church pastor
-
కథువాలో మరో దారుణం : చర్చి పాస్టర్ అరెస్ట్
కథువాలో మరో దారుణం చోటు చేసుకుంది. అనాథశ్రమంలో మైనర్ బాలికలను ఓ చర్చి పాస్టర్ లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తమల్ని తీవ్రంగా వేధిస్తున్నాడంటూ బాలికల ఫిర్యాదు అనంతరం, చర్చి పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్ జిల్లాలోని కథువాలో నిర్వహిస్తున్న ఈ అనాథశ్రమంపై పోలీసులు దాడులు నిర్వహించి, 19 మంది పిల్లల్ని రక్షించారు. వారిలో ఎనిమిది మంది బాలికలు ఉన్నారు. కేరళ నుంచి వచ్చిన ఆంటోని థామస్ అనే పాస్టర్ ఈ అనాథశ్రమాన్ని నడుపుతున్నాడు. తమల్ని లైంగికంగా వేధిస్తున్నాడని కొంతమంది చిన్నారులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు శుక్రవారం ఆ అనాథశ్రమంపై దాడులు నిర్వహించారు. అంతేకాక ఆంటోని థామస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే తానెలాంటి తప్పు చేయలేదని థామస్ కప్పిపుచ్చుకుంటున్నాడు. ఆ అనాథశ్రమంలో మొత్తం 21 మంది చిన్నారులున్నారు. వారిలో ఇద్దరు స్వగ్రామంలో(పంజాబ్‌లో) ఓ పెళ్లి వేడుకకు హాజరు కావడానికి తమ స్వస్థలానికి వెళ్లారు. 5 నుంచి 16 ఏళ్ల వయసున్న మిగతా చిన్నారులను ప్రభుత్వం నడిపించే బాల ఆశ్రమ్, నారి నికేతన్‌లకు తరలించినట్టు అధికారులు చెప్పారు. వారందరూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ ప్రాంతాలకు చెందిన వారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్టు కథువా సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీదర్ పటీల్ చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ ఆశ్రమం నడుస్తుందని, ఓ ఎన్జీవో సంస్థతో ఇది లింక్ అయి ఉండేందని, కానీ కొన్ని రోజుల క్రితం దాంతో కూడా సంబంధాలు తెంచుకున్నట్టు పటీల్ పేర్కొన్నారు. అనాథశ్రమంలోని కొన్ని వస్తువులును అధికారులు సీజ్ చేశారు. కాపాడిన చిన్నారులను మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్‌కు తరలించారు. పాస్టర్ భార్య కేరళలో సంభవించిన వరదల కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. కొన్ని రోజుల్లో ఆమె తిరిగి రావొచ్చని చెప్పారు. చిన్నారుల కుటుంబ సభ్యులను అధికారులు కాంటాక్ట్ అవుతున్నారు. ఈ ఆశ్రమం కూడా అనధికారికంగా నడుస్తున్నట్టు తెలిసింది. దీన్ని నడిపేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ను థామస్ తీసుకోలేదని కథువా అసిస్టెంట్ కమిషనర్ రెవెన్యూ, జితేంద్ర మిశ్రా చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని రాష్ట్రీయ భజరంగ్ దళ్ కార్యకర్తలు జమ్మూలోని ప్రెస్ క్లబ్ ఎదుట ఆందోళన చేశారు. -
భార్య మీద ప్రేమతో చర్చి పాస్టర్ విచిత్ర ప్రవర్తన
-
ఫ్రాన్స్‌లో పాస్టర్ గొంతు కోసిన ఉగ్రవాదులు
-
ఫ్రాన్స్‌లో పాస్టర్ గొంతు కోసిన ఉగ్రవాదులు
సెయింట్ ఎటియన్ డ్యు రౌరే (ఫ్రాన్స్) : ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు మళ్లీ దాడి చేశారు. నార్మండీ పట్టణ సమీపంలోని సెయింట్ ఎటియన్ డ్యు రౌరేలో మంగళవారం 86 ఏళ్ల చర్చి పాస్టర్ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. దాడిలో గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్చిని చుట్టుముట్టిన పోలీసులు ఉగ్రవాదులిద్దరినీ హతమార్చారు. ఉగ్రవాదులు చర్చిలోకి చొరబడి పాస్టర్ సహా ఐదుగురిని నిర్బంధించారు. కత్తితో పాస్టర్ గొంతు కోశారు. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఒకరు మృత్యువుతో పోరాడుతుండగా, మిగిలిన ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. పాస్టర్‌ను జాక్వెస్ హామెల్గా గుర్తించారు. దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. ఇది తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ పేర్కొంది. ఈ దాడిని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్, పోప్ ఫ్రాన్సిస్ ఖండించారు. -
పరలోక ధనాన్ని ఎలా కూర్చుకోవాలి?
