childrens missing
-
నలుగురు చిన్నారుల అదృశ్యం
తూప్రాన్: మెదక్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. బుధవారం తూప్రా న్ పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తూప్రాన్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాలు ప్రకారం.. రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన నస్రీన్‌భాను భర్త జాకీర్‌తో గొడవ పడి తూప్రాన్‌లో నివా సం ఉంటున్న తన సోదరి ఇంటికి నెల క్రితం తన నలుగురు పిల్లలతో కలసి వచి్చంది. ప్రస్తుతం ఆమె సిద్దిపేట జిల్లా నాచారం సీడ్ పరిశ్రమలో దినసరి కూలీ గా పని చేస్తోంది. బుధవారం కంపెనీ నుంచి ఇంటికి వచి్చన నస్రీన్‌భానుకు తన నలుగురు పిల్లలు ఎస్కే షాకీర్ (10), ఎస్కే సబెర్(8), ఎస్కే నజరీన్(6), ఎస్కే సదూర్(4) కనిపించ లేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చిన్నారుల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
వారిని గోదారమ్మ మింగేసిందా?
సాక్షి , విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు సమీపాన గత నెల 15న గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో జిల్లాకు చెందిన 17మంది గల్లంతయ్యారు. ఆ దుర్ఘటనలో గల్లంతైన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. ఘటన జరిగిన రోజు నుంచి చేపట్టిన గాలింపు చర్యల్లో 13మంది మృతదేహాలను గుర్తించి జిల్లాకు తీసుకువచ్చారు. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి కుమార్తెలైన వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏడాదిన్నర), రామలక్ష్మీ కాలనీకి చెందిన దివంగత మధుపాడ రమణబాబు. అరుణకుమారిల కుమారుడు అఖిలేష్(9), గాజువాకకు చెందిన దివంగత మహేశ్వరరెడ్డి, స్వాతిల కుమారుడు విఖ్యాత్‌రెడ్డి(6).. మొత్తంగా ఈ నలుగురు చిన్నారుల ఆచూకీ మాత్రం లభించలేదు. గోదావరిలో వరద ఉధృతి కారణంగా నెల కిందట గాలింపు చర్యలు నిలిపివేసిన దరిమిలా.. మళ్ళీ రెండు రోజుల కిందట ఏకంగా బోటును ఒడ్డుకు తీసుకువచ్చి దాంట్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తూ వచ్చారు. ఇందులో గాజువాకకు చెందిన విఖ్యాత్‌రెడ్డి మృతదేహం మాత్రం లభ్యమైంది. విఖ్యాత్‌రెడ్డి తల్లిదండ్రులు మహేశ్వరరెడ్డి, స్వాతిలతో పాటు సోదరి హన్సిక కూడా అదే బోటు ప్రమాదంలో మృతిచెందారు. వారి మృతదేహాలను గత నెల 23వ తేదీన బంధువులకు అప్పగించారు. ఇద్ద రు పిల్లలతో సహా మహేశ్వరరెడ్డి కుటుంబం మొత్తం బోటు ప్రమాదానికి బలైపోయిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ ముగ్గురూ అంతేనా.. కనీసం విఖ్యాత్‌రెడ్డి చివరిచూపైనా దక్కిందనుకుంటే మిగిలిన ముగ్గురు చిన్నారుల జాడ కానరాకపోవడంతో వారి రక్తసంబంధీకులు తల్లిడిల్లిపోతున్నారు. ఇప్పటికీ ఆచూకీ తెలియని అఖిలేష్(9) తల్లిదండ్రులు మధుపాడ రమణబాబు. అరుణకుమారి, సోదరి కుశాలి.. ఈ ముగ్గురూ ఆ బోటు ప్రమాదంలో మృతిచెందారు. అఖిలేష్ ఆచూకీ కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నాం... పోనీ బాడీ దొరికినా చాలని అనుకుంటున్నాం... అని అతని చిన్నాన్న రామకృష్ణ గద్గదస్వరంతో అన్నారు. ఆ ముగ్గురికీ దహన సంస్కారం చేశాం.. చివరికి అఖిలేష్‌కి ఆ కర్మక్రియలు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందంటూ విలపించారు. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మిలది నిజంగా గుండెలు పిండే విషాదం. ఇద్దరు ఆడపిల్లలు వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏడాదిన్నర)లను రెండు కళ్ళల్లా అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చారు. నానమ్మ అప్పలనర్సమ్మ, బంధువులతో కలిసి ఆ రోజు గోదావరి బోటు షికారుకు వెళ్ళారు. అప్పలనర్సమ్మ మృతదేహం బయటపడినా పసి పిల్లల ఆచూకీ మాత్రం నేటికీ తెలియలేదు. మా కంటిపాపలు కానొస్తే చాలు.. మేమే పాపం చెయ్యలేదు. కానీ భగవంతుడు ఎందుకు ఇంత విషాదం కలిగించాడో.. అర్థం కావడం లేదు. 30 రోజులకు పైగా మా మరిది శ్రీనివాస్ గోదావరి ఒడ్డునే ఉంటున్నాడు. ఎక్కడైనా కానొస్తారేమో లేదా.. పోనీ.. పోయిన ప్రాణాలతోనైనా కనిపిస్తారేమోనని అక్కడే పడిగాపులు కాస్తూ వచ్చాడు. కానీ.. ఇక కడచూపు ఆశ కూడా దక్కనట్టేనని అనిపిస్తోంది.. అని ఆ చిన్నారుల తల్లి భాగ్యలక్ష్మి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పింది. చదవండి : కడసారి చూపు కోసం.. చదవండి : ఏడు మృతదేహాలు మార్చురీకి తరలింపు -
కనిపించని కనుపాపలు!
చిట్టితల్లి వైష్ణవికి రోజూ గోరుముద్దలు తినిపించేది ఆ తల్లి.. అమ్మానాన్నా అంటూ ముద్దుముద్దుగా పిలుస్తుంటే మురిసిపోయేది.. చెల్లెలితో కలిసి ఇల్లంతా కలియదిరుగుతూ సందడి చేస్తుంటే ఇంటిల్లిపాదీ సంబరపడిపోయేవాళ్లు.ఇప్పుడా ఇళ్లలో ఆ సందడి లేదు.. దాని స్థానంలో విషాదం అలుముకుంది.అదీ ఓ విషాద ఘటనలో గల్లంతయ్యారు. అన్వేషణ సాగుతున్నా.. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ దొరక్కపోవడంతో తమ కంటిపాపలు కడచూపుకైనా దక్కవేమోనన్న బాధ ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది. గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన విశాఖ జిల్లాకు చెందిన 17 మందిలో 13 మంది నిర్జీవంగానే దక్కారు. మిగిలిన నలుగురూ చిన్నారులే.. పెద్దవారు విగతజీవులుగానైనా దక్కారు. వారి పిల్లలైనా దక్కుతారని.. వారిలో చనిపోయినవారిని చూసుకుందామనుకుంటూ.. వారి ఆచూకీయే ఇంతవరకు లభించక.. అసలు వారు సజీవంగా ఉన్నారో.. లేదో.. అర్థంకాక నగరంలోని ఆరిలోవ, రామలక్ష్మి కాలనీ, గాజువాక ప్రాంతాలకు చెందిన వారి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. –సాక్షిప్రతినిధి, విశాఖపట్నం సాక్షి, విశాఖ సిటీ: పోయినవారు ఎలాగూ పోయా రు.. చిన్నారులైనా దక్కుతరని ఆశపెడితే.. గో దారమ్మ ఆ ఆశలను చిదిమేస్తోందన్న ఆవేదనతో నగరానికి చెందిన మూడు కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఆరిలోవ దుర్గాబజార్ ఏ ఎస్ఆర్ కాలనీకి చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు తమ పిల్లలు వైష్ణవి, ధాత్రి అనన్య ఆచూకీ లభించక తల్లడిల్లిపోతున్నారు. వీరితో పాటు గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన నగరంలోని రామలక్ష్మికాలనీలో ఉంటున్న మధుపాడ అఖిలేష్, గాజువాక కు చెందిన విఖ్యాతరెడ్డి కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లలో వత్తులేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు. 