CNN-IBN
-
మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్‌గా కేటీఆర్ ఎంపిక
హైదరాబాద్ : ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు మరోసారి జాతీయా స్ధాయి గౌరవం దక్కింది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద లైఫ్ స్టయిల్ మ్యాగజైన్ రిట్జ్-సీఎన్ఎన్ ఐబీఎన్లు లు కలిసి కేటీఆర్‌కు మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ (Most Inspirational Icon of the Year) అవార్డుని ప్రకటించింది. ప్రముఖ వార్త చానల్ సీఎన్ఎన్ ఐబీఎన్ తో కలిసి నిర్వహిస్తున్న ఆడి రిట్జ్ ఐకాన్ అవార్డ్స్ 2015గాను ఈ అవార్డుని ప్రదానం చేయనుంది. డిసెంబర్ 13న బెంగళూరులో జరగనుంది. ప్రజాజీవితంలో అద్భుతమైన పురోగతి సాధించినందుకు గాను ఈ అవార్డుకి ఎంపిక చేసినట్టు రిడ్జ్ మ్యాగజైన్ తెలిపింది. తనదైన పరిపాలనా పద్దతులు, అలోచన విధానంతో తెలంగాణ ప్రజలకి అందిస్తున్న సేవలను గుర్తించినట్టు, పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు నిలిపేందుకు కృషి చేస్తున్న తెలివైన నాయకుడని కేటీఆర్‌ను జ్యూరీ అభినందించింది. ప్రజల అవసరాలపైన అపారమైన జ్ఞానం ఉన్న కొత్తతరం రాజకీయ నాయకుడిగా పేర్కొంది. ఈ మేరకు మంత్రిని ప్రత్యేకంగా అభినందింస్తూ ఈ -మెయిల్‌ని పంపింది. త్వరలోనే సంస్ధ సీనియర్ ప్రతినిధి బృందం స్వయంగా మంత్రిని కలిసి అవార్డు కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలిపింది. మంత్రి కె.తారక రామారావుతోపాటు పలువురి ప్రముఖులకి ఆయా రంగాల్లో అవార్డులను ప్రకటించింది. వ్యాపారం రంగంలో గ్రంధి మల్లిఖార్జునరావు, తెలుగు చలన చిత్ర రంగంలో రాంచరణ్, గౌరంగ్ షాకి ప్యాషన్, నందన్ నిలేకనీకి సాంకేతిక రంగంతోపాటు విద్యాబాలన్‌కి సినిమా విభాగాలకు అవార్డులను ప్రకటించింది. తనకి అవార్డు ప్రకటించడం పట్ల ఐటి శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి గుర్తింపని కేటీఆర్ తెలిపారు. -
‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో కేసీఆర్
23 శాతం ఓట్లతో ప్రథమస్థానంలో తెలంగాణ సీఎం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వార్తా చానెల్ ‘సీఎన్ఎన్-ఐబీఎన్’ నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు. కేసీఆర్, కేరళకు చెందిన ఐపీఎస్ అధికారి విజయన్‌ల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొంది. ప్రముఖ సినీ నటుడు ఆమిర్‌ఖాన్, భారత సైన్యం కంటే అత్యధిక శాతం ఓట్లతో కేసీఆర్(23 శాతం) ముందున్నారు. కేరళలో మత్తు మందులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విజయన్ 21 శాతం ఓట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ పోటీలో కేసీఆర్‌తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, బీజేపీ చీఫ్ అమిత్ షా, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తదితరులున్నారు. -
బాబును అతిగా చూపిస్తున్నారు: సాయినాథ్
సీమాంధ్రలో గణనీయ సంఖ్యలో లోక్‌సభ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్తూ సీఎన్ఎన్-ఐబీఎన్ ఇచ్చిన ఒపీనియన్ పోల్‌పై సీనియర్ జర్నలిస్ట్ పి.సాయినాథ్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. అదే వేదికపై ఆయన ఆ ఒపీనియన్ పోల్‌ను తప్పుబట్టారు. సీమాంధ్రలో జగన్ విజయం సాధిస్తారని పాలగుమ్మి సాయినాథ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల గంపగుత్తగా కాంగ్రెస్ నాయకులు టీడీపీ వెళ్లడం వల్ల టీడీపీ పరిస్థితి కాసింత మెరుగుపడిందని మాత్రమే భావించగలమని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడును అతిగా చూపిస్తున్నారని, గత పదేళ్లుగా ఇదే జరుగుతోందని... సీఎన్ఎన్-ఐబీఎన్లోకూడా ఒపీనియన్ పోల్స్ రూపంలో చంద్రబాబు నాయుడును ఎక్కువ చేసి చూపిస్తున్నారని చేశారని సాయినాథ్ విశ్లేషించారు. -
