cini stars
-
లోక్ సభలో నోరు మెదపని ఎంపీలు వీరే..
దేశంలోని ఓటర్లు తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని ఎంపీలను పార్లమెంట్‌కు పంపిస్తారు. అయితే దీనికి విరుద్దంగా ప్రవర్తించిన ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలం ముగియనుండడంతో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 17వ లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎంపీలు తమ పదవీ కాలంలో ఒక్కసారి కూడా సభలో మాట్లాడనేలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ ఎంపీలలో అమితమైన ప్రజాదరణ పొందినవారు కూడా ఉన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సన్నీ డియోల్, శతృఘ్న సిన్హా సభలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మరోవైపు పార్లమెంటు కార్యకలాపాల్లో పాల్గొనని నేతల వర్గంలో శత్రుఘ్న సిన్హా చేరారు. శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ. గతంలో శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పార్లమెంటులో ఒక్కసారి కూడా ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. అదేవిధంగా కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపి రమేష్ చంద్రప్ప జిగజినాగి కూడా ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గం ఎంపీ అతుల్ రాయ్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. -
చిరు,పవన్‌ల ఎంట్రీ.. అధికార పార్టీలకే నష్టం..!
సాక్షి, వైజాగ్: సినీ నటుల రాజకీయ ప్రవేశంపై విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి యద్ధనపూడి అయ్యన్న పంతులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి , పవన్‌లు రాజకీయాల్లోకి రావడం అధికార పార్టీలకే నష్టమని అయ్యన్న పంతులు అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే మరో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కాలసర్ప దోషం ఉందని ఆయన పేర్కొన్నారు. యద్ధనపూడి అయ్యన్న పంతులు -
గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే...
న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖుల్లో కొందరికి విజయం వరించగా, మరికొందరికి నిరాశ ఎదురైంది. తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వ్యక్తిగతంగా విజయం సాధించినా, పార్టీ మాత్రం రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే సినీనటులు విజయ్‌కాంత్, శరత్ కుమార్ కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 75 సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన క్రికెటర్ శ్రీశాంత్ ఓటమి పాలయ్యాడు. అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసిన రూపా గంగూలీ, క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా ని విజయం వరించింది. కాగా, వివరాల్లోకి వెళితే.. తమిళనాడు: గెలుపొందినవారు: జయలలిత కరుణానిధి స్టాలిన్ పన్నీర్ సెల్వం మాజీ డీజీపీ నటరాజ్ ........... ఓడినవారు అన్బుమణి రాందాస్ డీఎండీకే అధినేత విజయ్ కాంత్ శరత్ కుమార్ పశ్చిమ బెంగాల్లో గెలిచిన ప్రముఖులు మమతా బెనర్జీ సుర్జాకాంత్ మిశ్రా బైచింగ్ భుటియా అమిత్ మిశ్రా రుపా గంగూలీ కె.మణీ లక్ష్మీ రతన్ శుక్లా కేరళలో గెలిచిన ప్రముఖులు ఊమెన్ చాందీ అచ్యుతానందం విజయన్ రమేష్ చెన్నతాల ఓడినవారు క్రికెటర్ శ్రీశాంత్ స్పీకర్ శక్తన్ డిప్యూటీ స్పీకర్ పాలొడే రవి అసోంలో గెలిచిన ప్రముఖులు సరబానంద్ సోనోవాల్ తరుణ్ గొగోయ్ పుదుచ్చేరిలో గెలిచిన ప్రముఖులు రంగస్వామి -
క్రీడా, సినీ ప్రముఖులకు నిరాశ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీచేసిన క్రీడాప్రముఖులకు నిరాశ ఎదురైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున తొలిసారి పోటీ చేసిన టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఓటమి చవిచూశాడు. తిరువనంతపురం నుంచి బరిలో దిగిన శ్రీశాంత్ చిత్తుగా ఓడిపోయాడు. ఇక పశ్చిమబెంగాల్లో సిలిగురి నియోజకవర్గం నుంచి తృణమాల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన భారత్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా వెనుకబడ్డారు. ఎన్నికల ఫలితాలు పలువురు సినీ ప్రముఖులకు కూడా నిరాశ కలిగిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో ఉత్తర హౌరా నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన నటి రూపా గంగూలీ వెనుకబడింది. ఇక తమిళనాడులో డీఎండీకే చీఫ్, ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ విజయ్‌కాంత్ మూడో స్థానంతో వెనుకంజలో ఉన్నాడు.