Civil Supplies System
-
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ భేష్
మదనపల్లె: జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల వ్యవస్థ పనితీరు, రేషన్ డోర్ డెలివరీ, వలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర బృందం సభ్యులు ప్రశంసించారు. జాతీయ ఆహారభద్రత చట్టం అమలు, పీడీఎస్ పంపిణీని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు నియమించిన కేంద్ర పరిశీలకుల బృందం మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించింది. గాలివీడు, కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యం, మదనపల్లె తదితర ప్రాంతాల్లో రేషన్ షాపులను తనిఖీచేసి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఆహారభద్రత చట్టం సలహా సంఘం సభ్యులు జీఎన్ శర్మ, ఎంసీ చింపా మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆహార భద్రత చట్టం అమలు ఏపీలో బాగా జరుగుతోందని కితాబిచ్చారు. పౌరసరఫరాల పంపిణీకి ఎండీయూ వాహనాలు, వలంటీర్ల వ్యవస్థ, రేషన్ డోర్ డెలివరీ సత్ఫలితాన్నిస్తున్నాయని ప్రశంసించారు. 100కి 98శాతం మంది ప్రజలు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పొందుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీపై లబ్ధిదారులను విచారిస్తే.. సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. -
నవ వసంతం... సంకల్పం
నవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లాకు ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ.. నేతలు, అధికారులు తమ అభిమతాలను ఇలా వెలిబుచ్చారు. పౌరసరఫరా వ్యవస్థను గాడిలో పెట్టగలిగాను గడిచిన 2015లో పౌరసరఫరాల వ్యవస్థను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టగలిగాను. రేషన్ షాపుల్లో ప్రవేశపెట్టిన ఈపాస్ విధానం విజయవంతమైంది. 20 శాతం మేర సరుకులను ఆదా చేయగలిగాం. లక్ష సీఎస్ఆర్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, 80వేలు ఇవ్వగలిగాం. 15వేల ఎంఐఎంబీ రికార్డులను అప్‌గ్రేడ్ చేశాం. 2016లో 1.15 లక్షల తెల్లకార్డులు జారీచేయనున్నాం. జీవో.296 ప్రకారం వంద గజాల్లోపు ప్రభుత్వ భూముల్లో క్రమబద్ధీకరణ కింద 50 వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. త్వరలో వీరికి లీగల్ డాక్యుమెంట్స్ జారీ చేయనున్నాం. - జె.నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ విశాఖదే ఉజ్వల భవిష్యత్ 2016 విశాఖదే ఉజ్వల భవిష్యత్. జిల్లా ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం. కొత్త సంవత్సరంలో విశాఖ అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. - గంటా శ్రీనివాసరావు, రాష్ర్ట మానవ వనరుల శాఖ మంత్రి అభివృద్ధిలో ‘విశాఖ’ పరుగులు హుద్‌హుద్ తుఫాన్‌ను ఎదురొడ్డి నిలిచిన విశాఖ గడిచిన 2015లో నిలదొక్కుకుని అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. 2015లో ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, పరిశ్రమలకు అంకురార్పణ జరిగింది. 2016లో జనవరి 10,11,12 తేదీల్లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు, ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలకు విశాఖ వేదికవుతోంది. మరో జాతీయ విద్యా సంస్థ పెట్రో యూనివర్శిటీ కూడా కార్యరూపం దాల్చనుంది. రెండు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్, ఐటెక్స్ టవర్, ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చురింగ్, ఐటీ, లాజిస్టిక్, ప్యాకేజింగ్ పార్కులు రాబోతున్నాయి. పోలవరం ఎడమకాలువ పనులు ప్రారంభం కానున్నాయి. - డాక్టర్ ఎన్.