CM chair
-
మహారాష్ట్రకు కొత్త సీఎం.. ఫోటోలు వైరల్!
ముంబై: ఏక్నాథ్ శిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వర్గంతో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కొన్ని ఫోటోలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో.. ఏక్నాథ్ షిండే కుమారుడు, లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కూర్చోవటం వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూపర్ సీఎం: ఎన్సీపీ శివసేన వ్యవస్థాపకులు బాలా సాహేబ్ థాక్రే ఫోటో ముందు ఉన్న కుర్చీలో శ్రీకాంత్ షిండే కూర్చున్న చిత్రాలను ట్వీట్ చేశారు ఎన్సీపీ అధికార ప్రతినిధి రవికాంత్ వార్పే. ఆ కుర్చి వెనకాలే ఉన్న బోర్డుపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం- ముఖ్యమంత్రి’ అని రాసి ఉంది. ఈ క్రమంలో సూపర్ సీఎం అంటూ పేర్కొన్నారు రవికాంత్. ఇది ఎలాంటి రాజధర్మమని ప్రశ్నించారు. మరోవైపు.. సీఎం కుర్చీపై జోకులు వేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తన సానుభూతి తెలుపుతున్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు శివసేన నాయకురాలు ప్రియాంక ఛతుర్వేది. ఆధిత్య థాక్రే ఒక మంత్రిగా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే వారికి సమస్య అనిపించిందని, కానీ, శ్రీకాంత్ షిండే కనీసం ఎమ్మెల్యే కాకపోయినా ఎలాంటి సమస్య లేదని ఎద్దేవా చేశారు. खा.श्रीकांत शिंदे यांना सुपर सीएम झाल्याबद्दल हार्दिक शुभेच्छा. मुख्यमंत्र्यांच्या गैरहजेरीत त्यांचे चिरंजीव मुख्यमंत्री पदाचा कारभार सांभाळतात.लोकशाहीचा गळा घोटण्याचे काम सुरूय.हा कोणता राजधर्म आहे?असा कसा हा धर्मवीर?@mieknathshinde @DrSEShinde pic.twitter.com/rpOZimHnxL — Ravikant Varpe - रविकांत वरपे (@ravikantvarpe) September 23, 2022 తిప్పికొట్టిన షిండే.. ఈ క్రమంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు శ్రీకాంత్ షిండే. ఆ ఫోటో తన నివాసంలో తీసుకున్నదని, తన తండ్రి కోసం అధికారికంగా కేటాయించిన కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు. అలాగే.. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం సైతం కాదని, థానేలోని ప్రైవటు నివాసం, ఆఫీసుగా వెల్లడించారు. వెనకాల ఉన్న బోర్డును తరుచూ తరలిస్తుంటారని, తన నివాసం నుంచే వర్చువల్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నందున అక్కడ ఉందని వివరణ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఆఫీసును సీఎం, తానూ ఉపయోగిస్తానని వెల్లడించారు. ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్ -
Karnataka: కౌన్ బనేగా కర్ణాటక సీఎం?
తమకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరొస్తున్నారనే ప్రశ్న ప్రస్తుతం కర్ణాటక పౌరుల మెదళ్లను తొలచేస్తోంది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే సత్తా ఉన్న నేతనే సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ వర్గాల నుంచి బలమైన నేతను నేనేనంటూ చాలా మంది ముందుకొచ్చినా.. బీజేపీ ఢిల్లీ నాయకత్వం కొందరి పేర్లనే పరిశీలనలోకి తీసుకుందని సమాచారం. నిఘా వర్గాలు, ప్రభుత్వంతో సంబంధంలేని ప్రైవేట్ సీనియర్ సలహాదారులు,ఆర్ఎస్ఎస్, ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారుల నుంచి తెప్పించిన నివేదికలను అగ్రనేతలు పరిశీలిస్తున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె తుది నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. లింగాయత్, ఒక్కలిగ ఇలా ఒక వర్గం వ్యక్తికే సీఎం పదవి ఇస్తున్నామనేలా కాకుండా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎంపికచేయాలని పార్టీ భావిస్తోంది. సీఎం పదవి వరించే అవకాశముందని పేర్లు వినిపిస్తున్న వారిలో ముఖ్యల గురించి క్లుప్తంగా.. బసవరాజ్ బొమ్మై(61) ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో హోం మంత్రి అయిన బసవరాజ్ సోమప్ప బొమ్మై.. యడియూరప్పకు అత్యంత దగ్గరి వ్యక్తి. లింగాయత్. మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడైన బసవరాజ్ కూడా ‘జనతా పరివార్’కు చెందినవారే. 2008లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగానూ చేశారు. మురుగేశ్ నిరానీ(56) ప్రస్తుతం గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. లింగాయత్‌లలో ప్రముఖమైన పంచమ్శాలీ లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. వృత్తిపరంగా పారిశ్రామికవేత్త అయిన ఈయనకు చెందిన విద్యుత్, చక్కెర తదితర పరిశ్రమల్లో లక్షకుపైగా కార్మికులు ఉన్నారు. హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. అరవింద్ బెల్లాద్(51) ఉన్నత విద్యను అభ్యసించిన అరవింద్ బెల్లాద్కు నేతగా మంచి పేరుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ చట్టసభ్యుడైన చంద్రకాంత్ బెల్లాద్ కుమారుడే ఈ అరవింద్. ఆర్ఎస్ఎస్ మూలాలున్న అరవింద్‌కు యువనేతగా కర్ణాటకలో ఏ అవినీతి మచ్చాలేని రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు. బసన్నగౌడ పాటిల్(57) విజయపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బసన్నగౌడ గతంలో కేంద్రంలో టెక్స్టైల్స్, రైల్వే శాఖల సహాయమంత్రిగా చేశారు. లింగాయత్ వర్గానికి చెందిన ఈయన గతంలో రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎంఎల్సీగానూ పనిచేశారు. ఈ ఏడాది ఆరంభంలో పంచమశాలీ లింగాయత్‌లనూ బీసీలుగా గుర్తించాలని, రిజర్వేషన్ కల్పించాలని జరిగిన ఉద్యమానికి సారథ్యం వహించారు. సీటీ రవి(54) బీజేపీ ప్రస్తు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సీటీ రవి ఒక్కలిగ వర్గానికి చెందిన నేత. సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తి. బీజేపీ జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్.సంతోష్‌కు బాగా సన్నిహితుడు. కర్ణాటకలో గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రిగా రాజీనామా చేసి కేంద్రంలో పార్టీ పనుల్లో క్రియాశీలకంగా మారారు. సీఎన్ అశ్వథ్ నారాయణ్(52) కర్ణాటక డెప్యూటీ సీఎంగా సేవలందిస్తున్నారు. వైద్యవిద్యను అభ్యసించిన సీఎన్ అశ్వథ్ నారాయణ్ ఆధునిక భావాలున్న వ్యక్తి. 