Chief Minister of the state
-
రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారీ బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సాహా చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ప్రమాణం చేయించారు. సాహా తోపాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో గెలిచి మెజారిటీ మార్కును సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహాను ప్రధాని అభినందించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ముగ్గురు గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ కూటమి పార్టీ ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) పార్టీ నేత కూడా ఉన్నారు. సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చిన కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిమా బౌమిక్ కేబినెట్లో చేరలేదు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలకు నిరసనగా విపక్ష వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి. తిప్రా మోతా చీఫ్‌తో షా భేటీ ‘గ్రేటర్ తిప్రాల్యాండ్’ సాధన కోసం ఉద్యమసంస్థగా మొదలై తర్వాత రాజకీయ పార్టీగా మారిన తిప్రా మోతా తరఫున ఆరుగురు సభ్యుల ప్రతినిధుల బృందం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయింది. అగర్తలాలో మొదలైన భేటీలో తిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ కిశోర్ దేవ్ బర్మన్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, నూతన సీఎం మాణిక్ సాహా సైతం పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమని, త్రిపుర ట్రైబల్ అటానమస్ కౌన్సిల్‌కు శాసన, ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతున్న విషయం తెల్సిందే. -
స్లమ్ డ్యాన్స్ మిల్లియనీర్
ఒక క్రికెట్ మ్యాచ్ గెలవాలని ఊళ్లకు ఊళ్లు నిద్రమానేసి ప్రార్థించడం చూశాం. ఒక సినిమా నటుడో నటో వస్తుంటే జనం బారులు తీరి నిలబడడం చూశాం. కాని ఒక లోకల్ డ్యాన్సర్ కోసం ఇలాంటివన్నీ జరగడం ఎప్పుడైనా చూశామా? సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆ కుర్రాడి గెలుపు కోసం ఓటేయడం, ఎకరాల భూమిని నజరానాగా అందించడం చూశామా? తన నృత్య ప్రావీణ్యాన్నే స్టేట్ మొత్తాన్నీ తన అభిమానులుగా మార్చుకునేందుకు ‘స్టెప్పింగ్’ స్టోన్‌గా మార్చుకున్న ఒడిశా యంగ్‌స్టార్ కృష్ణమోహన్‌రెడ్డి (30) తనలాంటి మరికొందరు బస్తీ కుర్రాళ్లను జత చేసుకుని స్థాపించిన ప్రిన్స్ డ్యాన్స్ గ్రూప్.. ఇప్పుడు దేశంలోని టాప్ డ్యాన్స్ టీమ్‌లలో ఒకటి. ఇంతా చేసింది ఈ మన తెలుగోడే కావడం విశేషం. ఇటీవల హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్లో ఉర్రూతలూగించిన కృష్ణమోహన్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. ‘మా తాతల కాలం నాడు పలాస దగ్గరలోని నౌపడాలో ఉండేవాళ్లు. మా నాన్న ఎలక్ట్రికల్ లైన్‌మన్. అమ్మ గృహిణి. నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్కాచెల్లెళ్లున్న పెద్ద కుటుంబం మాది. ఎలా అబ్బిందో గాని నాకు డ్యాన్స్ తప్ప మరేమీ వచ్చేది కాదు. టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలు చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను. 