15న గోదావరి నదిలో రాయల్ విశిష్ట బోటు ప్రమాదంలో నగరానికి చెందిన 17 మంది గల్లంతు కాగా వారిలో 13 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా జాడ తెలియని ఆ నలుగురూ తొమ్మిదేళ్లలోపు చిన్నారులే. కంటతడి ఆరలేదు.. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భా గ్యలక్ష్మి దంపతుల కుమార్తెలైన వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏదాదిన్నర)లు నాన్నమ్మ అప్పలనర్శమ్మతో కలిసి ఈ నెల 15న గోదావరి నదిలో విహార యాత్రకు వెళ్లిన సంగతి తెలి సిందే. ఆ రోజు జరిగిన ప్రమాదంలో అప్పలనర్శమ్మ మృతి చెందగా.. వైష్ణవి, అనన్యల ఆచూకీ లభించలేదు. ఓ వైపు ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న అప్పలనర్శమ్మను కన్నుమూయడం, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తెల జాడ లేకుండా పోవడంతో దంపతులిద్దరూ తల్లడిల్లిపోతున్నారు. పిల్లలను తలచుకంటూ ‘పెద్దది ఈ సమయంలో ఇలా చేసేది.. చిన్నది అలా అల్లరి పెట్టేది’ అని తలచుకుంటూ కుమిలిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే గత తొమ్మిది రోజులుగా ఆ దంపతుల కంటతడి ఆరలేదు. పిల్లలు వస్తారు అంటూ వారు వెళ్లిన దారివైపు ఆశగా ఎదురుచూడటం గమనిస్తున్న స్థానికుల గుండెలు చెమ్మగిల్లుతున్నాయి. వారసులొస్తారా.. మరోవైపు అదే బోటులో విహారయాత్రకు వెళ్లి మృత్యువాత పడిన రామలక్ష్మి కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబానిది ఇంతకుమించిన విషాదం. ఆ రోజు విహారయాత్రకు రమణబాబు కుటుంబంతో పాటు వెళ్లిన అనకాపల్లిలోని బంధువులు, వేపగుంటలోని సోదరి, ఆమె కుమార్తె సహా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ దుర్ఘటనలో రమణబాబు, ఆయన భార్య అరుణకుమారి సహా కుమార్తె కుశాలి కూడా కన్నుమూశారు. ప్రమాదంలో చిక్కుకున్న రమణబాబు కుమారుడు అఖిలేష్(9) జాడ ఇంకా తెలియరాలేదు. ఇదే ప్రమాదంలో గాజువాకలో నివాసం ఉంటూ యాత్రకు వెళ్ళిన మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి, కుమార్తె హన్సిక మరణించిన సంగతి విదితమే. వారితో పాటు ప్రమాదంలో చిక్కుకున్న విఖ్యాత్‌రెడ్డి(6) అనే బాలుడి ఆచూకీ లభించలేదు. కుటుంబ పెద్దలు కనుమరుగైనా వారి వారసులైనా ప్రాణాలతో తిరిగి వస్తారన్న కోటి ఆశలతో వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో విషాదం
బల్లికురవ: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. జిల్లాలోని బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు గ్రామ శివారులోని నీటికుంటలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు నీటి కుంటలో గాలింపు చేపట్టగా.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి.. మరో బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిల్లలు ఎక్కడ?
-
పత్తాలేని పసివాళ్లు!
