cherukupalli
-
దారుణం: ప్రియుడిని చంపి శవాన్ని ఇంట్లోనే..
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఉదంతం చెరుకుపల్లిలో వెలుగు చూసింది. వివరాలు.. గుంటూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటూ శిరీష అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చి రూ. 15 లక్షలు భరణం ఇచ్చేందుకు చిరంజీవి తన మెడికల్ షాపును విక్రయించాడు. ఆ డబ్బు మీద ఆశతో శిరీష చిరంజీవిని చంపాలని నిర్ణయించుకుంది. అయితే శిరీషకు మరోకరితో కూడా వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతడితో కలిసి చిరంజీవిని చంపేందుకు శిరీష పథకం రచించింది. అనుకున్నట్టుగానే ప్రియుడితో కలిసి చిరంజీవిని హతమార్చి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. మృతుడు తండ్రి సుబ్బారావు ఫిర్యాదుతో విషయం వెలుగులో వచ్చింది. చిరంజీవి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీషతో పాటు ఆమె ప్రియుడు భానుప్రకాష్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బ్రోతల్ కేసులో ఇరికిస్తా...
న్యాయం చేయండని వెళ్లిన దళిత మహిళకు ఎస్ఐ బెదిరింపు లాఠీతో కొట్టి దుర్భాషలాడిన వైనం అవమానంతో పురుగు మందు తాగిన బాధితురాలు.. పరిస్థితి విషమం రేపల్లె: న్యాయాన్యాయాలు చూడకుండా లాఠీతో చితకబాది, బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ ఎస్ఐ తీవ్రంగా బెదిరించడంతో ఓ దళిత మహిళ పురుగు మందు తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. తమ స్థలంలో ఉన్న మెట్లను ఎందుకు అక్రమంగా పగులగొడుతున్నారని ప్రశ్నించడమే ఆ మహిళ పట్ల శాపంగా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరుంబాకలో రోడ్డు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తమ ఇంటి వద్ద ఉన్న మెట్లను కూల్చడం అక్రమమని సువార్తమ్మ, ఆమె భర్త ఏసురత్నం శనివారం అడ్డుపడ్డారు. దీంతో తమ మాటకే ఎదురు చెబుతారా అంటూ సర్పంచ్ వేము ప్రసన్నత, ఆమె భర్త కిరణ్, మరికొందరు వీరిపై దాడి చేశారు. తమపై సర్పంచ్, ఆమె భర్త.. అనుచరులు దాడి చేశారంటూ బాధితులు సువార్తమ్మ, ఆమె భర్త ఏసురత్నం చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాత్రి ఎస్ఐ పి.భాస్కర్ సువార్తమ్మ, ఏసురత్నంలను స్టేషన్‌కు పిలిపించి దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సువార్తమ్మ ఇంటికొచ్చి ఆదివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తేగాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. ‘బ్రోతల్ కేసులో ఇరికిస్తా... అండమాన్ జైలుకు పంపిస్తా... ఇంటి చుట్టు పక్కల పది మందితో సంతకాలు చేయించుకుని అడ్రస్ లేకుండా చేస్తా.. ఇల్లు కూల్చేస్తా.. అంటూ బూతులు తిడుతూ నా తల్లిదండ్రులను ఎస్ఐ భాస్కర్ అవమానించారు. పోలీస్టేస్టేషన్‌లో లాఠీతో కొట్టడంతోనే మా అమ్మ పురుగుల మందు తాగింది. మా నాన్న ఆరోగ్యం బాగోలేదు. నా తల్లి చనిపోతే నా పరిస్థితేంటి? మాపై దాడి జరిగింది.. న్యాయం చేయండని వెళ్లిన మా అమ్మా నాన్నలను నిర్బంధించి లాఠీలతో కొట్టడం ఎంత వరకు న్యాయం’ అని సువార్తమ్మ కుమార్తె సీహెచ్ అనూష కన్నీటి పర్యంతమైంది. విచారించాం.. కొట్టలేదు రోడ్డు నిర్మాణానికి అడ్డు పడుతున్నారని గ్రామ సర్పంచ్ వేము ప్రసన్నత, కార్యదర్శి ఎం.కుమారి ఆరుంబాక గ్రామానికి చెందిన సువార్తమ్మ, ఏసురత్నంలపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిని స్టేషన్‌కు పిలిపించి విచారించిన మాట వాస్తవమే. ఎవరినీ దుర్భాషలాడలేదు. కొట్టలేదు. – భాస్కర్, ఎస్సై, చెరుకుపల్లి -
స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం
చెరుకుపల్లి: బ్రేకులు ఫెయిల్ కావటంతో స్కూలు బస్సు బోల్తా పడింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెం వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండలకేంద్రంలోని లిటిల్‌హార్ట్స్ స్కూలుకు చెందిన బస్సు కామినేని వారి పాలెం వైపు నుంచి విద్యార్థులతో వస్తోంది. మార్గమధ్యంలో బ్రేకులు పనిచేయకపోవటంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. -
ఆటో, బైక్ ఢీ : యువకుడు మృతి
గుంటూరు (చెరుకుపల్లి) : గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి వద్ద మంగళవారం ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాకా కోటేశ్వరరావు(21) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతిచెందిన యువకుడి స్వగ్రామం నగరం మండలం పెద్దవరం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
గుంటూరు : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ నడింపల్లి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. జిల్లా లోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌కు పట్టా పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు రూ.4 వేలు ఇవ్వాలని రెండు నెలలుగా వీఆర్వో వర్ధ వెంకటేశ్వర ప్రసాద్ డిమాండ్ చేస్తున్నాడు. దీంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా వీఆర్వో ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చెరుకుపల్లి) -
ప్రమాదంలో ‘డ్వాక్రా’..!
- రుణమాఫీ కాక, కొత్త అప్పు పుట్టక తిప్పలు ►బాబు హామీ నమ్మి రుణాలు చెల్లించని మహిళలు ►తీసుకున్న అప్పు కట్టితీరాలంటున్న బ్యాంకర్లు ►కొత్త రుణాల మంజూరులోనూ కోతలు.. చెరుకుపల్లి : డ్వాక్రా మహిళలను నిరాశ నిసృ్పహలు చుట్టుముడుతున్నాయి. నామమాత్రంగా రుణాలు మంజూరు చేయడం పట్ల నిర్వేదం చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే పాత రుణాలను రద్దు చేయని పక్షంలో సంఘాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. ►కొత్త ప్రభుత్వం వచ్చిన తరవాత గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ►గతంలో ఒక్కో గ్రూపునకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించ గా ప్రస్తుతం రుణాలు మంజూరు చేయటం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ►చెరుకుపల్లి మండలంలోని డ్వాక్రా గ్రూపు మహిళలు వివిధ బ్యాంక్‌ల్లో పొదుపు చేస్తున్నారు. గతంలో ఈ గ్రూపులన్నిటికీ కలిపి సుమారు రూ.50 కోట్లకు పైగా రుణాలను ఆయా బ్యాంక్‌లు అందించగా,ప్రస్తుతం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.10.5 కోట్లకు పరిమితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ►ఎన్నికలకు ముందు వడ్డీలేని డ్వాక్రా రుణాలను గ్రూపునకు రూ.10లక్షలకు వరకు అందజేస్తామని నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయంటున్నారు. ►గతంలో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ కొత్తరు ణాలు మంజూరు చేయకపోవటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ►ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరకపోవడం తో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ►ఆయన మాటలు నమ్మిన మహిళలు బ్యాంకులకు రుణాల చెల్లింపును నిలిపివేసి మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నట్టు మహిళలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ► చంద్రబాబు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో ఇప్పుడు తమ పరిస్థితి ‘ఇంటి కూటికి బంతికూటికి చెడ్డ’ చందంగా తయారైందని వాపోతున్నారు. ►పాత రుణాలు చెల్లించలేక, కొత్తరుణాలు పొందలేక సంఘాలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని,తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సంఘాలను బతికించాలని కోరుతున్నారు.