2005లో స్కూల్ చదువు పూర్తి చేశాక ఇంటి ఖర్చులు, డ్యాన్స్ క్లాసెస్ ఫీజుల కోసం ఏ పని దొరికితే అది చేశాను. అప్పుడే నాలాంటి ఏడుగురు యువకులతో ఓ బృందాన్ని తయారు చేశాను. కార్ఖానా నుంచి క్యాంటీన్ దాకా పని చేసేవాళ్లకు పాటలే కదా ఊపు. అలా ఊపులో స్టెప్స్ వేస్తూ పని చేసేవాళ్లను చూశాక.. వీళ్లు మంచి డ్యాన్సర్లు అవుతారన్న నమ్మక ం కలిగింది. కుర్రాళ్లకు క్యాచీగా ఉంటుందని.. ప్రిన్స్ డ్యాన్స్ గ్రూప్ పేరు పెట్టాను. ఏడాదిలో మా బృందంలో డ్యాన్సర్స్ సంఖ్య 16కు చేరింది. స్థానికంగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చాం. 2006లో ఒడిశా నుంచి బూగీ వూగీ (సోనీ)లో పార్టిసిపేట్ చేశాం. రన్నర్స్‌గా నిలిచి రూ.75 వేలు గెలుపొందాం. మా టీమ్‌కు మలి బ్రేక్ ఇండియా గాట్ టాలెంట్. ఇంటర్నేషనల్ స్థాయికి చేరాలని.. మాలో పాతిక మంది బృందం కలర్స్ టెలివిజన్ ఇండియాస్ గాట్ టాలెంట్ అడ్వర్టయిజ్మెంట్ చూసి అప్లయ్ చే శాం. మైథలాజికల్ బేస్డ్ కాన్సెప్ట్ తీసుకుని పెర్ఫార్మెన్స్ ఇచ్చాం. దీనిలో పాల్గొనడం కోసం అప్పు కూడా చేశాం. గెలిచాం. రూ.50 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. మా సీఎం నవీన్ పట్నాయక్ మాకు 4 ఎకరాల భూమిని, గోపాల్‌పూర్‌లో భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారు. తర్వాత దేశ విదేశాల్లో వెయ్యికి పైగానే షోస్ ఇచ్చాం. కామన్వెల్త్గేమ్స్లో ఒడిశా తరఫున ఓపెనింగ్ సెర్మనీకి రిప్రజెంట్ చేసింది మా గ్రూప్, ప్రస్తుతం 50 మంది ఉన్న మా బృందంలో ఎవరికీ ఆర్థిక ఇబ్బందుల్లేవు. అంతర్జాతీయ స్థాయి డ్యాన్స్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయడమే తదుపరి లక్ష్యం. అమెరికా, లండన్లలో జరిగే పోటీల్లో మేం పాల్గొనేందుకు ప్రభుత్వం మమ్మల్ని స్పాన్సర్ చేయనుంది’ అంటూ వివరించాడు కృష్ణమోహన్. హైదరాబాద్‌కు తరచూ వస్తుంటానని, తన అన్నయ్య, డ్యాన్స్‌లో తనకు గురుతుల్యుడు హరినాథ్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాడని చెప్పాడు. ఊరికిచ్చిన కారు.. ఇండియా గాట్ టాలెంట్‌లో వీరి గెలుపు కోసం రాష్ట్రం మొత్తం తపించడం, తమ ఊర్లోనైతే అర్ధరాత్రి దాకా టీవీలకు అతుక్కుపోవడాన్ని గురించి చెబుతున్నప్పుడు కృష్ణమోహన్ కళ్లలో తన రాష్ట్రప్రజల పట్ల అంతులేని కృతజ్ఞతాభావం కనిపిస్తుంది. తనకు బహుమతిగా వచ్చిన మారుతి రిట్జ్ కారును ఊరి ప్రజలకు ఎమర్జన్సీలో ఫ్రీ సర్వీస్‌గా అంకితమిచ్చాడు. వ్యక్తిగత ప్రతిభకు తోటివారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే గుణం కూడా తోడైతే.. స్లమ్ బాయ్ కూడా సూపర్ ఫేమ్ సాధించగలడని నిరూపించిన మన తెలుగు తేజానికి జేజేలు. బడి దాటని చదువులు.. ప్రిన్స్ డ్యాన్స్ గ్రూప్ ఉన్న సభ్యుల్లో అత్యధికులు 5 నుంచి 10 వతరగతిలోపు మాత్రమే చదువుకున్నవారు. గ్రూప్ ప్రారంభించిన కృష్ణమోహన్‌రెడ్డి అతి కష్టమ్మీద ప్లస్ టూ దాకా వస్తే, పూర్ణదాస్, అర్జున్‌కుమార్ సాహు, శిబదాస్లు 5వ తరగతి సింహాద్రి దాస్, శ్రీకాంత్‌దాస్ 3వ తరగతి, సంతోష్‌దాస్ 2వతరగతి, ఇలా ప్రైమరీ స్కూల్ దాటనివారే అధికం. ఇక పోలియోతో ఫిజికల్లీ హ్యాండీక్యాప్ అయి, కర్రల సాయంతో పాల్గొన్నపద్మనాభసాహు, తులు త రిణిలు 7వ తరగతి వరకూ చదివి వీరితో పదం కదపడం విశేషం. -
