clay pot
-
మట్టికుండ చేసిన స్మృతి మంధాన.. ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ (ఫొటోలు)
-
బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం
విదిశా నగర సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం సువర్ణపురి. ఆ పట్టణం లో ప్రజోతుడు పేరున్న ధనిక వ్యాపారి. ప్రజోతునికి మణిమాలుడు అనే కుమారుడు. అతనూ పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి వ్యాపారంలో తోడుగా ఉండేవాడు. మణిమాలుడు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచాడు. ప్రజోతుడు వృద్ధుడయ్యాడు. కుమారునికి వ్యాపార పద్ధతులు, సుదూర రాజ్యాల ప్రజల తీరు తెన్నులు చెప్పుతూ... కాలం గడపసాగాడు. అప్పుడప్పుడూ జైన సాధువుల్ని, బౌద్ధ భిక్షువుల్ని పిలిచి దానాలు ఇచ్చేవాడు. నగరం లో కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు.కొన్నాళ్ళకు మణిమాలుడు కూడా పెద్ద వ్యాపారి అయ్యాడు. ధనం పెరిగిన కొద్దీ అతనికి ధనదాహం కూడా పెరిగింది. అక్రమ వ్యాపారాలు సాగించాడు. దానితో ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దానధర్మాలు మానాడు. ధనంతోపాటు మానసిక అశాంతీ పెరిగింది. నిద్ర సుఖానికి దూరం అయ్యాడు. భయానికీ, ఉలికిపాటుకూ చేరువయ్యాడు. తండ్రి తన కుమారునిలో పెరిగిపోతున్న అశాంతిని గమనించాడు. ఒకరోజున పిలిచి– ‘‘నాయనా! నీవు నైతికతకి దూరమవుతున్నావు. మనోవేదనకి దగ్గరవుతున్నావు. నీవు ఇక నాతోపాటు బుద్ధ సందేశాలు వినడానికి రా.. ప్రస్తుతం భగవాన్ బుద్ధుడు ఇక్కడకు సమీపంలోనే ఉంటున్నారు’’ అని అనునయంగా చెప్పాడు. అలా... తనతో రెండు మూడుమార్లు మణిమాలుణ్ణి బుద్ధుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ప్రజోతుడు. ఆ తర్వాత తానే స్వయంగా బుద్ధుని దగ్గరకు వెళ్ళసాగాడు మణిమాలుడు. ఒకరోజు మణిమాలుడు బుద్ధునితో ‘‘భగవాన్! నేను నా తండ్రిలా దానాలు చేయలేదు. సాధువుల్ని గౌరవించలేదు. వారిని సత్కరించలేదు. వ్యాపారాన్నీ ధర్మబద్ధంగా చేయనూ లేదు. ఇప్పుడే నా తప్పు తెలుసుకున్నాను. కానీ... నాకు ఒక బెంగ ఉంది. మరణానంతరం నా తండ్రికి గానీ, నాకు గానీ స్వర్గం లభిస్తుందా?’’ అని అడిగాడు.అతని ఆంతర్యం గ్రహించాడు బుద్ధుడు. ‘‘మణిమాలా! రేపు వచ్చేటప్పుడు ఒక మట్టికుండ, కొంత వెన్నపూస, కొన్ని గులకరాళ్ళు తీసుకుని రా’’ అన్నాడు. మరునాడు అవి తీసుకువచ్చాడు మణిమాలుడు. కుండలో గులకరాళ్ళు పోయించి, వాటిమీద వెన్నముద్ద పెట్టించి,‘‘మణిమాలా! దగ్గరలో ఉన్న తటాకం దగ్గరకు తీసుకుపోయి ఈ కుండను నీటిమీద ఉంచి, కర్రతో పగలగొట్టు. వెన్న మునిగితే నీ తండ్రికి స్వర్గ్రపాప్తి, రాళ్ళు తేలితే నీకు స్వర్గ్రపాప్తి..’’ అని చెప్పి పంపాడు. మణిమాలుడు గబగబా వెళ్ళి నీటిపై కుండను ఉంచి కర్రతో పగలగొట్టాడు. వెన్న తేలింది. రాళ్ళు మునిగాయి. దానితో ఆందోళనపడుతూ బుద్ధుని దగ్గరకు పరుగున వచ్చి పడ్డాడు. విషయం చెప్పి...