Chennai jail
-
ఇంట్లో కంటే జైలులోనే సకల సౌకర్యాలు
చెన్నై : టీవీలు, బెడ్స్, మొబైల్ఫోన్లు, రుచికరమైన ఆహారం .. ఇవన్నీ ఇంట్లోనే అనుకుంటున్నారా? జైలులో కూడా అనుభవించవచ్చట. చైన్నైలోని పుజ్హల్ కేంద్ర కారాగార ఖైదీలు ఇంట్లో కంటే జైలులోనే ఎక్కువ సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పుజ్హల్ కేంద్ర కారాగారానికి సంబంధించి ఫొటోలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. జైలు అథారిటీలు ఓ ఖైదీ వాడుతున్న ఫోన్‌ను సీజ్ చేయగా... ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. జైలులో ఉన్న తోటి ఖైదీలకు ఈ సౌకర్యాలు కల్పించడంతో పాటు, దానికింద పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జైలులో ఉన్న ఖైదీలు తమ ఇంట్లో ఉండే మాదిరి, సాధారణ దుస్తులు ధరించడంతో పాటు, రుచికరమైన భోజనం, సౌకర్యవంతమైన బెడ్స్, ఎలక్ట్రిక్ కుక్కర్లు, యూపీఎస్ బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నట్లు ఈ ఫోటోల ద్వారా తెలిసింది. సెల్ఫోన్లు మినహాయించి ‘ఏ’ క్లాస్ కేటగిరీ ఖైదీలకు ఆ సౌకర్యాలన్నీ అందిస్తారని జైలు అధికారులు తెలుపుతున్నారు. అయితే జైలులో సెల్‌ఫోన్ వాడకంపై వివాదాస్పదమైంది. జైలులో సెల్ఫోన్ల వాడకం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ‘అందరికి పడకలు ఎప్పుడో అందించాం. ఒక్కో బ్లాక్‌కు ఓ టీవీ కూడా ఉంది. ఇవేవీ అసాధారణం కాదు. కానీ, సెల్ఫోన్లు వాడటమే నిబంధనలకు విరుద్ధం. గత వారం ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఇవి లోపలికి ఎలా వచ్చాయో అన్నదానిపై దృష్టి సారించాం. దీనిలో ఏ అధికారి ప్రమేయమైనా ఉందని తేలితే తప్పక చర్య తీసుకుంటాం’ అని ఏడీజీపీ అశుతోష్ శుక్లా వెల్లడించారు. పండగ సమయాల్లో ప్రత్యేక ఆహారం తినడానికి అనుమతి ఉందని, ఏ క్లాస్ ఖైదీలకు వాటిపై నిషేధం లేదని అధికారులు వెల్లడించారు. -
శశికళ బెంగళూరు టు చెన్నై జైల్..??
జైలు మార్చే అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ బెంగళూరు నుంచి చెన్నై జైలుకు మారాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమెను చెన్నై పజల్ సెంట్రల్ జైలుకు మార్చాలని ఆమె న్యాయవాదులు కర్ణాటక ప్రభుత్వానికి పిటిషన్ దాఖలుచేశారు. శశికళను చెన్నై జైలుకు తరలించాలనే విషయంపై అన్నాడీఎంకే నేతలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. చట్టబద్ధంగా శశికళను చెన్నై జైలుకు తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వారు పేర్కొంటున్నారు. ఈ నెల 14న అక్రమాస్తుల కేసులో శశికళతోపాటు ఆమె బంధువులైన ఇళవరసి, వీఎన్ సుధాకరన్‌లను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరప్పన అగ్రహార జైలు నుంచి ఆమెను తరలించాలంటే ఆమె న్యాయవాదులు మొదట జైలు సూపరింటెండెంట్, కర్ణాటక న్యాయశాఖ మంత్రిని సంప్రదించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తమ అభ్యర్థనను రెండు రాష్ట్రాలు ఒప్పుకొంటే శశికళ తరలింపు సాధ్యమేనని ఆమె లాయర్లు చెప్తున్నారు. మరోవైపు శశికళ న్యాయవాదుల అభ్యర్థనపై లీగల్ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్టు కర్ణాటక న్యాయశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది అసాధారణ కేసు కాబట్టి చట్టబద్ధంగా వీలైన మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. న్యాయనిపుణులు మాత్రం శశికళను చెన్నై జైలుకు మార్చే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడుతున్నారు. 'శశికళ కేసు భిన్నమైనది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆమె కర్ణాటక జైలులో ఖైదీగా ఉన్నారు. సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప ఆమెను మరో జైలుకు మార్చడం కుదరదు. సుప్రీంకోర్టుకు తెలియజేయకుంటే జైలు మార్పు ప్రక్రియ చేపడితే.. దీనిని సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశముంది' అని అక్రమాస్తుల కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య తెలిపారు. -

జయను చెన్నై జైలుకు తరలించండి
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను బెంగళూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించాలని సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను పరప్పణ ఆగ్రహారం జైలు నుంచి చెన్నైకి తరలించాలని పిటిషన్ లో కోరారు. జర్నలిస్ట్ హెరీన్ ప్రేస్ దీన్ని దాఖలు చేశారు. జయకు జైలు శిక్ష పడిన తర్వాత తమిళనాడులో ఆందోళనలు, బంద్ లు జరిగాయని తెలిపారు. జయ మద్దతుదారులు సాగించిన హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, ఆస్తుల ధ్వంసం జరిగిందని వెల్లడించారు. కావేరీ జలాల పంపిణీ వంటి సున్నిత విషయాలను దృష్టిలో పెట్టుకుని జయను సొంత రాష్ట్రానికి పంపించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది.