child body
-
స్కూటీపై చిన్నారి మృతదేహం తరలింపు!
మహారాణిపేట/ముంచంగిపుట్టు/సాలూరు/సాక్షి, అమరావతి : అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ సిద్ధం చేస్తుండగానే తల్లిదండ్రులు స్కూటీపై తీసుకెళ్లడం కలకలం రేపింది. అధికారులు మార్గమధ్యంలో గుర్తించి, మృతదేహాన్ని అంబులెన్స్‌లో వారి సొంతూరుకు తీసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన చిన్న మత్స్యరాజు, మహేశ్వరి దంపతులకు ఈ నెల 2వ తేదీన పాడేరు ఆస్పత్రిలో మగ శిశువు జన్మించాడు. బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో జన్మించడం వల్ల పాడేరు ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్ పిల్లల వార్డుకు రిఫర్ చేశారు. అదే రోజున శిశువును కేజీహెచ్ పిల్లల వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఎన్ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు కేజీహెచ్‌లోని గిరిజన సెల్ ఇన్చార్జి రామకృష్ణకు తెలిపారు. శిశువు మృతదేహం తరలింపునకు వాహనం సిద్ధం చేస్తూండగానే.. తండ్రి ద్విచక్ర వాహనంపై తీసుకొని వెళ్లినట్టు ఆయన పాడేరు డీఎంహెచ్‌వో, ఐటీడీఏ పీవోకు సమాచారమిచ్చారు. ఈ విషయం కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన తక్షణం స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో సిబ్బంది మృత శిశువును తీసుకెళ్తున్న స్కూటీని పాడేరు వద్ద గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో కుముడు గ్రామానికి తరలించారు. కేజీహెచ్ సిబ్బంది సరిగా స్పందించనందుకే తామిలా తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. విచారణకు ఆదేశం ఈ ఘటనపై విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లను సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సాలూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీడీఏ అంబులెన్స్‌కు ఆయిల్ పట్టించుకుని వస్తామని సిబ్బంది తెలిపినప్పటికీ వినకుండా సదరు వ్యక్తులు ఎవరి ప్రోద్బలంతోనో వెళ్లిపోయారన్నారు. అయినప్పటికీ మార్గం మధ్యలో వారిని గుర్తించి, అంబులెన్స్‌లో శిశువు మృతదేహాన్ని తరలించారని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా సీఎంకు మానవత్వం లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనులకు మంచి వైద్యం కోసం సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ విచారణ చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. -
ఏ తండ్రికి ఈ కష్టం రావొద్దు.. బైక్‌పై కూతురి మృతదేహంతో..!
సాక్షి, ఖమ్మం: చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది. స్వగ్రామం తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్ లేదు. ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె తండ్రి.. గుండెలనిండా దుఃఖాన్ని నింపుకొని బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాడు. ఈ హృదయవిదారక సంఘటన ఖమ్మం జిల్లాలోని ఏకనూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కొత్త మేడేపల్లి గ్రామంలోని గిరిజన వర్గానికి చెందిన వెట్టి మల్లయ్య కూతురు వెట్టి సుక్కి(3) కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఏకనూరు ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లా మాతా, శిశు సంక్షేమ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పాప మృతి చెందింది. అయితే, ఆమె మృతదేహాన్ని 65 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామం కొత్త మేడేపల్లికి తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులేక ద్విచక్రవాహనంపై తరలించాడు ఆమె తండ్రి వెట్టి మల్ల. ఆసుపత్రి అంబులెన్స్ ఇవ్వనన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: ధనబలం, అంగబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: పాల్వాయి స్రవంతి -
రైలులో మగశిశువు మృతదేహం
గుంతకల్లు : ఎక్స్‌ప్రెస్ రైలులో మగశిశువు మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జీఆర్పీ పోలీసులు, ప్రయాణికులు తెలిపిన మేరకు.. తిరుపతి నుంచి బయల్దేరిన నిజామోద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో స్లీపర్ కోచ్-8లో ఎవరో పింక్ కలర్ చీరలో మృత మగశిశువును చుట్టి వదిలేశారు. కొందరు ప్రయాణికులు గుర్తించి గుంతకల్లు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. రైలు గుంతకల్లు స్టేషన్‌కు చేరుకున్న వెంటనే పోలీసులు కోచ్‌లోని మృతశిశువును స్వాధీనం చేసుకుని, అంత్యక్రియలు పూర్తి చేశారు. -
కాలువలో పడిన బాలుడి మృతదేహం లభ్యం
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో కాలువ పడి గల్లంతైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. పాలకొల్లు రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన గుమ్మల రాజేష్(7) అనే రెండవ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ సోమవారం నర్సాపురం-నిడదవోలు ప్రధాన కాలువలో పడిపోయాడు. సోమవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టినా దొరకలేదు. మంగళవారం మధ్యాహ్నాం పెంకులపాడు గ్రామం వద్ద బాలుడి శవం కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
మురికి కాల్వలో చిన్నారి మృతదేహం
కఠిన మనస్కులు ఏడాది వయసున్న ఓ పాప మృతదేహాన్ని మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు. విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న మురికి కాల్వలో ఓ చిన్నారి మృతదేహం శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. -
మురికి కాలువలో చిన్నారి మృతదేహం
తూర్పుగోదావరి: అప్పుడే పుట్టిన పసికందును మురికి కాలువలో వదిలేసి వెళ్లారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామంలోని మురికి కాలువలో మగశిశువును గుర్తించిన స్థానికులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.