chicken sales
-
AP: చికెన్ తెగ తినేశారు
సార్వత్రిక పోరు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో చికెన్ విక్రయాలు రెట్టింపు స్థాయిలో జరిగాయి. నోటిఫికేషన్‌కు ముందు నుంచే విందు భోజనాల హడావిడి మొదలైంది. ఓట్ల పండుగలో నాన్‌వేజ్ వంటకాలెన్ని వడ్డించినా చికెన్‌దే సింహ భాగమైంది. రికార్డు స్థాయిలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు జరగ్గా, గత నెల రోజుల్లో మాంసాహార ప్రియులు రూ.435 కోట్లు విలువైన చికెన్‌ను లొట్టలేసుకుంటూ లాగించేశారు. సాక్షి, భీమవరం: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందు భోజనాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. చుట్టూ ఉన్న కేడర్‌ను కాపాడుకునేందుకు ఆశావాహుల ఇంట నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఈ సందడి మొదలవుతుంది. ఎన్నికల సమీపించే కొద్ది వివిధ సంఘాల వారికి విందులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో గత నెల రోజులోగా జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఆతీ్మయ కలయికల పేరిట రాజకీయ విందులే. అభ్యర్థులు తమ ఎన్నికల కార్యాలయాల వద్ద ప్రతి రోజు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. నామినేషన్లు, ప్రచార కార్యక్రమాల్లో కేడర్ కోసం ప్రత్యేక విందులు వడ్డించారు. మరో పక్క మండల, నియోజకవర్గ స్థాయిలో వివిధ సామాజిక వర్గాలు, ఆటో, తోపుడుబండ్లు యూనియన్లు, వివిధ వర్తక సంఘాలతో పాటు ఎక్కువగా ప్రజల్లో ఉండే పీఎంపీలు, పాస్టర్లు, డ్వాక్రా సంఘాల లీడర్లు తదితర వర్గాల వారికి పోటాపోటీగా ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహించారు. వారి కోసం ఏర్పాటు చేసిన విందు భోజనాల్లో చేప, రొయ్య వంటకాలు చేసినా మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే చికెన్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గరిష్ట స్థాయి విక్రయాలు సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.5 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఎన్నికల సంగ్రామం నేపథ్యంలో గత నెల రోజులుగా రాజకీయ పారీ్టల నేతల నుంచి హోల్‌సేల్ వ్యాపారులకు రోజూ వందల కిలోల చికెన్ ఆర్డర్లు వచ్చాయి. గత నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా అంతకు వారం పది రోజుల ముందు నుంచి చికెన్ ఆర్డర్లు రావడం మొదలైందని వ్యాపారులు అంటున్నారు. నామినేషన్లు, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్డర్ల జోరు మరింత పెరిగిందంటున్నారు. రోజువారి అమ్మకాలతో పోలిస్తే సగటున గత నెల రోజులుగా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయని వారు తెలిపారు. మునుపెన్నడూ ఇంత భారీస్థాయిలో వరుసగా అమ్మకాలు జరిగింది లేదంటున్నారు. కోళ్లు సిద్ధంగా.. ధర నిలకడగా ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, పెనుగొండ, నరసాపురం తదితర ప్రాంతాల్లోని ఫాంలలో ఏడు లక్షలకు పైగా కోళ్ల పెంపకం చేస్తున్నారు. బ్రాయిలర్ కోడి వేసవిలో 40 రోజులకు, శీతాకాలంలో మేత ఎక్కువగా తీసుకోవడం వలన 35 రోజుల్లోనే రెండు కేజీలు వరకు బరువు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. సాధారణంగా వేసవిలో ఎండల తీవ్రతకు కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతుంటాయి. వేసవి తాపం నుంచి వాటికి ఉపశమనం కలిగించేందుకు షెడ్లపై వాటర్ స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు తదితర వాటి ఏర్పాటుతో నిర్వహణ ఖర్చు తడిసిమోపెడవుతుంది. వేడి చేస్తుందన్న భావనతో చికెన్ వినియోగం తక్కువగా ఉండటం వలన డిమాండ్ లేక ధర పతనమవుతుంది. ఆయా కారణాలతో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వేసవిలో కొత్త బ్యాచ్‌లు తక్కువగా వేస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికల సీజన్ కావడం వ్యాపారం బాగుంటుందని ముందే ఊహించి కొత్త బ్యాచ్‌లు సిద్ధం చేయడం వారికి కలిసొచ్చింది. వేసవిలో కిలో రూ.220 నుంచి రూ.250 మధ్య పలికే చికెన్ ధర ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రూ.280 నుంచి రూ.300 మధ్య నిలకడగా ఉందని హోల్‌సేల్ వర్గాలు అంటున్నాయి. సగటున కిలో రూ.290 చొప్పున సాధారణ అమ్మకాలు మేరకు రోజుకు రూ.7.25 కోట్ల చొప్పున నెలకు రూ. 217.5 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. అయితే నెల రోజులుగా ఎన్నికల నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో జరిగిన అమ్మకాల మేరకు జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.435 కోట్లు మేర చికెన్‌ను మాంసాహారప్రియులు లాగించేశారంటున్నారు. -
అయ్య బాబోయ్.. రికార్డు స్థాయిలో చికెన్ లాగించేశారు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ప్రజలు సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో చికెన్ లాగించేశారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుమారు 60 లక్షల కిలోల చికెన్ కొనుగోలు చేశారు. ప్రధానంగా మటన్ కంటే చికెన్ వైపే ప్రజలు మొగ్గుచూపారు. ఇందుకు కారణం చికెన్ ధర మటన్ కంటే తక్కువగా ఉండటమే. మాంసం కిలో రూ.850– రూ.900 ఉండగా.. చికెన్ రూ.240 పలికింది. గ్రేటర్ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్ వినియోగం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. శుక్ర, శనివారాల్లో దాదాపు 30 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయినట్లు అంచనా. మామూలు రోజుల్లో మటన్ రెండు లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. ఇక ఆదివారం ఐదు లక్షల కిలోల మటన్ గ్రేటర్ ప్రజలు కొనుగోలు చేశారు. గత మూడు రోజుల్లో మటన్ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చదవండి: (మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి) -
అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలే: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమల వుతున్న నేపథ్యంలో మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మాంసం, కోడిగుడ్లు, చేపలను సక్రమంగా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖల అధికారులతో కలిపి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. ఈనెల 29న ఆదివారం వివిధ మార్కెట్లలో మాంసం, చికెన్, చేపలు సరిగా అందుబాటులో లేవని, ఉన్న మాంసాన్ని అధిక ధరలకు విక్రయించారనే ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యత, సరఫరాపై పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకిల్, పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్, స్నేహ చికెన్ అధినేత రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో గొర్రెలు, మేకల సరఫరా లేని కారణంగా మాంసం ధరలు పెరిగాయని చెప్పారు. గొర్రెలు, మేకల సరఫరాకు, విక్రయాలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మాంసం ధరలను నియంత్రిస్తామని, ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దని హామీ ఇచ్చారు. ప్రత్యేక అనుమతులు ఇస్తాం గొర్రెలు, మేకలను జంట నగరాలకు కానీ, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలకు కానీ తీసుకెళ్లి విక్రయించుకునేందుకు అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. గొర్రెలు, మేకలను తరలించే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ అన్ని జిల్లాల ఎస్పీలు, రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రను మంత్రి ఆదేశించారు. మటన్ విక్రయ దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గోశాలల్లో ఉన్న జీవాలకు పశుగ్రాసం కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే గోశాలల నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి కోరారు. వివిధ నీటి వనరులలో సైజుకు వచ్చిన చేపలను పట్టుకుని మత్స్యకారులు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణను ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన చేపల వ్యాపారులు ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్లి చేపలు తీసుకొచ్చి విక్రయించుకోవాలనుకుంటే వారికి కూడా అవసరమైన అనుమతులు ఇస్తామని, చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
భయం లేదు... లాగించేదాం
కంటోన్మెంట్/శాలిబండ : ‘బర్డ్ ఫ్లూ భయం లేదు.. ఎప్పటిలాగే చికెన్ వంటకాల్ని లాగించేయండి’ అంటూ చికెన్ ప్రియులకు పిలుపునిస్తున్నారు..‘వెన్‌కాబ్’ జనరల్ మేనేజర్ బాలసుబ్రమణ్యం. అంతేకాదు తమ సంస్థ ఆధ్వర్యంలో చికెన్ వంటకాల్ని వండి మరీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్‌లోని సిక్రోడ్లో ‘గోల్డెన్ చికెన్ మార్కెట్’ ఆవరణలో మంగళవారం సాయంత్రం చికెన్ వంటకాల ఉచిత పంపిణీ చేపట్టారు. చికెన్ పకోడీ, చికెన్ 65, లాలీపాప్, డ్రమ్‌స్టిక్స్... ఇలా ఐదారు రకాల చికెన్ వంటకాల్ని ప్రజలకు ఉచితంగా అందజేశారు. నిర్భయంగా చికెన్ వంటకాల్ని తినాల్సిందిగా ప్రజలకు సూచించారు. ప్రజల్లో అవగాహన కోసమే... బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ విక్రయాలు అమాంతం పడిపోయాయని, ప్రస్తుతం ‘ఫ్లూ’ ప్రమాదం లేకున్నా చికెన్ అమ్మకాలు పెరగడం లేదన్నారు. ప్రజల్లో అపోహలు తొలగించి గతంలో మాదిరిగానే చికెన్‌ను ఆదరించేలా చేయడం కోసమే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్థానిక నాయకులు శ్రీనివాస్, గోల్డెన్ చికెన్ మార్కెట్ ఎండీ అన్వర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా బహదూర్‌పురా ఫతేదర్వాజా వద్ద స్నేహ ఫ్రెష్ చికెన్ కంపెనీ చైర్మన్ రాంరెడ్డి ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహించారు. శాలిబండ డివిజన్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్, ఈ కార్యక్రమంలో పాతబస్తీలోని ఫౌల్ట్రీ యజమానులు, చౌక్ చికెన్ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు బషీర్, చికెన్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు. -
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ సేల్స్ ఢమాల్!!
దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ హబ్ గా పేరొందిన రంగారెడ్డి జిల్లాలో కోళ్లు, కోడిమాంసం విక్రయాలు కుదేలవుతున్నాయి. బర్డ్‌ప్లూ కారణంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతోపాటు, పలు గ్రామాల్లో చికెన్ సెంటర్లు వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. కోళ్లేకాదు.. కనీసం కోడి గుడ్లు కూడా కొనేందుకు కూడా జనం ఆసక్తి చూపడంలేదు. దీంతో పౌల్ట్రీఫాం, చికెన్ సెంటర్ల యాజమానులు తలలు పట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూర్‌లో బర్డ్‌ప్లూ వ్యాధి వెలుగు చూడడంతో లక్షల కోళ్లను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు చికెన్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదని, కోళ్ల పరిశ్రమ దెబ్బతినకుండా బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు వ్యాపారులు మొరపెట్టుకుంటున్నారు.