closing cermony
-
Tokyo Paralympics 2021: ఘనంగా టోక్యో పారాలింపిక్స్ ముగింపు వేడుకలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో వేదికగా జరిగిన పారాలింపిక్ క్రీడలు ముగిశాయి.12 రోజుల పాటు జరిగిన టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అద్బుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 19 పతకాలు లభించాయి. వాటిలో 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా 19 పతకాలతో పట్టికలో భారతదేశం 24 వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్‌లో భారతదేశం క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శన ఇది. పారాలింపిక్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి గోల్డెన్ షూటర్ అవని లేఖార ప్రాతినిధ్యం వహించింది.త్రివర్ణ పతాకం చేతబూనిన అవని లేఖర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సాయంత్రం నిర్వహించిన ముగింపు ఉత్సవంలో బాణసంచా, రంగురంగుల విద్యుద్దీప కాంతులు, జపనీస్ కళాకారుల విన్యాసాలు, లేజర్ లైటింగ్ షో ముగింపు వేడుకల్లో ఆకట్టుకున్నాయి. చదవండి: Pramod Bhagath:ప్రమోద్ భగత్ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం టోక్యో నుంచి తిరిగి వస్తున్న భారత బృందాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దేశ క్రీడా చరిత్రలో టోక్యో ఒలింపిక్స్ ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ మనకు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు. భారత అథ్లెట్ల బృందంలోని ప్రతి ఒక్కరూ మనకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని అభినందించారు. అథ్లెట్లు, కోచ్ లు, వారి కుటుంబసభ్యులకు అందరూ మద్దతివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. చదవండి: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. Change begins with sports... First time a woman para athlete marches with the National Flag.. thank you @AvaniLekhara .. you so richly deserve this honor. You have in true sense won hearts of Indians. #Tokyoparalympics2020 #closingceremony Oh it's farewell time already. Sayonara pic.twitter.com/Zi6VaZdQRI — Deepa Malik (@DeepaAthlete) September 5, 2021 A historic performance by the Indian athletes helped India finish with 19 medals, including five gold!! Watch #AvaniLekhara participate as #TeamIndia's Flagbearer at the closing ceremony of the #TokyoParalympics VC: DD Sports pic.twitter.com/CZ7t0KcFXu — The Better India (@thebetterindia) September 5, 2021 -
ఒలింపిక్స్ ఫైనల్ డే: భారత్ ర్యాంక్ 47.. టాప్‌లో ఎవరంటే?
► టోక్యో ఒలింపిక్స్ వేడుకలు సాయంత్రం 4.30కి జరగనున్నాయి. కోవిడ్ కారణంగా ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించినరెజ్లర్ భజరంగ్ పునియా భారత బృందం ఫ్లాగ్ బేరర్‌గా ఉండనున్నాడు. ► మెన్స్ మారథాన్‌లో కెన్యా అథ్లెట్ ఎలియుడ్ కిప్చోగే చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఎలియుడ్ కిప్చోగే రికార్డు అందుకున్నాడు. మెన్స్ మారథాన్‌లో కిప్చోగే 2 గంటల 8 నిమిషాల 38 సెకన్లతో తొలి స్థానం ఉండగా.. నెదర్లాండ్స్‌కు చెందిన నగాయే 2 గంటల 9 నిమిషాల 58 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజతం.. ఇక బెల్జియంకు చెందిన బెల్ అబ్డీ 2 గంటల 10 నిమిషాలలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలపొందాడు. ఇక కిప్చోగేకు ఒలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం కాగా.. ఓవరాల్‌గా 2004 ఎథెన్స్లో కాంస్య, 2008 బీజింగ్‌లో రజతం, రియో 2016లో స్వర్ణం, తాజాగా టోక్యోలో మరోసారి స్వర్ణం కొల్లగొట్టాడు. Back-to-back golds!#KEN's Eliud Kipchoge wins his second consecutive Olympic men's marathon in a time of 2:08.38.@WorldAthletics #Athletics @OlympicsKe pic.twitter.com/pqDsJDVxDw — Olympics (@Olympics) August 8, 2021 టోక్యో: టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. దాదాపు అన్ని క్రీడాంశాల్లో పోటీలు పూర్తవ్వగా.. మరికొన్ని క్రీడలు ఈరోజు జరగనున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలతో చరిత్ర సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాల అత్యుత్తమ ప్రదర్శనను టోక్యో ఒలింపిక్స్‌లో బ్రేక్ చేసి మరుపురానిదిగా మలుచుకుంది. కాగా విశ్వక్రీడలు ముగింపు వేడుకలను ఆతిథ్య దేశం ఘనంగా నిర్వహించనుంది. ఇక ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు పతకాల ఖాతా తెరవగా భారత్ ఏడు పతకాలు( స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలు) సాధించడం ద్వారా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది. ఇక పతకాల వేటలో టాప్ 3 స్థానాల కోసం ఎప్పటిలాగే అమెరికా, చైనా , జపాన్ పోటీ పడగా.. 39 స్వర్ణాలతో అమెరికా తొలి స్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానం, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్ పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం); చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం); జపాన్ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) ఉన్నాయి. -
మహిళల కబడ్డీ విజేత వైజాగ్
నూజివీడు : దసరా సందర్భంగా నూజివీడులో మూడు రోజులుగా సాగుతున్న అఖిల భారత 65వ పురుషుల చెడుగుడు, మహిళల కబడ్డీ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. మహిళల కబడ్డీ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలవగా, గత ఏడాది విజేత అయిన విజయనగరం జట్టు ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంది. లీగ్ పద్ధతిలో జరిగిన ఈ పోటీలో ప్రారంభం నుంచి ఉత్తమ ప్రతిభ చూపిన విశాఖపట్నం, విజయనగరం జట్లు ఫైనల్‌కు చేరాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో విశాఖపట్నం జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించి విజయాన్ని సాధించి విజేతగా నిలిచింది. గత ఏడాది మాదిరిగానే కృష్ణాజట్టు మూడో స్థానంలోను, తూర్పుగోదావరి జట్టు నాల్గో స్థానంలోనూ నిలిచాయి. హోరాహోరీగా ఫైనల్ విశాఖపట్నం, విజయనగరం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ప్రథమార్థం నిలిచే సరికి 13–10 పాయింట్లతో విజయనగరం జట్టు ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో విశాఖ జట్టు తమ మెరుగైన ఆటతీరుతో రైడర్లు వరుసగా పాయింట్లు తీసుకురావడంతో 17–13 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంకా ఆట రెండు నిమషాలుందనగా, ఇరుజట్లు వరుసగా పాయింట్లు సాధించినప్పటికీ చివరికి 21–17 స్కోరుతో విశాఖపట్నం విజయాన్ని సాధించింది. విశాఖ జట్టు డిఫెన్స్లోను, ఎఫెన్స్లోను పూర్తి ఆధిక్యతను సాధించింది. ఆటలకు నిలయం నూజివీడు : ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, సినీహీరో వేణు, కావూరి భాస్కర్, మూల్పురి లక్ష్మణస్వామి చేతులమీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ నూజివీడులో పూర్వకాలం నుంచి ఆటలకు గొప్ప పేరుందన్నారు. నటుడు వేణు మాట్లాడుతూ 65 ఏళుల్గా అఖిల భారతస్థాయిలో చెడుగుడు పోటీలు నిర్వహిస్తున్నారంటే మామూలు విషయం కాదన్నారు. కార్యక్రమంలో స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు బొబ్బిలి కొండలరావు, కార్యదర్శి టీవీ కృష్ణారావు, ఉపాధ్యక్షుడు గాజుల శోభనాచలం, స్పోర్టింగ్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బోయపాటి వస్తారు.. ఏర్పాట్లు చూస్తారు
- రాజమండ్రి ఘటన తప్పు తనమీదే వేసుకుంటానని సీఎం చెప్పారు - రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గోష్పాద క్షేత్రం (కొవ్వూరు) : దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ వచ్చి గోదావరి హారతి, ముగింపు ఏర్పాట్లు సంబంధించి మిగిలిన పనులన్నీ చేస్తారని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్ చెప్పారు. బుధవారం ఆయన కొవ్వూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25న పుష్కరాలు ముగింపు సందర్భంగా అద్భుతమైన బాణసంచా కాల్పులు ఏర్పాటు చేశామని, ఇవి సుమారు 8 నిమిషాలపాటు ఉంటాయని తెలిపారు. గోదావరి హారతికి కొత్త ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికోసం బోయపాటి శ్రీనివాస్ గురువారం ఉదయం రాజమండ్రి రానున్నారని వెల్లడించారు. మూడు రోజులపాటు మిగిలిన అన్ని పనులూ ఆయన పూర్తిచేస్తారని చెప్పారు. ముగింపు ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ లేరని, హుదూద్ తుపాను నేపథ్యంలో 8 రోజులు మాత్రమే విశాఖలో ఉన్నారని చెప్పారు. కానీ.. పుష్కరాలకు మాత్రం 14 రోజులు ఇక్కడే ఉన్నారని అన్నారు. పుష్కరాల్లో కష్టపడి పనిచేసిన వారందరినీ ఈనెల 26న సీఎం సత్కరిస్తారని చెప్పారు. తప్పు తనమీదే వేసుకుంటానని బాబు అన్నారు పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని, అది మాయని మచ్చలా ఉండిపోతుందని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. ఆ ఘటన అనూహ్యంగా జరిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి మొదటిసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం ఆ రోజు తాను చూశానని తెలిపారు. ప్రజలకు మొహం ఎలా చూపించాలో అని సిగ్గుపడ్డామని, భయపడ్డామని అన్నారు. అయినా ధైర్యం చేసి ఘటన తరువాత రేవులోకి వెళ్లామన్నారు. చివరకు అందరూ క్షమించారని, ఇది దురదృష్టకరమని ప్రజలే అన్నారని మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ ఘటన పోలీసు వైఫల్యం, కలెక్టర్ వైఫల్యం, తహసిల్దార్ వైఫల్యం కారణమని అననని, తప్పు తనమీదే వేసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని మురళీమోహన్ చెప్పారు.