ఇంద్ర చాపాల డబుల్ ధమాకా
ఇంద్ర ధనుస్సు ఒకటి ఆకాశంలో దర్శనమిస్తేనే ఆనందం. అలాంటిది రెండు ఇంద్ర ధనుస్సులు కనిపిస్తే ఇక ఆ ఆనందమే వేరు. బుధవారం సాయంత్రం విశాఖ జిల్లా చోడవరం ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వెనువెంటనే ఎండ కాయడంతో గోవాడ గ్రామంలో ఇలా రెండు ఇంద్ర ధనుస్సులు దర్శనమిచ్చి కనువిందు చేశాయి.
- చోడవరం రూరల్