Child line staff
-
అమ్మ కడుపు నుంచి ముళ్ల పొదల మధ్యకు..
సాక్షి,ఇచ్ఛాపురం: నిశ్శబ్దంగా శ్మశానం. గాలి తప్ప ఇంకో అలికిడి లేని వాతావరణం. ఇంకా వెలుతు రు పరుచుకోని సమయం. ఎవరు వదిలి వెళ్లారో.. ఎందుకు వదిలి వెళ్లిపోయారో.. అమ్మ కడుపు గడప దాటి అప్పుడే బయటకు వచ్చిన ఓ మగ శిశువు ఏడుపు శ్మశానాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముళ్ల పొదల మధ్య ఒళ్లంతా చీమలు కుడుతూ ఉంటే ఏడవడం తప్ప ఇంకేం చేయలేని ఆ పసి వాడి రోదన ఇచ్ఛాపురం పరిధిలోని కండ్రవీధి శ్మశానంలో అలజడి రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బుధవారం వేకువ జామున కండ్రవీధికి చెందిన చంద్రమణి బెహరా బహిర్భూమి కోసం శ్మశానం సమీపానికి వెళ్లారు. అక్కడ ముళ్ల పొద ల మధ్య నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడకు వెళ్లి చూడగా.. బ్యాగ్‌లో అప్పుడే పుట్టి న మగ శిశువు కనిపించాడు. బాబును పరిశీలిస్తే శరీరమంతా చీమలు కనిపించాయి. వెంటనే ఆయన బాబును ముళ్ల పొదల నుంచి బయటకు తీసి శరీరాన్ని శుభ్రం చేశారు. చుట్టుపక్కల ఎవ రూ కనిపించకపోవడంతో ఎవరో కావాలనే వది లి వెళ్లిపోయారని నిర్ధారించుకుని ఆ పసివాడిని ఇంటికి తీసుకెళ్లారు. చంద్రమణి బెహరా దంపతులకు వివాహమై 30 ఏళ్లయినా సంతానం లేదు. దీంతో ఈ మగ శిశువును పెంచుకోవచ్చని ఆశ పడ్డారు. బాబుకు స్నానం చేయించి వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది చంద్రమణి బెహరా దంపతుల నుంచి శిశువును స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం శ్రీకాకుళంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే బాబును చంద్రమణి బెహరా దంపతులకే ఇచ్చేయాలని స్థానికులంతా అధికారులను కోరినా వారు ఒప్పుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రీకాకుళంలోని శిశు సంరక్షణ కేంద్రం నుంచి తెచ్చుకోవాలని గెస్ట్ చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ జాస్మిన్ వారికి సూచించారు. -
Warangal: నా పెళ్లి ఆపండి సార్..!
డోర్నకల్(వరంగల్) : ‘మైనార్టీ తీరకుండానే నాకు వివాహం చేయాలని చూస్తున్నారు.. నాకు చదువుకోవాలని ఉంది. ఈ వివాహాన్ని ఎలాగైనా అడ్డుకోండి సార్’ అంటూ ఓ బాలిక స్వయంగా చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా, బాలికను సన్మానించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన బాలిక (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేందుకు సిద్ధం కావడంతో ఆ బాలిక.. చైల్డ్‌లైన్ నంబర్ 1098కు సమాచార మిచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు మంగళవారం గ్రామానికి చేరుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనార్టీ తీరాకే వివాహం చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. అనంతరం బాలికను సన్మానించారు. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది లక్ష్యమని బాలిక తెలిపింది. కాగా, గ్రామంలో మరో బాల్య వివాహాన్ని కూడా అధికారులు అడ్డుకున్నారు. చదవండి: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ -
విశాఖ కేంద్రంగా పసికందుల విక్రయం
-
