ఎమ్మెల్యే చెన్నమనేనికి ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. భారత పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది.
ఆయన పౌరసత్వ రద్దుపై ఆరువారాల్లో తేల్చాలని కేంద్రానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తిరిగి సమీక్షించాలని కోరే అవకాశం ఒక్కటే ఆయనకుండగా, హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. తన పౌరుసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ రిట్లో రమేశ్ కోరారు. పౌరసత్వం రద్దు నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లో ఉంటుందంటూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న చెల్లదని చెన్నమనేని పిటిషన్లో పేర్కొన్నారు.
‘భారతీయ పౌరసత్వ చట్టం సెక్షన్ 10(3) ప్రకారం ఒక వ్యక్తి కారణంగా దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజలకు హాని కలిగించేలా ఉంటే మినహా, ఆ వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదు. ఈ విషయంలో నా అభ్యర్థనను పరిశీలించాలని కేంద్ర హోంశాఖకు ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసినప్పటికీ కనీసం పట్టించుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆది శ్రీనివాస్ నాపై కేంద్రానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం విన్నవించినప్పటికీ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నాపై నిర్ణయం తీసుకున్నారు’ అని రమేశ్ తన వాదనలను వినిపించారు.
ఆయన పౌరసత్వం అస్సలు చెల్లదు