ఓబులేసు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ప్రొద్దుటూరు : తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యకు గురయిన ఓబులేసు కుటుంబాన్నివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సహించబోమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా కాపాడుకుంటామని తెలిపారు.
కడప జిల్లా చాపాడు మండలం చిన్నవరదాయపల్లె గ్రామ సర్పంచ్ భర్త ఓబులేసు గత జూలైలో హత్యకు గురయ్యారు. ఓబులేసు స్కూటర్‌పై వెళ్తుండగా దారి కాచిన ప్రత్యర్థులు కళ్లల్లో కారం కొట్టి ప్రొద్దుటూరు దగ్గర నరికి చంపిన విషయం తెలిసిందే.