‘‘మా ఇద్దరికీ స్వర్గం దక్కే మార్గం ఏమిటి భగవాన్’’ అని అడిగాడు. ‘‘నాయనా నీటిలో రాళ్ళు మునగడం వాటి ప్రకృతిధర్మం. నీటిపై తేలడం వెన్న సహజ ధర్మం. అవి వాటి సహజ ధర్మాల్ని తప్పి ఎప్పుడూ ప్రవర్తించవు. అలాగే... మంచి పనులు చేస్తే మనిషికి మనశ్శాంతి. సుఖ నిద్ర, సుఖ జీవనం. అదే స్వర్గం. చెడ్డపనులు చేస్తే మనస్సుకు అశాంతి. దుఃఖం. నిద్రకు దూరం. మనోవ్యధ. అదే నరకం. మంచిగా మానవునిగా, మానవతతో జీవించు. దుఃఖాన్ని ఇచ్చే అకుశల కర్మలు ఆచరించకు. అదే స్వర్గం. ...’’ అని చెప్పాడు.మణిమాలుని మనస్సు తేటపడింది. మట్టికుండ మహోపదేశాన్ని అందించింది. ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకున్నాడు. దానాలు చేస్తూ, ధర్మకార్యాలు నెరవేరుస్తూ జీవితం ఆనందంగా కొనసాగించారు. – డా. బొర్రా గోవర్ధన్ -
మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..
ఇటీవల కాలంలో పాతకాలం పద్ధతితో వండే వంట స్టయిల్ని అనుసరిస్తున్నారు అతివలు. కానీ ఇలా మన బామ్మల కాలం నాటి పద్ధతిలో వండుకోవడం మంచిదే గానీ ఎలా వండాలో ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోకపోతే లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. సంప్రదాయ భారతీయ పద్ధతిలో వంట చేయాలనుకుంది ఫుడ్ బ్లాగర్ ఫర్హా ఆఫ్రీన్. అందులో భాగంగానే ఓ మట్టి ప్రాతను స్టవ్‌పై పెట్టింది. అందులో నూనె వేసి జీలకర్ర, కరేపాకు ఇలా వేసిందో లేదో అంతే ఒక్కసారిగా భగ్గున మంట లేచి.. కుండ పగిలి చెల్లచెదురుగా పడిపోయింది. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియోను ఆఫ్రిన్ షేర్ చేస్తూ..దయచేసి మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవద్దు అని గట్టిగా హెచ్చరిస్తోంది. తనలా ట్రై చేయాలనుకునేవారు ఛెఫ్‌లు లేదా పెద్దవాళ్లను అడిగి సలహలు తీసుకుని మరీ ప్రయత్నించండి అని సూచిస్తోంది ఆఫ్రిన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు కొత్తగా మట్టి పాత్రల్లో చేయాలనుకుంటే పెద్దలను అడగాలని ఒకరు, మట్టిపాత్రలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆరనిచ్చాక వండాలని మరోకరు సలహలు ఇస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Farha Afreen (@homely_ccorner) (చదవండి: జపాన్‌లో టీచర్స్ డే ఎలా జరుపుకుంటారో తెలుసా!) -
‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం
సాక్షి, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ వీడియో వైరల్‌గా మారుతుందో తెలియదు. చిన్న వీడియో అయినా కూడా బాగుంటే దూసుకుపోతుంది. అందులో ఉన్నవారు రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతారు. ఇలాంటివెన్నో జరిగాయి. తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో అంతా మట్టి కుండ చుట్టూ తిరుగుతోంది. ఆ కుండ తయారుచేసిన వారెవరో తెలుసుకోండి.. అతడికి మనదేశంలోని రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులు అప్పగిద్దాం’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరేమో ఆ కుండను ఫెవికాల్తో