Cigarette packets
-
మందు మితంగా తాగితే మంచిదే అంటారుగా.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. సిగరెట్ ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరం అని స్టిక్కర్లు వేసినట్లే.. మద్యం బాటిళ్లపై కూడా స్టిక్కర్లు ముద్రించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని, స్టిక్కర్లు అంటించడం వల్ల యువతకు దీని గురించి తెలిసి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు. పిటిషన్‌ను పరిశీలించిన సిజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతారని పేర్కొంది. కానీ సిగరెట్ల విషయంలో ఇలా ఎవరూ చెప్పలేదని గుర్తు చేసింది. అందుకే మందుబాటిళ్లపై స్టిక్కర్లు అంటించాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, లేదంటే తామే కొట్టివేస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై లా కమిషన్ ముందుకు వెళ్లేందుకైనా తనకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్ విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. దీంతో అడ్వకేట్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. చదవండి: ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
‘ప్యారిస్’ ఫ్రమ్ మయన్మార్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వానికి పన్నుపోటు, పొగరాయుళ్ల ఆరోగ్యానికి చేటుగా మారుతున్న విదేశీ సిగరెట్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ స్మగ్లింగ్‌పై డేగకన్ను వేశారు. ఫలితంగా 13 రోజుల వ్యవధిలో రూ.7 కోట్ల విలువైన సిగరెట్లు పట్టుబడ్డాయి. ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలో రూ.6.33 కోట్ల విలువైన సిగరెట్లు చిక్కిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా శుక్రవారం డీఆర్ఐ బృందం కాచిగూడ రైల్వేస్టేషన్లో దాడులు చేసింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో సోదాలు నిర్వహించి రూ.65.96 లక్షల విలువైన ప్యారిస్ బ్రాండ్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న స్మగ్లర్ తప్పించుకోగా... ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ సిగరెట్లు మయన్మార్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. 132 కార్టన్స్‌లో ఉన్న 13.19 లక్షల సిగరెట్లును డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. గతంలో తిమ్మాపూర్ డిపోలో దొరికిన వాటిలో లండన్ తయారీ బెన్సన్ అండ్ హెడ్జెస్, యూఏఈకి చెందిన మోండ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు ఉన్న విషయం విదితమే. -
నిబంధనలకు లోబడే నడుచుకుంటాం: గాడ్ఫ్రే ఫిలిప్స్
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్స్‌పై హెచ్చరికల గుర్తులకు సంబంధించి.. కొత్త నిబంధనలకు లోబడే నడుచుకుంటామని గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా తెలిపింది. పొగాకు ఉత్పత్తులు వాటి ప్యాకేజింగ్ స్పేస్‌లో 85 శాతాన్ని కచ్చితంగా పెద్ద హెచ్చరికల గుర్తుల ప్రదర్శనకు ఉపయోగించాలనే ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనల అమలుకు కసరత్తు జరుగుతోందని గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా బీఎస్ఈకి నివేదించింది. ఈ అంశమై సిగరెట్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొంది. -
సిగరెట్ ప్యాకెట్లపై 85% స్థలంలో హెచ్చరికలు
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. పొగతాగటం వల్ల అనర్థాలపై సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం స్థలంలో చట్టబద్ధమైన హెచ్చరికలను తప్పనిరిగా ముద్రించాలని తయారీ కంపెనీలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పొగాకు ఉత్పత్తుల తయారీ కంపెనీలు సిగరెట్ పెట్టెపై 60 శాతం స్థలంలో ధూమపానం వల్ల కలిగే నష్టాలపై రేఖా చిత్రాలు, 25 శాతం స్థలంలో హెచ్చరికలను తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. సిగరెట్ల తయారీ కంపెనీలు ప్యాకెట్లపై దీనికి అనుగుణంగా మార్పులు చేసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు గడువు ఇవ్వనున్నారు.