కపిల్‌దేవ్ పేరుకు ఏకగ్రీవంగా ఆమోదం
చెన్నై(ఐఏఎన్ఎస్): భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. కపిల్ పేరును బిసిసిఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అవార్డుల కమిటీ సభ్యులు బిసిసిఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, కార్యదర్శి సంజయ్ పటేల్, సీనియర్ జర్నలిస్ట్ అయాజ్ మీనన్ ఈ రోజు ఇక్కడ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం ఈ అవార్డును సునీల్ గవాస్కర్ అందుకున్నారు.
టెస్ట్ మ్యాచ్‌లలో అయిదు వేల పరుగులతో నాలుగు వందల వికెట్లు తీసుకున్న మొదటి క్రికెటర్ కపిల్‌దేవ్. 1978లో ప్రారంభమైన అతని క్రికెట్ కెరీర్ 1994లో ముగిసింది. అతను ఆడిన 131 టెస్ట్ మ్యాచ్‌లలో 434 వికెట్లు తీసుకున్నాడు. 8 సెంచరీలతో 5248 పరుగుల చేశాడు. 225 వన్డే ఇంటర్నేషన్ మ్యాచ్‌లు ఆడాడు. కపిల్ కెప్టెన్‌గా 1983లో వరల్డ్ కప్ గెలుచుకోవడం ఓ మధుర జ్ఞాపకం.