రేషన్ డీలర్ల ద్వారా వృద్ధాప్య పింఛన్లు పంపిణీ
అమరావతి: రేషన్ డీలర్ల ద్వారా వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ గురువారం రేషన్ డీలర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మార్చి లేదా ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారానే పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు డీలర్లకు హామీ ఇచ్చారని సమాచారం.