సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ప్రజలు సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో చికెన్ లాగించేశారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుమారు 60 లక్షల కిలోల చికెన్ కొనుగోలు చేశారు. ప్రధానంగా మటన్ కంటే చికెన్ వైపే ప్రజలు మొగ్గుచూపారు. ఇందుకు కారణం చికెన్ ధర మటన్ కంటే తక్కువగా ఉండటమే. మాంసం కిలో రూ.850– రూ.900 ఉండగా.. చికెన్ రూ.240 పలికింది. గ్రేటర్ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్ వినియోగం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
శుక్ర, శనివారాల్లో దాదాపు 30 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయినట్లు అంచనా. మామూలు రోజుల్లో మటన్ రెండు లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. ఇక ఆదివారం ఐదు లక్షల కిలోల మటన్ గ్రేటర్ ప్రజలు కొనుగోలు చేశారు. గత మూడు రోజుల్లో మటన్ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment