీఐఐసీకి ఇచ్చారు. అది జరిగి నేటికి పదేళ్లు. కానీ కాటన్ పార్కు నిర్మించలేదు. కొంత మంది నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు దొడ్డిదారిన కోల్డ్ స్టోరేజీలకు, వివిధ ప్రైవేటు కంపెనీలకు ఈ భూమిని ధారా దత్తం చేస్తున్నారు. అందులో భాగమే అక్కడ వెలసిన 'స్పైకా ఇండస్ట్రీస్' కెమికల్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ద్వారా వివిధ రకాల వ్యర్థాలు ఎన్‌ఎస్‌పీ కాలువలోకి రావడంతో వ్యవసాయ భూ ముల భూసారం దెబ్బతింటున్నది.
ఆ వ్యర్థ రసాయనాలు గాలిలో కలిసి చుట్టు పక్కల ప్రజలు అనారోగ్యంతో బాధపడు తున్నారు. ఆ సమస్య గురించి చుట్టుపక్కల జనం స్థానిక, జిల్లా అధికారులకు పలు మార్లు తమ గోడు వెలిబుచ్చినా ఫలి తం లేదు. ఈ సమస్య ఇలా ఉండగా, మరో భారీ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి జాయింట్ కలెక్టర్ నిర్వహించిన ప్రజా భిప్రాయ సేకరణలో ఆ నాలుగు గ్రామాల ప్రజలూ ప్రజాప్రతి నిధులూ అక్కడ ఫ్యాక్టరీ వద్దని గట్టిగా చెప్పారు. దీంతోపాటు ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా (అన్నారుగూడెం, గోపాలపేట) పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
ఇవేవీ లెక్క చేయకుండా బల్క్‌డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా రోడ్డెక్కి 'రసాయన ఫ్యాక్టరీ బాధిత పోరాట సమితి' గా ఏర్పడి, నిత్యం ఆందోళన లు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఈ నాలుగు గ్రామాల రైతులూ వ్యవ సాయానికీ దూరం కావాల్సి వస్తుంది. వర్షా కాలంలో ఈ వ్యర్థ రసాయనాలు ఆ మండలాల పరిధిలోని 150 గ్రామాలకు తాగునీటిని అందించే బోడేపూడి సుజల స్రవంతి పథకానికి ఆధారమైన వైరా చెరువులో కలిసే ప్రమా దం ఉంది. ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేదు. పైగా డ్రగ్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత మంత్రి ఈ విషయమై విచారణ చేపట్టి, మా పల్లెల్ని కాపాడాలని విజ్ఞప్తి.
- కృష్ణారావు, రసాయనిక ఫ్యాక్టరీ బాధిత పోరాట సమితి, అన్నారుగూడెం, మొబైల్ : 9949803523