తయారు చేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మన మట్టి మహిమ అని మట్టిదనం గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకోండి. చదవండి: పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? కృష్ణాష్టమి సందర్భంగా ఓ చోట ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. పై వరకు చేరిన యువకులు ఆ కుండను కొట్టడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. రాయి తీసుకుని కొట్టినా కూడా కుండ పగలడం లేదు. మరో యువకుడు కూడా వచ్చాడు. ఆ యువకుడైనా ఉట్టి కొడతాడమోనని గ్రామస్తులు ఈలలు, కేరింతలు చేస్తూ ఉత్సాహ పరిచారు. అతడికి కూడా నిరాశే ఎదురైంది. రెండు చేతులతో పట్టుకుని బలంగా కొడుతున్నా ఆ కుండ కొంచెం కూడా పగలలేదు. దీంతో గ్రామస్తులంతా పగలబడి నవ్వారు. చివరకు ఆ ఉట్టికుండ పగిలిందో లేదో తెలియదు కానీ 30 సెకన్లు ఉన్న ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. కామ్‌దేవ్ బాబా అనే ట్విటరటీ ఈ వీడియో షేర్ చేశాడు. ‘ఆ కుండ ఎవరో తయారుచేశారో కనుక్కోండి! అతడికి మనదేశంలో రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులు ఇద్దాం’ అని కామ్‌దేవ్ బాబా రాసుకొచ్చాడు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి Find the guy who made this Matki and give him all the Highways and Bridges contract in whole of India 😅😊 pic.twitter.com/qJZY7lJoKB — KamDev Baba (@TheKamDevBaba) September 10, 2021 -
నర్మెటలో బయటపడిన మృణ్మయపాత్రలు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట వద్ద పురావస్తుశాఖ అధికారులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో శుక్రవారం మృణ్మయ పాత్రలు బయట పడ్డాయి. ప్రాచీన మాన వుడు ఉపయోగించిన నాలుగు పాత్రలు, ఎరుపురంగు కౌంచ్ తో ఉన్న రెండు శంఖాలు, మట్టిపాత్రలు పెట్టుకునేందుకు రింగ్ స్టాండ్, నలుపురంగు పాత్ర లభించాయి. నక్షత్ర రాశులు, సంవత్సరంలో వచ్చే కాలాలను గుర్తించే విధంగా బండపై చెక్కిన ఆనవాళ్లను గుర్తించారు. పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు మట్టికుండల్లో ఉంచినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మెన్హీర్ వద్ద గుర్తించిన పెద్ద రాతి సమాధి సుమారుగా 40 టన్నుల వరకు బరువు ఉన్నట్లు అంచనా వేశామని అన్నారు -
నిండుకళ
వేసవిలో దాహం తీరాలంటే కుండలో నీళ్లే దివ్యౌషధం. ఇక మొన్నే జరిగిన ఉగాది పండుగకు షడ్రుచుల పచ్చడి చేయడానికి మట్టి కుండనే శ్రేష్టమైనదని తెలుసు. వీటిని స్వయంగా మనమే తయారు చేసుకుంటే.. సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో ఇటీవల జరిగిన పాటరీ వర్క్‌షాప్ ఇందుకు వేదికైంది. ఇంత మట్టి అంటితేనే షిట్ అంటూ చేతులను శుభ్రపరుచుకునే వాళ్లు.. కుమ్మరి చక్రం గిరగిరా తిప్పారు. మట్టి ముద్దను ముట్టుకోవడమే కాదు.. దానిని ముచ్చట గొలిపే రీతిలో మలిచారు. ..:: చీకోటి శ్రీనివాస్ పెళ్లయినా, బోనాల