నిరసన జ్వాల
- శ్రీలంక వెబ్సైట్లో అమ్మపై అనుచిత కార్టూన్ - అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన - క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం శ్రీలంక వెబ్సైట్లో జయలలితను అవమానిస్తూ ఒక కార్టూన్‌ను పొందుపరిచారు. అందులో జయలలిత, ప్రధాని మోడీకి రాసే లేఖలను, ప్రేమ లేఖలుగా వర్ణించడంపై తమిళనాట నిరసన జ్వాలలు రేగారుు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మలను తగులబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలోని దౌత్య కార్యాలయూన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది. టీ.నగర్: శ్రీలంక సైనిక వెబ్సైట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను కించ పరిచే విధంగా ఒక కార్టూన్ చిత్రం విడుదలైంది. దీంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, తమిళ ప్రజలు అనేక చోట్ల శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు తెలిపారు. నుంగంబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు భద్రతా సిబ్బంది అడ్డుకోగా వారు లయోలా కళాశాల సమీపంలో ఆందోళనకు దిగారు. ఆ తరువాత శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు మూడు గంటల సేపు వాహన రాకపోకలు స్తంభించాయి. నుంగంబాక్కంలో అన్నాడీఎంకే నేత ఆధ్వర్యం లో అన్నాడీఎంకే మహిళా కార్యకర్తలు, శ్రీలంక చర్యలకు నిరసనగా ఆందోళన జరిపారు. శ్రీలంక ప్రభు త్వ భద్రతా శాఖకు విడిగా ఒక వెబ్సైట్ ఉంది. భద్రతా శాఖ కార్యదర్శిగా శ్రీలంక అధ్యక్షుడు రాజ పక్సే సోదరుడు కోత్తప్పయే ఉన్నారు. ఈయన పర్యవేక్షణ కింద పని చేసే ఈ వెబ్సైట్లో ముఖ్యమంత్రి జయలలిత వైఖరికి వ్యతిరేకంగా ఒక వ్యాసం విడుదలైంది. శ్రీలంక రచయిత ఒకరు జయలలిత రాష్ట్ర జాలర్ల సమస్య గురించి ప్రధాని మోడీకి లేఖలు రాయడాన్ని విమర్శించారు. ఇందులో జయలలిత అనవసరంగా లేఖలు రాస్తున్నారని, దీంతో మోడీకి మాత్రమే సమస్యలు ఏర్పడుతున్నాయని, మోడీజయలలిత ఆదేశాల మేరకు నడుచుకోరని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాసాలకు శ్రీలంక ప్రభుత్వం బాధ్యత వహించదని పేర్కొన్నప్పటికీ ఆ వ్యాసానికి సంబంధించి జయలలిత మోడీకి రాస్తున్న లేఖను ప్రేమలేఖను రాస్తున్నట్లు చిత్రించి అవమానించార ని చెప్పారు. ఈ చర్య రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నేతలు దీనిపై నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో వైగో, రాందాసు, పళ నెడుమారన్ ఉన్నారు. వ్యాపార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెల్లయ్యన్ ఈ చర్యను ఖండిస్తూ రాజపక్సే దిష్టిబొమ్మను తగలబెట్టనున్నట్లు ప్రకటించారు. శ్రీలంక క్షమాపణ జయలలితను కించపరిచే విధంగా శ్రీలంక సైనిక వెబ్సైట్లో కార్టూన్ విడుదల చేయడం పట్ల శ్రీలంక ప్రభుత్వం జయలలితకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు తెలిపింది.