పింప్రి, న్యూస్‌లైన్: చిన్నారుల అదృశ్యం ఘటనలు పుణే నగరంలో ఆందోళనకరస్థాయి లో పెరిగిపోతున్నాయి. ఇలాంటి కేసుల సంఖ్య భారీగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో పుణేలో ప్రతి రోజు సరాసరి ముగ్గురు చిన్నారులు తప్పిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. తప్పిపోయిన పిల్లల వివరాలను ఇందులో పొందుపరుస్తున్నారు. పిల్లలను వెతకడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతోందని దర్యాప్తు సిబ్బంది చెబుతున్నారు. ఎవరి పిల్లలైనా అదృశ్యమైతే ఇందులో వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. తప్పిపోయిన వారిలో ఈ వైబ్‌సైట్ ద్వారా కనీసం 50 శాతం పిల్లలను వెదకడానికి వీలవుతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అదృశ్యమవుతున్న వారిలో 25 శాతం మంది... ఇంట్లో కలహాల వంటి చిన్న కారణాలతో వెళ్లిపోయినవారేనని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. 20 మంది శాతం పిల్లలు ఎలాంటి కారణమూ లేకుండా ఇల్లు వదిలి వెళుతున్నారు. వీరిలో 15 నుంచి 20 ఏళ్ల వయస్సు గల వారు ఎక్కువగా ఉన్నారని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్ సంస్థ సభ్యుడు అభయ్ కిరాణే తెలిపారు. అదృశ్యమైన పిల్లలను వెతకడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ‘తేరా బచ్చా మేరా బచ్చా’ అనే సామాజిక సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘బచ్పన్ బచావ్ ఆందోళన్’ ఎన్జీఓ కూడా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. దీనిపై స్పందించిన కోర్టు 18 ఏళ్ల వరకు వయసున్న వాళ్లు అదృశ్యమైనా ‘మిస్సింగ్’ కేసులుగా పరిగణించాలని ఆదేశించిందని సంజయ్ నికమ్ అనే పోలీసు అధికారి తెలిపారు. పుణే పోలీసుల గణాంకాల ప్రకారం.. తప్పిపోయిన ప్రతి 10 మంది పిల్లల్లో ముగ్గురు ఆచూకీ తెలియడం లేదు. 2009లో 1,017 మంది పిల్లలు అదృశ్యమవగా, వీరిలో 300 మంది పిల్లల ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. 2010లో 1,106 పిల్లలు తప్పిపోగా 371 మంది పిల్లల ఆచూకీ తేలనేలేదు. 2011లో 1,261 చిన్నారులు తప్పిపోగా, 490 మంది ఏమయ్యారో తెలియరాలేదు. గత ఏడాది 1,254 పిల్లలు తప్పిపోగా వీరిలో 360 మంది పిల్లల ఆచూకీ లభించలేదు. 2013 జనవరి నుంచి సెప్టెంబరు నాటికి మొత్తం 1,280 మంది పిల్లలు తప్పిపోగా వీరిలో 713 మంది పిల్లలు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియరాలేదు. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది పిల్లలు అదృశ్యమవుతున్నట్లు అంచనా. ఇంట్లో వేధింపులు, వాదులాటలు, పరీక్షల ఒత్తిడి వంటివి చిన్నారుల అదృశ్యానికి ముఖ్య కారణాలని పోలీసులు అంటున్నారు. పిల్లలను వెతికేందుకు పోలీసులు ప్రత్యేకంగా కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ ఆదేశాలు కార్యరూపం దాల్చలేదని సీయర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తప్పిపోయిన చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను పట్టుకొని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పోలీసు స్టేషన్లలో తిరుగుతుంటారు. చిన్నారులు తప్పిపోవడానికి కుటుంబ సభ్యుల ప్రవర్తనే ముఖ్యకారణమని నిపుణులు చెబుతున్నారు. వారికి అన్ని విధాలా ధైర్యం చెప్పి భయాందోళనలు దూరం చేయాలని సూచిస్తున్నారు. పుణేలోని ఓ అనాథాశ్రమం నుంచి 2011లో ఏకంగా 18 మంది చిన్నారులు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. పోలీసుల నుంచి సాయం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు కొందరు సంఘంగా ఏర్పడి న్యాయపోరాటం చేస్తున్నారు. ఇలా కొడుకు పోగొట్టుకున్న ఒక బాధితుడు మాట్లాడుతూ ‘పోలీసుల సమయం వీఐపీలకు భద్రత కేటాయించడానికే సరిపోతోంది. ఇలాంటి ఫిర్యాదులను వారు పట్టించుకోవడం లేదు. చిన్నారులను కిడ్నాప్ చేసి వ్యభిచారం, యాచకవృత్తిలోకి దింపే ముఠాలు రాష్ట్రంలో సంచరిస్తున్నాయి. కొందరు బాలలను కిడ్నాప్ చేసి యాచక ముఠాలకు విక్రయిస్తున్నారు. పిల్లలతో నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా చేయించే ముఠాలు కూడా ఉన్నాయి’ అని ఆయన వివరించారు.