2008 నుంచి మల్లేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చి పార్టీ.. ఒక్కలిగ వర్గానికి చెందిన ఈయనను డిప్యూటీ సీఎంను చేసింది. ప్రహ్లాద్ జోషి(58) కేంద్ర బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి బ్రాహ్మణ వర్గానికి చెందిన సీనియర్ నేత. ధర్వాడ్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రధాని మోదీకి దగ్గరి వ్యక్తిగా పేరుంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈయనకు కేబినెట్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఆర్ఎస్ఎస్ వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు చక్కబెడతారని ఈయనకు పేరుంది. విశ్వేశ్వర హెగ్డే కగెరి(60) ప్రస్తుతం సిర్సి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వేశ్వర హెగ్డే కగెరి ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయన ఏబీవీపీ విద్యార్థి నేతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
వాకింగ్‌తో ప్రచారం
సాక్షి, చెన్నై: తండ్రిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు తనయుడు పడుతున్న కష్టం ఇది. మనకు.. మనమే అంటూ రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ఈ తనయుడు అధికార పగ్గాలు లక్ష్యంగా రేయింబవళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తనయుడే డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్. వినూత్న బాణీతో ప్రచారంలో దూసుకెళ్తోన్న స్టాలిన్ మందీమార్బలం, కమాండోల భద్రతా వలయం కూడా లేకుండా సాధారణ వ్యక్తిగా వాకింగ్‌తో ప్రజల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. ఆయన్ను గుర్తు పట్టిన వాళ్లు మనలో ఒక్కడూ అంటూ నినాదించడం మొదలెట్టారు. ఇందుకు తిరుచెందూరు వేదికగా నిలిచింది. అధికార పగ్గాల్ని చేపట్టి తీరాలన్న కాంక్షతో డీఎంకే వర్గాలు ఉరకలు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రథముడిగా డీఎంకే దళపతి స్టాలిన్ ఉన్నారు. అధినేత కరుణానిధి ఓ వైపు, చెల్లెమ్మ కనిమొళి మరో వైపు ప్రచారంలో ఉరకలు తీస్తున్నా, దళపతి శైలి మాత్రం వినూత్నంగా సాగుతున్నది. మనకు..మనమే అంటూ స్టైలీష్ స్టాలిన్‌గా మారిన ఈ దళపతి ఎన్నికల ప్రచారంలో సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. రోడ్ షో సాగుతున్నా, చటుక్కున వాహనం దిగేయడంతో కాసేపు నడకతో జనాన్ని పలకరించడం, చిన్న దుకాణాల్లో బజ్జిలు, బిస్కెట్లు ఆరగించడం, టీ కాఫీలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువ జామున వాకింగ్ రూపంలో ఓటర్లను పలకరించే యత్నం చేసి స్టాలిన్ సఫలీకృతులు అయ్యారు. తిరుచెందూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్టాలిన్ ఉదయాన్నే హంగు ఆర్భాటాలు, మంది మార్భలం, కమాండో బలగాల భద్రత కూడా లేకుండా సాధారణ వ్యక్తిగా బయటకు వచ్చేయడం విశేషం. అక్కడి వీధుల్లో వాకింగ్ చేస్తూ, తిరుచెందూరు బీచ్ వైపుగా కదిలారు. కాసేపు బీచ్‌లో సముద్రపు గాలిని ఆస్వాదించిన స్టాలిన్ తిరిగి హోటల్‌కు వెళ్లడానికి గంట సమయం పట్టిందటా..!. ఇందుకు కారణం స్టాలిన్‌ను గుర్తు పట్టిన జనం మనలో ఒక్కడూ అని నినాదిస్తూ పలకరింపుల్లో దిగడం గమనార్హం. ఆలయ వీధుల్లో వాకింగ్‌తో మహిళల్ని , కార్మికుల్ని పలకరిస్తూ, రోడ్డుపై ఉన్న దుకాణంలో కొంబరి బోండాను తాగి, అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ హోటల్‌కు చేరడం విశేషం. అయితే, తండ్రిని సీఎం కుర్చీలో కూర్చేబెట్టేందుకు వారసుడు పడుతున్న పాట్లు, చేస్తున్న ఫీట్లకు ఏ మేరకు ఓట్లు రాలుతాయో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
రేసుగుర్రాలు
* సీఎం అభ్యర్థుల నియోజకవర్గాలు సిద్ధం * తిరువారూర్‌లో కరుణ * ఆర్కేనగర్లో అమ్మ * ఉలందూర్ పేటలో కెప్టెన్ * పెన్నగరంలో అన్బుమణి * సీపీఎం, సీపీఐ జాబితాల విడుదల * 11 మందితో వీసీకే తొలి జాబితా * నేడు తమాకా, టీఎన్‌సీసీ జాబితాలు సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సీఎం కుర్చి కైవసానికి నాలుగు కూటములకు చెందిన అభ్యర్థుల నియోజకవర్గాలు ఖరారయ్యాయి. తిరువారూర్ నుంచి కరుణానిధి, ఆర్కేనగర్ నుంచి అమ్మ జయలలితలు ఇప్పటికే రేసులో దిగారు. ఇక, ఉలందూర్ పేట నుంచి ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్, పీఎంకే కూటమి అభ్యర్థి అన్భుమణి రాందాసు పెన్నాగరం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగా రు. ఇక, సీపీఎం, సీపీఐలు తమ జాబితాల్ని ప్రకటించగా, 11 మందితో వీసీకే తొలి జాబితా ప్రకటించింది. తమిల మానిల కాంగ్రెస్, టీఎన్‌సీసీ జాబితాలు వెలువడనున్నాయి. డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి , డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే కూటమి, బీజేపీ కూటమిలు పంచముఖ సమరంగా అసెంబ్లీ ఎన్నికల రేసులో దిగిన విషయం తెలిసిందే. ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్నా, తామూ ప్రత్యామ్నాయమే అంటూ డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే కూటమి, బీజేపీ కూటమిలు పరుగులు తీస్తున్నాయి. సీఎం కుర్చీని తామంటే తాము కైవసం చేసుకుంటామని ఎన్నికల రేసులో ఢీకొడుతున్నారు. ఓటమి ఎరుగని యోధుడిలో వరుస విజయాలతో దూసుకొస్తున్న డీఎంకే అధినేత కరుణానిధి ఆరోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు తగ్గ వ్యూహ రచనలతో ముందుకు సాగుతూ, మళ్లీ తిరువారూర్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మళ్లీ సీఎం పగ్గాలు లక్ష్యంగా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ నినాదంతో ముందుకు సాగుతున్న అమ్మ జయలలిత మళ్లీ ఆర్కేనగర్ నుంచి రేసులో నిలబడ్డారు. ఈ రెండు కూటముల సీఎం అభ్యర్థుల నియోజకవర్గాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. మిగిలిన కూటముల సీఎం అభ్యర్థులు ఏ ఏ స్థానాల్ని ఎంపిక చేసుకుంటారో అన్న ఎదురు చూపులు నెలకొంటూ వచ్చాయి. మూడో సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ మళ్లీ సిట్టింగ్ స్థానాన్నే ఎంపిక చేసుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, వ్యూహాత్మకంగా స్థానాన్ని మార్చారు. తొలి సారిగా చిదంబరం నుంచి ఒక్కడే అసెంబ్లీ మెట్లు ఎక్కినా, తదుపరి రిషి వందియం నుంచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన విజయకాంత్ ఈ సారి ఉలందూరు పేట నుంచి సీఎం పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక, తొలి సారిగా 2014 లోక్ సభ ఎన్నికల బరిలో ప్రత్యక్షంగా దిగిన నేత అన్భుమణి రాందాసు. ఆ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి పార్లమెంట్ మెట్లు ఎక్కిన అన్భుమణి ప్రస్తుతం తమిళనాడు సీఎం కుర్చీ లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. పీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా రేసులో ఉన్న ఆయన తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ ఇచ్చిన ధర్మపురి జిల్లా పెన్నగరం అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం. ఈ నాలుగు కూటముల సీఎం అభ్యర్థుల నియోజకవర్గాల ప్రకటనతో ఇక, ఆయా స్థానాల్లో ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నది. వీవీఐపీ నియోజకవర్గాల జాబితాలో ఆ నాలుగు చేరి ఉన్నాయి. కాగా, బీజేపీ కూటమికి సీఎం అభ్యర్థిని ప్రకటించేనా, లేదా..? అన్నది వేచి చూడాల్సిందే. సీపీఎం, సీపీఐ, వీసీకే అభ్యర్థుల జాబితా: డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోని సీపీఎం, సీపీఐ, వీసీకేలు సోమవారం తమ అభ్యర్థుల జాబితాల్ని ప్రకటించాయి. సీపీఎం 25 స్థానాలకు, సీపీఐ 25 స్థానాలకు ప్రకటించగా, 11 మందితో తొలి జాబితాను వీసీకే ప్రకటించింది. మలి జాబితాను మంగళవారం విడుదల చేయడానికి వీసీకే నేత తిరుమావళవన్ నిర్ణయించారు. ఇక, ఈ కూటమిలోని తమిల మానిల కాంగ్రెస్ సైతం మంగళవారం జాబితను ప్రకటించనున్నది. కాగా, ఈ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎండీకే 104, ఎండీఎంకే 26 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. సీపీఎం విడుదల చేసిన జాబితాలో పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మళ్లీ అవకాశం కల్పించారు. దూరంగా పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సౌందరరాజన్ - పెరంబూరు, బాలకృష్ణన్- చిదంబరం, కె తంగ వేల్ - తిరుప్పూర్ దక్షిణం, లాజర్ - పెరియకుళం, కె భీమ్ రావ్ - మదురవాయిల్, రామమూర్తి - విక్రవాండి, విపి నాగై మల్లి - కీల్ వేలూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఇక, సీపీఐ విడుదల చేసిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం ఆర్ముగం - అవినాశి, గుణశేఖరన్ - శివగంగై, కె ఉలగనాథన్ - తిరుత్తరై పూండి, లింగముత్తు - గుడియాత్తం, నంజప్పన్ - పెన్నాగరం, టి రామచంద్రన్ - తలి, సుందరం - భవానీ సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, డిఎంకే అధినేత కరుణానిధి రేసులో ఉన్న తిరువారూర్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాసిలామణి రంగంలోకి దిగనున్నారు. ఇక, వీసీకే 11 మందితో తొలి జాబితా విడుదల చేయగా, 14 స్థానాల అభ్యర్థుల జాబితాను మంగళవారానికి వాయిదా వేసింది. పీఎంకే జాబితా : అన్భుమణి రాందాసు సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన పీఎంకే ఇప్పటి వరకు 90 మంది అభ్యర్థులను ప్రకటించింది. 234 స్థానాల్లో పోటీ చేస్తున్న పీఎంకే మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో మునిగి ఉన్నది. ఈ పరిస్థితుల్లో సోమవారం 117 మందితో నాలుగో జాబితాను ప్రకటించారు. మిగిలిన 27 స్థానాలకు మంగళవారం అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. తాజా జాబితాలో అన్భుమణి పెన్నగరం నుంచి పోటీ చేస్తుండగా, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి మెట్టూరు నుంచి బరిలోకి దిగనున్నారు. కాగా, డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ 41 స్థానాలకు గాను అభ్యర్థుల్ని మంగళ వారం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
సీఎం కావడం ఇష్టం లేదు
సీఎం అవడం నాకు ఇష్టం లేదు అని నటి రాధికా శరత్‌కుమార్ అన్నారు. ఈమె డేరింగ్ గురించి తెలియని వారు చాలా తక్కువేనని చెప్పవచ్చు. రాధిక మంచి వక్త కూడా. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం నయాప్పుడై. గీతరచయిత పా.విజయ్ యువ కథానాయకుడిగా నటించిన ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నైలో జరిగింది. కార్యక్రమంలో అతిథిగా పాల్గొని చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించిన రాధికా శరత్‌కుమార్ మాట్లాడుతూ తాను ఎస్ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో చాలా చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆయన అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని భావిస్తారన్నారు. ముఖ్యంగా టైమ్ విషయంలో కరెక్ట్‌గా ఉండాలంటారు. కోపం వస్తే ఎవరన్నది కూడా చూడకుండా కొట్టేస్తారన్నారు. ఆయన నుంచి తిట్లు, దెబ్బల నుంచి తప్పించుకున్నది నేనొక్కదానినే అనుకుంటాఅని అన్నారు. చివరికి విజయకాంత్ కూడా చివాట్లు తిన్నారు. విజయకాంత్ ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నార న్నారు.ఆయన తరచూ టెన్షన్‌కు గురవుతుంటారని ఆ సమయం లో పక్కనున్న వారినెవరినో ఒకరిని కొట్టేస్తుంటాడని అన్నారు. ఆయనకు ఆ అలవాటు దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ నుంచే వచ్చి ఉంటుందని తనకు అర్థమైందన్నారు. ఇకపోతే ఈ వేదికపై తన ను సీఎం అని వ్యాఖ్యానించారని, నిజాని కి సీఎం అవడం తనకు ఇష్టం లేదని అన్నా రు. ఇప్పటికే ఏడుగురు సీఎం కుర్చీకి పోటీపడుతున్నాని ఎనిమిదో సీఎంగా తానెందుకని పేర్కొనారు. ఎన్నికలు రాబోతున్నాయని ప్రజల్లో ఎంతటి వేడి పుట్టించినా ఓట్లు వేస్తూనే ఉన్నారనీ రాధిక శరత్‌కుమార్ చమత్కరించారు. -
సీఎం కుర్చీ లాగుతాం
మాలల మహాగర్జన బహిరంగ సభలో కేసీఆర్‌కు వక్తల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: దళితులకు మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం స్థానం కల్పించకుంటే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని, సీఎం కుర్చీ లాగేస్తామని మాలల మహాగర్జన బహిరంగసభలో వక్తలు హెచ్చరించారు. ఏడు శాతంగా ఉన్న అగ్రకులాలవారికి మంత్రివర్గంలో 11 మంత్రి పదవులిచ్చి, 17 శాతంగా ఉన్న ఎస్సీలకు ఒకటి, 51 శాతంగా ఉన్న బీసీలకు 4 మంత్రి పదవులిచ్చి వివక్ష చూపారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర మాల- మాల అనుబంధ కులాల సమాఖ్య (ఎంఎంఏకేఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాలల మహాగర్జనలో పలువురు నేతలు ప్రసంగించారు. ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాందాసు అథవాలె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలిచిన ఎస్సీలకు ప్రాధాన్యత ప్రకారం మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నారు. ప్రాణాలర్పించైనా మాలలు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. హిందువులుగా మారిన ముస్లింలు, క్రిస్టియన్లను ఘర్ వాపసీ చేయాలని, లేనిపక్షంలో బుద్ధిస్టులుగా మార్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాగ్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ దళిత్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, ప్రొఫెసర్ జోగేంద్ర ఖవాడె మాట్లాడుతూ.. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్ హామీని విస్మరించారని, చివరికి మంత్రివర్గంలో కూడా దళితులకు న్యాయం కల్పించలేదని విమర్శించారు. పార్లమెంటు, శాసనసభ హాళ్లల్లో అంబేడ్కర్ విగ్రహాలు పెట్టాలని దీక్ష చేసిన ఎంపీ కవితకున్న జ్ఞానం కూడా ఆమె తండ్రి, సీఎం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. దళితులను అణచి వేసే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి కుర్చీని లాగేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎంఎంఏకేఎస్ చైర్మన్ సుద్దాల దేవయ్య, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, ప్రజాగాయకురాలు విమలక్క , మాల- మాల అనుబంధ కులాల సమాఖ్య(ఎంఎంఏకేఎస్) నాయకులు బాలనాథం, మంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మాఫీనా.. మెలికా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికారం అప్పగిస్తే రైతుల రుణ మాఫీ పై మొదటి సంతకం చేస్తానని ప్రకటించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే తమ కోరిక తీరుస్తారని సుమారు 5 లక్షల మంది జిల్లా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రుణమాఫీపై తొలి సంతకం చేసి జిల్లాలోని రూ.4500 కోట్ల దాకా ఉన్న రుణాలను రద్దు చేసి ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో రుణమాఫీ అన్న పదానికే కట్టుబడతారా? లేక కొత్త షరతులు తెర మీదకు తెస్తారా? అనే అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతోంది. జిల్లాలోని వివిధ జాతీయ బ్యాంకులతో పాటు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులకు దీర్ఘ కాలిక, స్వల్ప కాలిక రుణాల కింద రూ.5 వేల కోట్లకు పైగా పంపిణీ చేశాయి. ఇందులో చాలా మంది రైతులు వడ్డీ మాత్రం చెల్లించి కొత్త రుణాలు తీసుకున్నట్లు రికార్డుల్లో సర్దుబాట్లు చేయించుకుని పాత రుణాలు జమ చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ రైతు రుణాల హామీ ప్రకటించింది. ఇందులో ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తారు? ఎంత మొత్తంలోపు రుణాలు రద్దు చేస్తారు? అనే స్పష్టత మాత్రం ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని రైతులు బ్యాంకులు, సహకార బ్యాంకులకు రుణాలు చెల్లించడం మానేశారు. బ్యాంకర్లు కనీసం వడ్డీ అయినా వసూలు చేసేందుకు ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేక పోయింది. దీంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయడానికి వెనుకంజ వేస్తున్నాయి. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని బ్యాంకర్లు, రెండు నెలలు ఆగితే అవకాశం ఉంటే రుణాలు రద్దు అవుతాయని, అంత వరకు వేచి చూడాలని రైతులు వాదిస్తూ వచ్చారు. జిల్లాలో సుమారు 2.5 లక్షల హెక్టార్లలో పంటల సాగు జరుగుతోంది. ఇందుకు గాను 2013-14 సంవత్సరానికి 2వేల 458 కోట్ల వరకు వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఇవి కాకుండా రైతులు రీషెడ్యూల్ చేసుకున్న రుణాలు సుమారు 1,000 కోట్లకు పైగానే ఉన్నాయి. వీటితో పాటు పంటలు నష్టపోయినందున బ్యాంకులకు అప్పులు చెల్లించక పేరుకు పోయిన బకాయిలు సుమారు 1,000 కోట్ల దాకా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవన్నీ కలిపితే జిల్లాలో రైతుల రుణాలు 4500 కోట్ల దాకా ఉన్నాయి. రైతుల్లో ఆందోళన చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణాల మాఫీ గురించి ఎన్నికలయ్యే దాకా ఆనందించిన రైతులకు ఇప్పుడు తమ రుణం మొత్తం రద్దవుతుందా? కొత్త ప్రభుత్వం రుణాలన్నీ రద్దు చేస్తుందా? లేక ఇప్పుడు మాట మార్చి ఏమైనా మెలిక పెడుతుందా? అనే ఆందోళన మొదలైంది. తాను రాష్ర్టం కలిసున్నప్పుడు పాదయాత్ర సందర్భంగా రుణ మాఫీ హామీ ఇచ్చానని, ఇప్పుడు కొత్త రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఉందని కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రైతుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రుణాలన్నీ ఒకే సారి కాకుండా విడతల వారీగా మాఫీ చేసేట్లయితే బ్యాంకులు తమకు కొత్త రుణాలు ఇవ్వవని, అలాంటప్పుడు తాము రుణాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంత వరకు తమకు ఎలాంటి స్పష్టత లేదని జిల్లా అధికారులు, బ్యాంకర్లు చెబుతున్నారు. మొత్తం మీద జిల్లాలో సుమారు 5 లక్షల మంది రైతులకు ఆనందం కలిగించేలా కొత్త సీఎం చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం రోజే రైతు రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తారా? లేక ఇందులో మెలిక పెడతారా?అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.