సువార్త ఒక కోటీశ్వరుడు తానెంత ధనవంతుడినో తన చర్చి పాస్టర్కు వివరిస్తున్నాడు. తనకు ఉత్తరాన చమురు బావులు, దక్షిణాన వేలాది ఎకరాల్లో వ్యవసాయం, తూర్పున బోలెడు కర్మాగారాలు, పడమట ఎన్నో వాణిజ్య సంస్థలున్నాయన్నాడు. ‘కాని నీవు నిరుపేదవే’ ఎందుకంటే ఆ వైపు నీకేమీ లేవు కదా!’ అన్నాడా పాస్టర్ ఆకాశం వైపు చేయి చూపిస్తూ. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి విస్తారంగా పండిందట! అందువల్ల అతను తన పాతకొట్లు పడగొట్టి కొత్తవి, పెద్దవి కట్టించి చాలా ఏళ్లకు సరిపడా ధనాన్ని, ధాన్యాన్ని కూర్చుకొని ఇక తిని, తాగి సుఖించడానికి పూనుకున్నాడు. అయితే దేవుడు పిచ్చివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం పోతే నీ గతి ఏమిటి? పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ప్రయత్నించు’ అని అతన్ని హెచ్చరించాడు (లూకా 12ః 16-21). ధనార్జన తప్పు కాదు. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, వ్యవసాయ కార్యకలాపాలు లేకపోతే మన కనీసావసరాలెలా తీరుతాయి? పేదలకు జీవనోపాధి ఎలా? కాని ధనార్జనే ధ్యేయంగా, స్వార్థమే పరమార్థంగా బతకడాన్ని, తన స్వరూపంలో సృజించబడిన మనిషిలో పరలోక భావనలు లేకపోవడాన్ని మాత్రం దేవుడు హర్షించడు. ఎంతోమంది పనివారి అహర్నిశల శ్రమ, నీరు సూర్యరశ్మిని ధారాళంగా ఇచ్చిన దేవుని కృపతో పంట సమృద్ధిగా పండితే, అదేదో తానొక్కడి విజయమేనన్నట్టు ధనవంతుడు ఆ పంటను పనివారితో పంచుకోకుండా, దేవునికీ ఆయన భాగమివ్వకుండా తానే తిని తాగి సుఖించాలనుకోవడంలోని స్వార్థాన్ని, డొల్లతనాన్ని దేవుడెత్తి చూపించాడు. ‘నేనొకరికివ్వను, ఒకరిది తీసుకోను’ అన్నది మరికొందరి జీవన సిద్ధాంతం. సమాజంలో ఇది చాలా ప్రమాదకరమైన తెగ. ‘నాది నాకుంది, నీది నీవే ఉంచుకో!’ అన్న యాకోబు సోదరుడు ఏశావు తాలూకు శాపగ్రస్తుల సంతతివారు (ఆది 33:9). తీసుకోకపోతే ఫరవాలేదు కానీ విశ్వాసియైనవాడు తప్పక ఇచ్చేవాడై యుండాలి. ఎందుకంటే మనలోని దైవస్వభావంలో ‘ఇచ్చే గుణం’ ఇమిడి ఉంటుంది. శ్వాస తీసుకోకుండా బతకలేనట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరుగువాడిని ప్రేమించకుండా, అతనికివ్వకుండా విశ్వాసి బతకలేడు. పైకి విస్తరిస్తున్నా నానాటికీ కుచించుకుపోతున్న సమాజం, స్వభావాల మధ్య మనం బతుకుతున్నాం. ఎంత ఉన్నా ఇంకా కావాలన్న నిరంతర తాపత్రయంలో ‘తృప్తి’ ఎండమావి అయింది. పరలోకంలో ధనం కూర్చుకొమ్మని దేవుడు ఆదేశిస్తే, ఈ లోకాన్నే ధనశక్తితో పరలోకంగా మార్చుకోబోయి పీడకలలాంటి నేటి సమాజాన్ని నిర్మించుకొని దానికి బానిసలమయ్యాం. ఒకప్పుడు 9 వేల సరుకులమ్మే సూపర్ మార్కెట్లు పదేళ్ల తర్వాత ఇపుడు సగటున 40 వే సరుకులు అంటే నాలుగింతలు అమ్ముతున్నాయన్నది ఒక సర్వే సారాంశం. కాని మనిషి ఆనందాన్ని అవి నాలుగింతలు అధికం చేయలేదు సరికదా సగానికి తగ్గించాయి. మనిషి నిండా ‘నేను’ అనేవాడే నిండిపోయి చుట్టూ తానే గీసుకున్న వలయానికే అతని జీవితం పరిమితమై కుళ్లి కపు కొడుతోంది. దేవుని నిజంగా ప్రేమిస్తే పాటి మనిషిని ప్రేమించకుండా విశ్వాసి బతకలేడు. దేవుడంటే చాలా ప్రేమ కాని పక్కవాడిని కనీసం కన్నెత్తి కూడా చూడననే వాడిదే కపట ప్రేమ. ‘నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు’ అన్న దైవోక్తిలోనే పరలోకంలో ధనవంతులమయ్యే మార్గం ఉంది. అందుకే ‘ప్రేమించకుండా ఇవ్వగలమేమో కాని ఇవ్వకుండా ప్రేమించలేము’ అంటాడు కార్ మైఖెల్ అనే మహాభక్తుడు. - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
