విద్యుత్‌శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడలోని విద్యుత్ విభాగంలో చీఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పి.జితేంద్ర ఇల్లు, ఆఫీసు, ఆయన బంధువుల ఇళ్లపై ఏక కాలంలో శనివారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
విజయవాడలోని పటమట హైస్కూల్ రోడ్డులోని ఆయన నివాసంతోపాటు, లహరి ఆస్పత్రి పక్క వీధిలోని ఆయన కార్యాలయంపై కూడా ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ దాడులు కొనసాగాయి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి వీఆర్ఓగా పనిచేస్తున్న ఆయన సోదరుడు ఉపేంద్ర ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.