సృష్టి హాస్పటల్దే కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా పసికందులను విక్రయిస్తున్న ఆస్పత్రి గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. నగరంలోని జిల్లా పరిషత్ జంక్షన్ ప్రాంతంలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నమ్రతను ఆమెకు సహకరించిన మరో వైద్యురాలు తిరుమల, ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ, పసికందును కొనుగోలు చేసిన తల్లిదండ్రులతోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాలివీ.. (ఆస్పత్రి మాటున అరాచకం) ► విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన జలుమూరి సుందరమ్మ(34) అనే మహిళకు భర్త చనిపోయాడు. మరొకరితో సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. ► ఈ విషయం తెలుసుకున్న అదే మండలానికి చెందిన ఆశా కార్యకర్తలు, ఏజెంట్ అర్జి రామకృష్ణ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని చెప్పారు. ► సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను ఈ ఏడాది మార్చి 9న యూనివర్సల్ సృష్టి హాస్పిటల్లో చేర్చగా.. అదే రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ► ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసిన తరువాత ఆస్పత్రి ఎండీ నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు విక్రయించారు. ► సుందరమ్మ గర్భవతిగా ఉండగా వి.మాడుగుల మండలంలో ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పొందేది. అక్కడి అంగన్వాడీ టీచర్ సరోజినికి సుందరమ్మ బిడ్డ విషయమై అనుమానం వచ్చి మార్చి 14న చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చింది. ► చైల్డ్‌లైన్ సిబ్బంది విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకొచ్చి శిశు గృహలో చేర్పించారు. ► అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పసికందుల విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ► డాక్టర్ నమ్రతను కర్ణాటక రాష్ట్రంలోని దేవనగిరిలో అరెస్ట్ చేశామని, ఏజెంట్ అర్జి రామకృష్ణ, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులతోపాటు ముఠాలో మిగిలిన నలుగురినీ అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ చెప్పారు. -
పెళ్లి పీటలపై ఆగిన బాల్యవివాహం
బషీరాబాద్(తాండూరు) వికారాబాద్ : బాల్య వివాహాన్ని పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ ఘటన బషీరాబాద్ మండలం నవల్గ పంచాయతీ పరిధిలోని బోజ్యానాయక్ తండాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోజ్యానా యక్ తండాకు చెందిన బాలిక (16) అదే పంచాయతీ పరిధిలోని బాబునాయక్ తండాకు చెందిన రాథోడ్ రమేష్ అనే యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే 1098కు బాల్యవివాహం జరుగుతుందని సమాచారం వెళ్లడంతో వెంటనే చైల్డ్‌లైన్ ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, వెంకటేష్, పోలీసులు బోజ్యానాయక్ తండాకు చేరుకున్నారు. బాలికకు పెళ్లి వయసు రాలేదని, పెళ్లిని నిలుపుదల చేశారు. దీంతో ఒక్కసారిగా పెళ్లి పందిరిలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వధూవరులను, పెళ్లి పెద్దలను బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి ఉంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు వారిని తహీసల్దార్ వెంకటయ్య ఎదుట బైండోవర్ చేశారు. బాలికకు పెళ్లీడు వచ్చే వరకు పెళ్లి చేయమని తల్లిదండ్రులు ఒప్పంద పత్రం రాసిచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఇరుకుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
చైల్డ్‌లైన్ కార్యాలయంలో తప్పిపోయిన బాలలు
విజయనగరం ఫోర్ట్ : తప్పిపోయిన బాలలు నలుగురు చైల్డ్‌లైన్ 1098 సంస్థ కార్యాలయానికి చెంతకు చేరారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం టి.బరంపురానికి చెందిన కుంది రాజ్‌కుమార్ అనే పదేళ్ల బాలుడు, కుంది కార్తీక్ అనే ఆరేళ్ల బాలుడు, రోహిత్ బెహరా అనే 11 ఏళ్ల బాలుడు, అక్షయ్ బెహరా అనే 12 ఏళ్ల బాలుడు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని వన్‌టౌన్ పోలీస్ కానిస్టేబుల్ సత్యమోహన్ చైల్డ్‌లైన్ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ సభ్యులు బాలలు నలుగురిని చైల్డ్‌లైన్ కార్యాలయానికి తీసుకుని సంరక్షించారు. కార్యాలయంలో చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ ఎస్.రంజిత, వరలక్ష్మి, సతీష్ తదితరులు పాల్గొన్నారు -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న చైల్డ్ లైన్ సిబ్బంది
దౌల్తాబాద్: మండలంలోని గుండేపల్లి గ్రామంలో శనివారం బాల్యవివాహాన్ని చైల్డ్ లైన్ సిబ్బంది అడ్డుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... గుండేపల్లి గ్రామానికి చెందిన కోటకొండ నర్సప్ప (32) దామరగిద్ద మండలం విఠలాపూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయితో శనివారం కర్నాటక రాష్ట్రం మోతక్‌పల్లి బలభీమసేన దేవాలయం దగ్గర వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయం చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లిని నిలిపివేశారు. అనంతరం దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వారిని పిలిపించి ఎస్సై చంద్రశేఖర్ సమక్షంలో హమీ పత్రం రాసుకున్నారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ హన్మంత్‌రెడ్డి, ప్రసాద్ ఉన్నారు. బాల్యవివాహాలు జరిపితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. -
ఇద్దరు బాలికల గృహనిర్బంధం.. రేప్
సాక్షి హన్మకొండ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి ఇద్దరు బాలికలు పారిపోయి వరంగల్ జిల్లాకు వచ్చారు. రైల్వేస్టేషన్లో దిగిన వారిపై కామాంధుల కళ్లుపడ్డాయి. మూడు రోజులు గృహ నిర్బంధంలో ఉంచి నలుగురు తమ కామవాంఛ తీర్చుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు మంగళవారం హాస్టల్ నుంచి పారిపోయివచ్చినట్లు తెలుస్తోంది. వీరు అదే రోజు సాయంత్రం సమయంలో వరంగల్ రైల్వేస్టేష న్లో ఉండగా, గమనించిన విశ్వనాథ్, సతీష్ అనే చిల్లర వ్యాపారులు వారితో మాటలు కలిపారు. తమవెంట వస్తే భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి పంపుతామని నమ్మబలికారు. దీంతో వారిని నమ్మి వెళ్లారు. ఆ రాత్రి విశ్వనాథ్, సతీష్‌లు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం మొత్తం రాత్రి నుంచి గమనించిన నజీర్, రాజేష్‌లు బాలికల విషయంలో విశ్వనాథ్, సతీష్‌లను నిలదీశారు. దీంతో వారికి అసలు విషయం చెప్పారు. బాలికలను తమకు అప్పగించాలని నజీర్, రాజేష్‌లు బ్లాక్మెయిల్ చేసినట్లు సమాచారం. దీంతో ఇద్దరు అమ్మాయిలను వారికి అప్పగించారు. వారు బాలికలను మరో ఇంట్లో బంధించి గురు, శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, ఇద్దరు బాలికల్లో ఒకరు శుక్రవారం తప్పించుకుని రైల్లో విజయవాడ పారిపోయింది. అక్కడ, ఆమెను చైల్డ్‌లైన్‌వారు చేరదీయగా, విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి చైల్డ్‌లైన్ సిబ్బంది వరంగల్‌కు చేరుకుని బాలిక చెప్పిన వివరాలు ప్రకారం ఆరా తీశారు. బాలికలను మొదట తీసుకెళ్లిన ఇద్దరిలో ఒకడైన సతీష్ దొరికాడు. కాగా, అతని ద్వారా రెండో బాలిక కోసం ఆరాతీస్తున్నారు. శనివారం రాత్రి వరకూ సదరు బాలిక ఆచూకీ లభించలేదు. అయితే బాకలిను వదిలేశారా... లేక విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఇంకేమైనా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవతున్నాయి. కాగా, బాధిత బాలికల బంధువులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు జిల్లా సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అనితారెడ్డిని కలసి విషయం తెలిపారు. -
మూడు బాల్య వివాహాలకు బ్రేక్
మూడు ముళ్లు పడకుండానే ఆగిన పెళ్లిళ్లు ఏటూరునాగారం, అప్పల్రావుపేట, బూరుగుపాడు దుబ్బతండాలో ఘటనలు ఏటూరునాగారం : పోలీసులు, ఐసీడీఎస్ అధికారిణులు, చైల్డ్‌లైన్ సిబ్బంది కలిసి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో మూడు బాల్య వివాహాలను నిలిపి వేశారు. పెళ్లి సిద్ధమైన బంధువులను ఆయా పోలీస్స్టేషన్లకు తరలించి విచారించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రం లోని ఎర్రల్లవాడకు చెందిన బట్టు శ్రీలత(16) తండ్రి పోతరాజు చిన్నతనంలో మృతి చెందా డు. ఆమె హన్మకొండలో ఇంటర్ పూర్తి చేసింది. అన్ని తానై పోషించిన తల్లి భాగ్యలక్ష్మి శ్రీలతకు ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడేనికి చెందిన రామెళ్ల రమేష్‌తో వివాహం చేసేం దుకు సిద్ధమైంది. వారు కల్యాణ మండపం, భోజనాల ఏర్పాటు కూడా చేసుకున్నారు. అరుుతే శ్రీలత మైనర్ అని గుర్తుతెలి యని వ్యక్తి ఐసీడీఎస్ సీడీపీఓ భాగవతం రాజమణికి, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్సై వినయ్‌కుమార్ వెళ్లి వధువు శ్రీలత, వరుడు రమేష్‌ను స్టేషన్‌కు తరలించారు. శ్రీలతకు, ఆమె తల్లి భాగ్యలక్ష్మికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, అంగన్వాడీ కార్యకర్తలు ఇర్సవడ్ల సరో జ, కొండ పద్మలు కౌన్సెలింగ్ ఇచ్చారు. వరుడు రమేష్, తల్లిదండ్రులకు ఎస్సై వినయ్‌కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. అప్పల్‌రావుపేటలో.. నెక్కొండ : మండలంలోని అప్పల్రావుపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ఈ నెల 17న జరుగనున్న బాల్యవివాహానికి చైల్డ్‌లైన్ సిబ్బంది, పోలీసులు బుధవారం బ్రేక్ వేశారు. అప్పల్‌రావుపేటకు చెందిన బాలికకు ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందినఅబ్బాయితో పెళ్లి చేయూలని ఇరువైపుల పెద్దలునిశ్చరుుంచారు. అరుుతేఈ సమాచారంఫోన్ద్వారా తెలుసుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది స్థానిక పోలీసులు, అంగన్వాడీ సిబ్బంది బాలి క ఇంటికి చేరుకున్నారు. ఆమె త ల్లిదండ్రులకు ఎస్సై మిథున్ కౌన్సెలింగ్ ఇ చ్చారు. బాల్య వి వాహం చేస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం లోచైల్డ్లైన్ సిబ్బం ది బెజ్జంకి ప్రభాకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు జి.ఫాతిమా, ఏసీడీఎస్ కౌన్సిలర్ మాధవి, సర్పంచ్ వడ్డె రజిత సురేష్, వార్డు సభ్యులు రమేష్ పాల్గొన్నారు. దుబ్బ తండాలో... డోర్నకల్ : ఈ నెల 10న జరగాల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీస్ అధికారులు, 1098 చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు నిలిపివేశారు. మండలంలోని బూరుగుపాడు శివారు దుబ్బతండాకు చెందిన రాంజీ, చాంది దంపతుల 15 ఏళ్ల కుమార్తెకు ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన దారావత్ కుమార్‌తో ఈ నెల 10న వివాహం చేసేందుకు నిశ్చయించారు. బాలికకు వివాహం చేస్తున్నారని తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ నాగమల్లీశ్వరి, సూపర్వైజర్ రేఖ, 1098 చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు వెంకటేష్ తదితరులు దుబ్బతండాకు వెళ్లారు. వారి రాకను పసిగట్టిన తల్లిదండ్రులు బాలికను ఇంట్లో పెట్టి తాళం వేసి బయటికి వెళ్లారు. ఈ విషయమై సమాచారం అందడంతో తాళం పగులగొట్టేందుకు అధికారులు సిద్ధమవగా బాలిక తల్లి చాంది వచ్చి తాళం తీసింది. ఇంట్లోనే బాలిక ఉండటంతో వెంటనే ఐసీడీఎస్ కార్యాలయానికి తరలించి బాలికతోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను వరంగల్‌లోని స్వధార్ హోంకు తరలించారు.