మృత్యువుతో పోరాడి ఓడిన పాస్టర్
వికారాబాద్/హైదరాబాద్, న్యూస్‌లైన్: దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురైన వికారాబాద్‌లోని సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు (48) సోమవారం తుదిశ్వాస వది లారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలున్నారు. నాలుగు రోజుల క్రితం వికారాబాద్‌లో సంజీవులుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఖండిస్తూ పలు క్రైస్తవ సంఘాల నుంచి పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. తీవ్ర గాయాలతో మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరిన పాస్టర్‌ను రెండ్రోజుల కిందట కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ హోంమంత్రి సబితారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, క్రైస్తవ మత ప్రచారకులు బ్రదర్ అనిల్‌కుమార్, మలక్‌పేట ఎమ్మెల్యే బలాల తదితరులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచించారు. కానీ పాస్టర్ ప్రాణాలు దక్కలేదు. సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం గోల్కొండ చౌరస్తాలోని హెబ్రోన్ చర్చికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సంజీవులుకు నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం కొల్లూరుకు చెందిన సంజీవులు నాలుగేళ్ల కిందట వికారాబాద్‌కు వచ్చారు. అప్పట్నుంచి స్థానిక సియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ప్రమీల గృహిణి. పెద్ద కూతురు హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతోంది. రెండో కూతురు ఇంటర్ ఫస్ట్ ఇయర్, కుమారుడు తొమ్మిదో తరగతి, చిన్న కూతురు 8వ తరగతి చదువుతున్నారు. ఇంటికి పెద్దదిక్కు కన్నుమూయడంతో వీరంతా కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు వికారాబాద్ చర్చికి భౌతికకాయం: పాస్టర్ సంజీవులు భౌతిక కాయాన్ని మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్‌లోని సియోన్ చర్చికి తరలించనున్నారు. బుధవారం ఉదయం భౌతిక కాయాన్ని భూస్థాపన చేయనున్నారు. కఠినంగా శిక్షించాలి: పాస్టర్ సంజీవులుపై దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆయన మృతికి సీఎం కిరణ్ బాధ్యత వహించాలని క్రైస్తవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు జీ జాన్, రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మానుయేల్ కిశోర్ డిమాండ్ చేశారు. పాస్టర్లపై దాడులు జరుగుతున్నా పాలకులు పట్టిం చుకోవడం లేదని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐసీసీ) మండిపడింది. ఈ ఘటనను క్రైస్తవ సంఘాలు ఖండించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికె వరప్రసాదరావు, క్రిస్టియన్ సోషల్ ఫోరం అధ్యక్షులు బిసప్జాన్ గుల్లపల్లి పేర్కొన్నారు. ఈ హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యేల జయసుధ డిమాండ్ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన పాస్టర్ హత్యకు నిరసనగా సోమవారం రాత్రి బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముందు క్రిస్టియన్ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షుడు విజయరాజ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే జయసుధ, సినీ నటుడు రాజా, మాజీ మంత్రి మారెప్ప తదితరులు ఇందులో పాల్గొన్నారు. నిరసన తర్వాత కొందరు వెళ్లిపోగా మిగతా వారు అక్కడే ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.