పిల్లలు లేరు కాబట్టే అందంగా ఉందట!
లాస్ఎంజల్స్: లేటు వయసులో తల్లవడం మూలంగా మహిళలు వయసు మీదపడినట్లు కనిపిస్తారంటోంది హాలీవుడ్ నటి క్లో సెవిన్. 41 ఏళ్ల ఈ భామను 'ఈ వయసులో కూడా మీరింత అందంగా కనిపించడానికి కారణం ఏంటి' అని అడిగితే.. తనకు ఇప్పటి వరకు పిల్లలు లేకపోవటమే తన అందానికి కారణం అని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ముఖ్యంగా 30 ఏళ్లకు పైబడిన మహిళలు తల్లులయితే వారు మరీ వయసు మీద పడినట్లు కనిపిస్తారని చెప్పుకొచ్చింది.
అయితే 20 లలో పిల్లల్ని కనడం అందంపై అంతగా ప్రభావం చూపదని, అందుకే ఎర్లీ ఏజ్‌లో పిల్లల్ని కనాలని ఫెమినిస్టు మేగజైన్‌తో మాట్లాడుతూ సలహా ఇచ్చింది 'ద బ్రౌన్ బన్నీ' హీరోయిన్. లేటు వయసులో పిల్లల్ని కనేవారిలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని అది వారి అందంపై ప్రభావం చూపుతుందని తెలిపింది. అంతేకాదు..'ఏమైనా 40 సంవత్సరాలు దాటిన తరువాత అందాన్ని కాపాడుకోవటం కష్టమే' అని చెప్పుకొచ్చింది.