సీఎం కావడం ఇష్టం లేదు | I do not want to be CM : Actress Radhika sarathkumar | Sakshi
Sakshi News home page

సీఎం కావడం ఇష్టం లేదు

Published Mon, Feb 22 2016 9:15 PM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

సీఎం కావడం ఇష్టం లేదు - Sakshi

సీఎం కావడం ఇష్టం లేదు

సీఎం అవడం నాకు ఇష్టం లేదు అని నటి రాధికా శరత్‌కుమార్ అన్నారు. ఈమె డేరింగ్ గురించి తెలియని వారు చాలా తక్కువేనని చెప్పవచ్చు. రాధిక మంచి వక్త కూడా. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం నయాప్పుడై. గీతరచయిత పా.విజయ్ యువ కథానాయకుడిగా నటించిన ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నైలో జరిగింది.  కార్యక్రమంలో అతిథిగా పాల్గొని చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించిన రాధికా శరత్‌కుమార్ మాట్లాడుతూ తాను ఎస్‌ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో చాలా చిత్రాల్లో నటించానని తెలిపారు.

ఆయన అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలని భావిస్తారన్నారు. ముఖ్యంగా టైమ్ విషయంలో కరెక్ట్‌గా ఉండాలంటారు. కోపం వస్తే ఎవరన్నది కూడా చూడకుండా కొట్టేస్తారన్నారు. ఆయన నుంచి తిట్లు, దెబ్బల నుంచి తప్పించుకున్నది నేనొక్కదానినే అనుకుంటాఅని అన్నారు. చివరికి విజయకాంత్ కూడా చివాట్లు తిన్నారు. విజయకాంత్ ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నార న్నారు.ఆయన తరచూ టెన్షన్‌కు గురవుతుంటారని ఆ సమయం లో పక్కనున్న వారినెవరినో ఒకరిని కొట్టేస్తుంటాడని అన్నారు.

ఆయనకు ఆ అలవాటు దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ నుంచే వచ్చి ఉంటుందని తనకు అర్థమైందన్నారు. ఇకపోతే ఈ వేదికపై తన ను సీఎం అని వ్యాఖ్యానించారని, నిజాని కి సీఎం అవడం తనకు ఇష్టం లేదని అన్నా రు. ఇప్పటికే ఏడుగురు సీఎం కుర్చీకి పోటీపడుతున్నాని ఎనిమిదో సీఎంగా తానెందుకని పేర్కొనారు. ఎన్నికలు రాబోతున్నాయని ప్రజల్లో ఎంతటి వేడి పుట్టించినా ఓట్లు వేస్తూనే ఉన్నారనీ రాధిక శరత్‌కుమార్ చమత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement