child sacrifice
-
600 ఏళ్ల క్రితం అతిపెద్ద బాలల నరబలి
-
గుట్టలుగా చిన్నారుల కంకాళాలు
లిమా: చరిత్రలోనే అతిపెద్ద నరబలిని పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పెరూకు ఉత్తర ప్రాంతంలో వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొలంబియన్ పూర్వపు చిమూ నాగరికతకు చెందిన చిన్నారులను పెద్ద మొత్తంలో బలి ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తాజాగా 140 మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడ్డ హువాన్చాకో సమీపంలోని పంపా లా క్రూజ్ ప్రాంతంలో ఈ శవాల దిబ్బ బయటపడటం విశేషం. (అతిపెద్ద బాలల నరబలి) అయితే ప్రస్తుతానికి 56 అస్థిపంజరాలను వెలికీ తీసినప్పటికీ.. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపేకొద్దీ వందల కొద్దీ అవశేషాలు బయటపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాటిన్ అమెరికన్ దేశమైన పెరూలో వందల ఏళ్ల క్రితం చిన్నారులను బలి ఇచ్చే సంప్రాదాయం ఉండేది. ప్రస్తుతం లభ్యమైన కంకాళాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీరందరినీ దాదాపు ఒకేసారి బలి ఇచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కార్బన్ డేటింగ్ పద్దతిలో ఇవి సుమారు 600 ఏళ్ల క్రితం చెందినవిగా నిర్ధారించారు. నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఈ పరిశోధనకు నిధులు సమకూరుస్తుండటం విశేషం. ‘ఈ పిల్లలందరూ 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు వారే. పిల్లల ఛాతి మధ్య ఎముక సహా ఇతర ఎముకలపై గాట్లు ఉన్నాయి. చాలా పక్కటెముకలు ధ్వంసమై ఉన్నాయి. శరీరం నుంచి గుండెను వేరే చేశారు శిలా స్ఫటికంతో తయారు చేసిన ఎర్రని రంగును చిన్నారులకు పూశారు. బలి ఇచ్చే ఆచార సంప్రదాయాల్లో ఇది ఒక భాగమై ఉండొచ్చు’ అని ఓ శాస్త్రవేత్త తెలిపారు. 2011లో ఉత్తర తీరంలో తొలుత అస్థిపంజరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. గత ఐదేళ్లుగా పరిశోధనలను ముమ్మరం చేశారు. వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాలతోపాటు దక్షిణ అమెరికాలో కనిపించే లామాస్(ఒంటె తరహా జీవి) అవశేషాలను వందల సంఖ్యలో ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. కాగా, చిమూ నాగరికతకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇన్కా నాగరికత రంగ ప్రవేశంతో చిమూ నాగరికత అంతమైపోయింది. అయితే ఆ తర్వాత 50 ఏళ్లకు స్పెయిన్ వలసవాదులు దక్షిణ అమెరికాలో అడుగుట్టి ఇన్కా నాగరికతను మట్టికరిపించారు. -
క్షుద్రశక్తుల కోసం మేనత్త దారుణం
యమునానగర్ (హరియాణా): తనకు వచ్చిన కలను సాకారం చేసుకునేందుకు ఓ మహిళ దారుణానికి పాల్పడింది. క్షుద్రశక్తులు లభిస్తాయన్న దురాశతో మూడేళ్ల చిన్నారిని బలిచ్చింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాదం హరియాణాలోని యయునానగర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిందుతురాలికి వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారు. భర్తతో కలిసి ఆమె అంబాలాలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల భర్త, పిల్లలతో కలిసి తన పుట్టింటికి వచ్చింది. అయితే ఓ చిన్నారిని బలిదానమిస్తే క్షుద్రశక్తులు వస్తాయని ఎవరో చెబుతున్నట్లుగా ఆమెకు తరచుగా కలలు వస్తుండేవి. నిజంగానే చిన్నారిని బలిస్తే తన కల సాకారం అవుతుందని భావించిన నిందితురాలు తన సోదరుడి మూడేళ్ల కూతుర్ని బలివ్వాలనుకుంది. ఆదివారం చిన్నారి తన అత్తవద్దకు రాగా, గదిలోకి తీసుకెళ్లి పూజలు చేసింది. అనంతరం ఓ కత్తితో గొంతుకోసి చిన్నారిని ఆ మహిళ బలిచ్చింది. బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు పాపను రక్షించేందుకు రాగా, వారి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు నిందితురాలు యత్నించింది. ఆమెను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. రక్తస్రావం కావడంతో అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు జగధ్రి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నవీన్ వివరించారు. -
చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు!
-
చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను కలిశారు. ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే నరబలి ఇవ్వడమే మార్గమని ఆ కోయదొర, మాంత్రికుడు ఈ దంపతులకు చెప్పాడు. ఇక అప్పటినుంచీ నరబలి గురించి ఎంతో ఆలోచిస్తున్న రాజశేఖర్, శ్రీలతలు బలి ఇచ్చేందుకు పిల్లలు ఎక్కడ దొరుకుతారని తీవ్రంగా యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత జనవరి 31న రాజశేఖర్ సోదరుడు గణేశ్ బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను నిందితులు పడేశారు. పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్ల నుంచి నరబలి ఇవ్వడానికి నిందితులు యత్నిస్తున్నట్లు తెలియడంతో పోలీసులే షాకయ్యారు. సెక్షన్ 124 , 302, 366, 201, 120 B కింద కేస్ నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నరబలి జరిగినట్లు గుర్తించాం: మహేష్ భగవత్ నరబలి కేసుపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పలు విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన నరబలి కేసును చేధించాం. చిన్నారి నరబలి కేసులో మొత్తం 122 ఫోన్లు, 54 సెల్ టవర్ ల డేటాను అనలైజ్ చేశాం. మొత్తం 40 మంది సాక్షులను, 45 మంది అనుమానితులను విచారించాం. 100 సీసీ కెమెరాల డేటాను పరిశీలించాం. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌తో పాటు భార్య శ్రీలత, ఓ మాంత్రికుడు సహా పాపను తీసుకు వచ్చిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. భిన్నకోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నరబలి జరిగినట్లు గుర్తించాం. క్యాబ్ డ్రైవర్, ఇంటి యజమాని రాజశేఖర్ కోయదొర, మాంత్రికుడి సలహా మేరకు పాపను నరబలి ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో లభ్యం అయిన నమూనాలతో ఫొరెన్సిక్ నివేదిక సమర్పిచింది. డీఎన్ఏ రిపోర్ట్ ద్వారా బలిచ్చింది ఆడ శిశువునే అని నిర్ధారణకు వచ్చినట్లు సీపీ మహేష్ భగవత్ వివరించారు. -
గుట్టు విప్పిన డీఎన్ఏ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకా నగర్‌లోని చిన్నారి నరబలి కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి డీఎన్ఏ నివేదిక పోలీసులకు అందింది. క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించిన తల, అతడి ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడ శిశువువిగా ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. మూఢ నమ్మకాల నెపంతో చిన్నారిని బలి ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను పడేసినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. బలి ఇచ్చిన చిన్నారిని బోయగూడలోని ఫుట్‌పాత్ వద్ద నిద్రిస్తున్న వారి దగ్గర నుంచి చిన్నారిని ఎత్తుకొచ్చినట్లు సమాచారం. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, అతని భార్య శ్రీలత, బంధువులు లచ్చక్క, బుచ్చమ్మ, నలుగురు మాంత్రికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రాజశేఖర్ తన భార్య శ్రీలత ఆరోగ్యం కోసం నరబలి చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్న విషయం తెలిసిందే. నిందితులను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నరబలి తర్వాత పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నరబలి కేసులో మరొ కొత్త ట్విస్ట్.. నరబలి కేసులో బోయగూడకు చెందిన రాజశేఖర్ సోదరుడు గణేశ్ కీలకంగా వ్యవహారించాడు. గణేశ్ చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ముందు జాగ్రత్త పడ్డారు. వీరిద్దరికి కన్నతల్లి అన్ని విధాలా సహకరించింది. తనకు ఏమి తెలియనట్లు రాజశేఖర్ తల్లి పోలీసుల దగ్గర నమించే ప్రయత్నం చేసింది. కేసు దర్యాప్తులో మృతి చెందిన చిన్నారిని తల్లి గుర్తించడమే కాకుండా గణేశ్ అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల దృష్టి మరల్చేందుకు అర్ధరాత్రి సమయంలో గణేశ్ నరహరి ఇంటిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రత్యేక యాగం కోసం ఇలా చేశాడు..!
వేలూరు: ప్రపంచం కొత్త కొత్త టెక్నాలజీతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. కానీ సమాజంలో మాత్రం మూఢనమ్మకాలు పోవటం లేదు . టెన్నాలజీ యుగంలో కూడా స్వామిజీలకు, బాబాలకు ఆధరణ మంచిగానే ఉంది. ప్రత్యేక యాగం కోసం చిన్నారిని బలి ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడిలోని స్వామిజీ మఠంలో చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన గ్రామస్తులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. నరబలి ఇచ్చి నీటి తొట్టెలో వేశారంటూ స్థానికులు మఠాన్ని ధ్వంసం చేశారు. వివరలీవి.. వానియంబాడి తాలుకా మేల్ నిమ్మయంబట్టు గ్రామ సమీపంలో రవి అనే వ్యక్తి మఠం ఏర్పాటు చేసి పదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఏడడుగుల నీటి తొట్టెను ఏర్పాటు చేసి అందులో తాబేలను పెంచుతున్నాడు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగం చేస్తుంటాడు. మఠానికి సమీపంలోనే మురుగన్ కుటుంబంతో ఉంటున్నాడు. మంగళవారం అతని కుమారుడు హరికేష్ అలియాస్ తులసి(2) కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మఠంలో వెదకగా నీటి తొట్టెలో శవమై కనిపించాడు. సోమవారం రోజున పౌర్ణమి, చంద్ర గ్రహణం కావడంతో స్వామిజీ రవి ప్రత్యేక యాగం చేశాడని, ఆ సమయంలో బాలుడిని బలి ఇచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానించారు. కోపంతో గ్రామస్తులు మఠంలో ఉన్న స్వామిజీపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మఠంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. గాయపడిన రవి అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. బాలుడిని బలి ఇచ్చాడంటూ రవిపై వానియంబాడి పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.