యువరాజ్, జిల్లా కలెక్టర్ సంక్షేమ పథకాలను చేరువ చేయడమే లక్ష్యం సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు చేరువ చేయడమే లక్ష్యం. బీసీ, ఎస్సీ, వికలాంగ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన యూనిట్స్ అన్నీ కార్యరూపం దాల్చేలా కృషి చేస్తా. ఈ పథకాల ద్వారా లబ్ధి పక్కదారి పట్టకుండా చూస్తా. - డి.వెంకటరెడ్డి, జేసీ-2 అరకు కాఫీని మార్కెటింగ్ చేస్తాం అరకు బ్రాండ్‌గా మార్కెట్లోకి తీసుకొస్తున్న కాఫీకి అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యం. జీసీసీని గాడిలో పెట్టి లాభాలబాట పట్టించేలా చేశాను. ప్రస్తుతం రూ.180 కోట్లుగా ఉన్న జీసీసీ టర్నోవర్‌ను పెంచేందుకు రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తున్నాం. -ఎ.ఎస్.పి.ఎస్. రవిప్రకాష్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, జీసీసీ అభివృద్ధిలో పాలుపంచుకుంటా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే సమయంలో కీలకమైన విశాఖ రెవెన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టా. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విశాఖకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విశాఖ అభివృద్ధిలో నేను భాగస్వామిని కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. - సి.చంద్రశేఖరరెడ్డి, డీఆర్ఓ జీవీఎంసీకి కొత్త ఏడాదిలో ఎన్నికలు 2015 ప్రారంభంలో జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను. అప్పటి నుంచి పాలనలో పారదర్శక కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. స్మార్ట్‌సిటీకి విశాఖ ఎంపికైన తర్వాత చోటు లభించడమే కాదు. వచ్చే ఏడాదే ఇందుకు సంబంధించి పనులు ప్రారంభం కానున్నాయి. జనవరి 11 నుంచి ఈ ఆఫీస్ అమలులోకి తీసుకొస్తు న్నాం. ఇక నుంచి ఏ దరఖాస్తు కూడా లిఖితపూర్వకంగా ఇచ్చే అవకాశం లేకుండా అంతా ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తున్నాం. కొత్త సంవత్సరంలో జీవీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్తపాలకవర్గం కొలువుదీరితే మాపై ఒత్తిడి తగ్గుతుంది. -ప్రవీణ్‌కుమార్, కమిషనర్, జీవీఎంసీ -
ఆప‘రేషన్ బినామీ’
అడ్డగోలు దందా.. జిల్లాలో గాడితప్పిన రేషన్ వ్యవస్థ బినామీల చేతుల్లో దుకాణాలు అవినీతిలో అధికారులకు వాటా ‘సాక్షి’ సర్వేలో వెలుగుచూసిన వాస్తవాలు జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ గాడి తప్పింది. నిత్యావసర సరుకులు బినామీ, ఇన్చార్జీల గుప్పిట్లో చిక్కి.. ఆహార భద్రత మిథ్యగా మారింది. వీళ్లు కన్ను గీటితేనే సరుకులందుతాయి. అధికారులు కదులుతారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర్నుంచి ఉన్నతాధికారి వరకు బినామీలకు చుట్టాలే. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో, 5 మున్సిపాల్టీల్లో, 3 నగర పంచాయితీల్లో ఏకకాలంలో సాక్షి నెట్వర్క్ ఒక సర్వే నిర్వహించింది. అందులో వెలుగుచూసిన వాస్తవాలు.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నెట్వర్క్ : జిల్లాలోని 1860 రేషన్ దుకాణాల్లో దాదాపు 40 శాతం బినామీలు, ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో సాక్షి నెట్వర్క్ ఒక సర్వే నిర్వహించిం ది. ప్రతి మండలం, మున్సిపాల్టీ, నగర పంచాయితీల్లో కనీసం 2 రేషన్ దుకాణాలకు తగ్గకుండా 175 దుకాణాలను పరిశీలించింది. డీలర్లకు తెలియకుండా వినియోగదారుల నుంచి వివరాలను సేకరించింది. ప్రభుత్వ నివేదికల్లో అం తా సవ్యంగా సాగుతున్నట్టున్నా.. పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకొన్న అవి నీతి బయటపడింది. బినామీల రాజ్యం, వారితో అంటకాగుతున్న అధికారుల గుట్టు రట్టయింది. చూడ్డానికి చిల్ల ర దందాగానే కనిపిస్తున్నా ఒక్కో అవి నీతి రూపాయిని పోగేస్తే రూ కోట్లలో కుంభకోణం జరుగుతోంది. పల్లెల్లో వేలాది మంది నిరుద్యోగ యువకులు ఉండగా.. అధికారులు 55 పోస్టులు ఖాళీగా పెట్టి ఇన్‌చార్జీలకు అప్పగించ డం దీనికి పరాకాష్ట. సగటున ప్రతి మూడు దుకాణలకు ఒక బినామీ డీలర్ ఉన్నట్టు తేలింది. రెవెన్యూ అధికారులకు తెలిసే ఈ బినామీ దందా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉండాల్సినవి 6 వేలు.. జిల్లాలో 1066 పంచాయతీలు, 580 శివారు గ్రామాలు, దాదాపు 199 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. మొత్తం 30.34 లక్షల మంది ప్రజలు ఉన్నారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ప్రతి 500 మందికి ఒక రేషన్ దుకాణం ఉండాలి. అర్బన్ ప్రాంతంలో 800లోపు జనాభాకు ఒక దుకాణం చొప్పున ఉండాలి. ఈ లెక్కన చూస్తే జిల్లాలో కనీసం 6 వేల రేషన్ దుకాణాలు అవసరం. కానీ 1841 దుకాణాలు మాత్రమే ఉన్నాయి (తాజాగా 23 దుకాణాలు మంజూరైనా.. వాటిని ఇంకా నడపటం లేదు). దీంతో ప్రతి రేషన్ దుకాణం వద్ద రద్దీ ఎక్కువైపోతోంది. దీనికి తోడు రేషన్ డీలర్ నెలలో కేవలం 10 రోజులే దుకాణం తెరవడం, అందునా నాలుగైదు గంటలకు మినహాయించి సరుకులు ఇవ్వకపోవడంతో జనం రేషన్ తీసుకోవడానికి ఒకేసారి ఎగబడుతున్నారు. ఈ రద్దీని తట్టుకుని నిలబడలేక కనీసం 7 నుంచి 10 శాతం మంది ప్రజలు సరుకులు తీసుకోకుండానే వెనుదిరిగిపోతున్నట్లు తేలింది. తనిఖీలు అంతంతే.. పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే, అదీ తూతూ మంత్రంగా రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. డీలర్ల వద్ద ఉన్న రేషన్‌కార్డుల నెంబర్లు నమోదు చేసుకొని కార్డు యజమానితో మాట్లాడినట్టుగా, పంపిణీ అంతా సవ్యంగా జరుగుతున్నట్టుగా నివేదిక తయారు చేసి దాని మీద ఒక వేలిముద్ర తీసుకుని వెళ్లిపోతున్నారు. అధికారులు పరిశీలనకు వచ్చిన రోజునే ఒక్కో డీలర్ తన స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టచెబుతారని అంచనా. గ్రామంలో రెవెన్యూ సదస్సులప్పుడు డీలరే భోజనం ఏర్పాట్లు చూస్తున్నారు. చిన్నాచితక ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా అధికారులు డీలర్‌నే పురమాయిస్తున్నారు. ఇక అధికారులు వచ్చిపోయేటప్పుడు దారి ఖర్చులు, డీజిల్ ఖర్చులు డీలర్లే భరిస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కాబట్టే డీలర్లపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మచ్చుకివి.. ► జిల్లాలో పాతవి 1,841 రేషన్ దుకాణాలుండగా, ఈ ఏడాది కొత్తగా 23 మంజూరయ్యాయి. మొత్తం 1,860 దుకాణాలున్నాయి. ► 55 దుకాణాలు ఇన్చార్జీల అజమాయిషీలో ఉన్నాయి. 475 దుకాణాలు బినామీల గుప్పిట్లో నడుస్తున్నాయి. ► భార్యల పేరిట ఉన్న 500 దుకాణాల్లో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. ►{Vేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్చెరు మండలంలో 59 దుకాణాలున్నాయి. వీటిలో పటాన్చెరు పట్టణంలో 16 ఉండగా మిగిలినవి గ్రామాల్లో ఉన్నాయి. ఈ 59లో 14 దుకాణాలు బినామీలవే.. ► జిన్నారంలో 45 డీలర్‌షిప్‌లకు గాను 10 షాపులు బినామీలతో నడుస్తున్నాయి. ► రామచంద్రాపురంలో 38 డీలర్‌షిప్‌లలో 11 బినామీలున్నాయి. ► నారాయణఖేడ్ నియోజవర్గంలోని 70 శాతం దుకాణాల్ని బినామీలే నడిపిస్తున్నారు. ► మెదక్ పట్టణంలోని 20 రేషన్ షాపుల్లో ఆరు బినామీల చేతిలోనే ఉన్నాయి. ► ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన దుకాణాలు అగ్రవర్ణ సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి. ► వైకల్యం ఉన్న వారికి కేటాయించిన 39 దుకాణాలను సైతం ఇతరులు హస్తగతం చేసుకున్నారు. ► {పజాప్రతినిధులుగా ఉన్న వారు తమ దుకాణాల్ని ఇతరులకు అప్పగించారు. మహిళల పేరిట ఉన్నవీ ఇతరులే నిర్వహిస్తున్నారు.