clashes between tdp leaders
-
టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుల మధ్య మరోసారి వార్
-
ఆటలో అరటిపండ్లే.. ‘ఆ ముగ్గురి’ని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టేసినట్టేనా!?
సాక్షి, విజయవాడ: నగర తెలుగుదేశం పార్టీలోని వెనుకబడిన తరగతుల్లో ముసలం మొదలైంది. విజయవాడ పార్లమెంటరీ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిరువూరు నియోజకవర్గానికి చెందిన మునెయ్యను అధిష్టానం తాజాగా నియమించింది. ఈ పదవి కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణరావు, కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో మెంబర్ ఫతావుల్లా పోటీపడ్డారు. పదవిని ఫతావుల్లాకు ఇవ్వాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) పట్టుపట్టగా.. బీసీ వర్గానికి చెందిన ఎరుబోతుకు దక్కాల్సిందేనని బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా భీష్మించుకున్నారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా రమణరావు వైపు మొగ్గుచూపారు. ఎంపీ కేశినేనికి, అర్బన్ పార్టీలోని ముఖ్య నేతల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరడానికి ఈ పదవి నియామకం విషయంలో తలెత్తిన విభేదాలే కారణమని ముఖ్య నాయకులు గుర్తుచేస్తున్నారు. విజయవాడ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షునిగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం నియామక సమయంలోనే పూర్తి కమిటీని వేయాలని అధిష్టానం భావించినప్పటికీ సాధ్యం కాలేదు. ఇరువర్గాలు భీష్మించుకోవడంతో ప్రధాన కార్యదర్శి పదవి నియామకాన్ని అప్పట్లో పక్కన పెట్టేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో మునెయ్య నియామకం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఫతావుల్లాను స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా అధిష్టానం నియమించింది. చదవండి: (టీడీపీ నేతల్లో అంతర్మథనం.. అడకత్తెరలో ‘ఆ ముగ్గురు’!) ఉద్దేశపూర్వకంగానేనా? ఇకపై చంద్రబాబు వైపే చూడనని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోయేదే లేదని తెగేసి చెప్పిన ఎంపీ కేశినేని చివరకు తన కేశినేని భవన్లో అధినేత చిత్రపటాన్ని తొలగించి ఆ స్థానంలో రతన్‌టాటా బొమ్మను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడం, ఉద్వేగభరితంగా ఉపన్యసించడం, రాష్ట్రపతిని కలవడానికి చంద్రబాబు బృందం ఢిల్లీ వెళ్లినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించడం గుర్తించాల్సిన పరిణామం. చంద్రబాబు అన్నివిధాలుగా ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధపడిన తర్వాతే కేశినేని పార్టీ కార్యాలయానికి వెళ్లారని, క్రియాశీలకంగా వ్యవహరించారని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. అందులో భాగంగానే ఫతావుల్లాకు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వడం, నగర నేతలు బొండా, బుద్ధా, మీరాలు ప్రతిపాదించిన రమణరావుకు మొండిచెయ్యి చూపడమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఎరుబోతుకు ఇవ్వని పక్షంలో నగరానికే చెందిన లుక్కా సాయిరాం గౌడ్, గోగుల రమణారావు, ఎన్సీ భానుసింగ్ తదితర వెనుకబడిన తరగతులకు చెందిన ముఖ్య నాయకులు పలువురు ఉన్నారు. వారిలో ఎవరికైనా ఇవ్వడానికి అధిష్టానం ఎందుకు ఆలోచించలేదోనని పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో 16 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో సగం ఓటర్లు నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లోనే ఉన్నారు. తక్కిన 8 లక్షల మంది ఓటర్లు నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నారు. పార్లమెంటరీ కమిటీలోని రెండు ముఖ్యమైన అధ్యక్ష, కార్యదర్శ పదవులు రూరల్ నియోజకవర్గాలైన జగ్గయ్యపేట (నెట్టెం రఘురాం), తిరువూరు(మునెయ్య)కు ఇవ్వడమంటే విజయవాడ నగరంలోని నేతలను పక్కన పెట్టినట్లేనని గుర్తుచేస్తున్నారు. పార్టీ పరంగా నగరంలోనే ఎక్కువ కార్యక్రమాలు, అవసరాలు కూడా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కేశినేని మాట చెల్లుబాటు కావడం మొదలైందని, ముగ్గురు సంగతి మరెలా ఉంటుందో వేచిచూడాల్సి ఉందని పార్టీలోని సీనియర్లు సెటైర్లు వేస్తుండం పరిశీలనాంశం. -
కృష్ణా జిల్లా టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీపీ పదవి ఇస్తామని మోసం చేయడంతో మోపిదేవి మండల అధ్యక్షుడు నడికుడిటి జనార్ధనరావు, ఆయన భార్య టీడీపీకి రాజీనామా చేశారు. జనార్ధనరావు భార్య మెరకనపల్లి ఎంపీటీసీగా టీడీపీ తరపున పోటీ చేసి గెలిచింది. పార్టీ మోసం చేయడంతో ఆమె ఎంపీటీసీ పదవికి కూడా రాజీనామా చేసింది. కాగా, మోపిదేవి ఎంపీపీ పదవిని జననీకుమారికి ఇస్తున్నట్లు టీడీపీ గతంలో ప్రచారం చేసింది. ఎంపీపీ పదవి దక్కకపోవడంతో జనార్ధన కుటుంబం తీవ్ర మనస్థాపం చెందింది. ఎంపీపీ పదవి ఇస్తున్నామని నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకి జనార్ధనరావు సమీప బంధవు. ఈ సందర్భంగా జనార్ధనరావు.. పార్టీలో మత్స్యకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. పార్టీ జడ్పీటీసీ సభ్యుడు డబ్బు రాజకీయాలు చేస్తూ నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనార్ధనరావుకు మద్దతుగా గ్రామ టీడీపీ నేతలు, కార్యకర్తలు రాజీనామా చేశారు. చదవండి: (వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: ఎంపీ కేశినేని నాని) -
తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, నల్లగొండ: తెలుగు తమ్ముళ్లు తన్నులాడుకున్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమావేశం జరిగింది. హుజూర్‌నగర్‌కు చెందిన టీడీపీ నేత చావ కిరణ్మయి వర్గం, వ్యతిరేక వర్గం వారు కుర్చీలు విసురుకున్నారు. కిరణ్మయి భర్త సహదేవరావుపై చేయిచేసుకున్నారు. టీడీపీ నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమావేశం రసాభాసగా మారిం ది. వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో కుర్చీలు విరిగిపోయాయి. వివరాలు.. పార్టీ పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహిం చారు. పార్టీని బూత్ కమిటీల నుంచి బలోపేతం చేసి పూర్వ వైభవం తేవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత చావ కిరణ్మయి వేదిక మీద కూర్చోవడంతో సోమగాని నరేందర్‌గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాడి చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు ఇటీవలనే బీజేపీలో చేరుతున్నట్లుగా, ఆ పార్టీ నాయకులను కలిసినట్లుగా పత్రికల్లో వార్తలొచ్చాయని, వెంటనే పార్టీ నుంచి కిరణ్మయిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కిరణ్మయి భర్త సహదేవరావు నీకేం హక్కు ఉంది..? నీకు పార్టీలో ఏం పదవి ఉంది...? అంటూ ఆగ్రహంతో నరేందర్ గౌడ్‌పై దూసుకొచ్చాడు. నియోజకవర్గంలో ఎవరికీ తెలియకుండా కమిటీలు వేస్తున్నాడని, మండవ నర్సయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు సహదేవరావుపై చేయిచేసుకున్నారు. ఘర్షణ పడుతున్న వారిని సముదాయిస్తున్న నాయకులు ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పార్టీ కార్యాలయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీలోనే ఉంటూ బీజేపీ నాయకులతో కలిసి వచ్చిన వార్తలు పత్రికల్లో ప్రచురితమయ్యాయని, వెంకటేశ్వర్లు, నరేందర్ బయటపెట్టారు. ఇరువర్గాలను పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామభూపాల్‌రెడ్డి సముదాయించారు. ప్రజా సంక్షేమంపై ముఖ్యమంత్రికి శ్రద్ధలేదు ఇతర పార్టీల వారిని టీఆర్ఎస్లో చేర్చుకోవడం తప్ప సీఎం కేసీఆర్‌కు ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదని టీడీపీ రాష్ట్ర పరిశీలకులు సామ భూపాల్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పార్టీ పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఓవర్ లోడ్‌తో సతమతమవుతుందని, త్వరలోనే కేసీఆర్‌కి సొంత పార్టీ నాయకులే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఎంతో మంది విద్యార్థుల ప్రాణత్యాగం, పోరాటం ఫలితంగా వచ్చిన స్వరాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు దినసరి కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ప్రతి ఇంటికీ తాగునీరు పూర్తి చేయలేదన్నారు. మోడల్‌గా పథకాలను చూపించి రాష్ట్రం మొత్తం బంగారు తెలంగా ణగా అవుతుందని గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలన్నారు. ప్రతి శనివారం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో మోపతయ్య, బంటు వెంకటేశ్వర్లు, కాశీనాథ్, నెల్లూరు దుర్గా ప్రసాద్, నాతాల రాంరెడ్డి, ఎల్వీ యాదవ్, తుమ్మల మధుసూదన్‌రెడ్డి, ఆకునూరి సత్యనారాయణ, జానకిరాములు, ప్రభాకర్, కృష్ణయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రియాజ్అలీ, గుండు వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. -
వెంకటగిరిలో తెలుగుతమ్ముళ్ల బాహాబాహీ