పండుగైనా, దీపావళి వేడుకైనా మట్టి పాత్రల కోసం కుమ్మరివాడలకు పరుగులు తీసేవారు ఊళ్లలో. కుమ్మరి చక్రం గిరగిరా తిరుగుతుండగా.. మట్టిముద్ద నుంచి కుండలు, ప్రమిదలు ఆకృతి దాల్చే విధానం చూస్తే అచ్చెరువనిపిస్తుంది. సిటీలో అన్ని రకాల మట్టి పాత్రలు లభ్యమవుతున్నా.. వాటి తయారీ ఎలాగో ఈ తరానికి తెలియదు. పట్నవాసంలో మట్టి వాసన ఎరగని మనుషులకు పల్లెల్లోని బతుకుదెరువు ఆటవిడుపుగా మారింది. కులవృత్తులను ప్రోత్సహించడంతో పాటు మట్టి పాత్రల తయారీపై అవగాహన కలిగించడానికి అవర్ సాక్రెడ్ స్పేస్‌లో నిర్వహించిన పాటరీ వర్క్‌షాప్ ఈ తరానికి ఓ పాఠమే నేర్పింది. వింత అనుభూతి ‘మమ్మీ పాట్ ఎలా తయారవుతుందో చూడు, డాడీ మనమూ ట్రైచేద్దాం! అంకుల్ ప్లీజ్ గివ్ మీ వన్ చాన్స్... ఎక్సలెంట్’ అంటూ మురిసిపోయిన చిన్నారి నియతి నుంచి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కార్మెల్ వరకు ఎవరి అనుభూతులు వాళ్లవే! నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కుమ్మరి ముత్యాలు.. వీళ్లందరికీ ఇన్‌స్ట్రక్టర్‌లా మారాడు. ఆయన సారె సాయంతో మట్టిపాత్రలు తయారు చేస్తుంటే... చూసి వావ్ అని అశ్చర్యపోవడమేకాదు, తయారీలోనూ భాగస్వాములయ్యారు. చిన్నా పెద్దా అంతా కలిసి.. మట్టి వాసనను ఆస్వాదించారు. సారెను తిప్పుతూ రకరకాల పాత్రల తయారీకి ప్రయత్నించారు. తాము సృష్టించిన పాత్రలను చూసుకుని మురిసిపోయారు. బాల్యం గుర్తొచ్చింది ‘మట్టి పాత్రల తయారీ చూస్తుంటే బాల్యం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మారేడ్‌పల్లిలో కుండల తయారీ చూస్తే ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉండేది. ఇప్పుడు అలాంటి దృశ్యాలు చూడటం భాగ్యమైపోయింది. ఇలాంటి ప్రదర్శనల ద్వారా కొత్త తరం పిల్లలకు మన సంస్కృతి గురించి తెలియజెప్పిన వారమవుతాం’ అంటోంది అనుపమ. ‘అమేజింగ్... నేను కూడా పాట్ తయారు చేశా. మెత్తని బంకమట్టితో చక్రంపై పాట్స్ తయారు చేయడానికి ఎంత ఏకాగ్రత కావాలో! ముత్యాలు అంకుల్ కుండలు తయారు చేస్తుంటే అద్భుతం అనిపించింది. మట్టిపాత్రల తయారీ పట్ల పూర్తి అవగాహన వచ్చింది’ అని చెబుతోంది విద్యార్థిని శ్వేత. ‘అందరు పాట్స్ చేస్తుంటే చూశా. నాకూ ఒక చాన్స్ ఇమ్మన్నా. ఎంతో చక్కటి పాట్‌ను తయారు చేసుకున్నా, ఇంటికి వెళ్లాక చక్రం, మట్టి కొనుక్కుని నేనే అందమైన పాట్స్ తయారు చేసి, వాటిపై పెయింటింగ్స్ వేసి మా ప్రెండ్స్‌కి గిఫ్ట్ ఇస్తా’ అంటున్నాడు థర్డ్ క్లాస్ చదువుతున్న అరవ్. ‘పదిహేను నిమిషాలు కష్టపడ్డాను. పాట్ తయారు చేస్తుంటే చాలాసార్లు షేప్ మారింది. పూర్తయ్యేవరకు టెన్షన్ ఫీలయ్యా. మొత్తానికి నేననుకున్న తరహాలో పాట్ బయటకు తీశా. తయారు చేసుకోవడం ఒకెత్తయితే చక్రం నుంచి కట్‌చేసి బయటకు తీయడం మరో ఎత్తు’ అంటున్నాడు స్టూడెంట్ సంతోష్. మొత్తానికి పాట రీ వర్క్‌షాప్‌ను ఫుల్ ఎంజాయ్ చేసిన సిటీవాసులు.. తాము తయారు చేసిన మట్టిపాత్రలతో పాటు మధుర జ్ఞాపకాలనూ పదిలంగా మోసుకెళ్లారు.