''బాబును అతిగా చూపిస్తున్నారు''
-
కాంగ్రెస్, బీజేపీలకు ‘ఆమ్ ఆద్మీ’ దెబ్బ
సీఎన్ఎన్-ఐబీఎన్, ద వీక్ సర్వే న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యతరాదని.. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒక సర్వే చెప్తోంది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీని, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో లాభపడవచ్చని ఆశిస్తున్న ప్రతిపక్ష బీజేపీని.. కొత్తగా బరిలోకి దిగిన మూడో శక్తి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) గట్టి దెబ్బతీస్తుందని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సీఎన్ఎన్-ఐబీఎన్ వార్తా చానల్, ద వీక్ వారపత్రిక, సీఎస్డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ప్రీ-పోల్ సర్వే ఫలితాల ప్రకారం.. దేశంలో ఏకైక నగర రాష్ట్రమైన ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ ఈసారి 19-25 సీట్లకు మాత్రమే పరిమితవుతుంది. కొత్త పార్టీ ఏఏపీ కూడా అందరినీ ఆశ్యర్యచకితులను చేస్తూ 19-25 సీట్లు గెలుచకుంటుంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ రెండిటికన్నా కాస్త మెరుగ్గా 22-28 సీట్లలో గెలుపొందుతుంది. ఎన్నికల్లో ఇవే ఫలితాలు గనుక వస్తే ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు దాదాపు అసాధ్యమే అవుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా పార్టీ నుంచి భారీగా ఫిరాయింపులకు పాల్పడితే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాదని చెప్తున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40.3 ఓట్ల శాతంతో 43 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 36.3 శాతం ఓట్లతో 23 సీట్లు గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 27 శాతం, బీజేపీకి 29 శాతం, ఏఏపీకి 28 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఇక సీఎం అభ్యర్థులుగా కేజ్రీవాల్ 25 శాతం ప్రజా మద్దతుతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చారు. ప్రస్తుత సీఎం షీలాదీక్షిత్‌కు 16 శాతం, బీజేపీ నేత విజయ్‌గోయల్‌కు 10 శాతం మంది మద్దతు పలికారు. -
రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు చుక్కలు చూపిన చంద్రబాబు
సీఎన్ఎన్-ఐబీఎన్ ఇంటర్వ్యూలో పొంతనలేని సమాధానాలు రాష్ట్ర విభజన విషయంలో వైఖరి తెలుసుకోవడానికి ప్రయత్నించిన సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబు చుక్కలు చూపారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న చంద్రబాబును.. సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. అసలు విభజన అంశంలో చంద్రబాబు వైఖరి ఏమిటో తెలుసుకోవడానికి.. రాజ్‌దీప్ సర్దేశాయ్ వీలైనంతగా ప్రయత్నించినా, ఏమీ తెలుసుకోలేకపోయారు. తాను అడిగిన ప్రతీ ప్రశ్నకూ చంద్రబాబు పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో ఆశ్చర్యపోవడం రాజ్‌దీప్ వంతు అయిం ది. చివరకు... ‘‘మిమ్మల్ని పదిహేను నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసినా.. మీరు తెలంగాణకు అనుకూలమా? సీమాంధ్రకు అనుకూలమా? అనేది మాత్రం నాకు అర్థం కాలేదు’’ అంటూ రాజ్‌దీప్ ఇంటర్వ్యూను ముగించారు. అంతేకాదు.. చంద్రబాబు ఇంటర్వ్యూలో ఏమీ తెలుసుకోలేకపోయానంటూ సర్దేశాయ్ ట్విట్టర్లోనూ వాపోయారు. ఈ ఇంటర్వ్యూలో కొంత భాగం.. * మీరు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా స్పష్టంగా చెప్పండి? మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఇది చాలా సార్లు చెప్పాను. మేం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాం. కానీ, జరిగిందేమిటి? వాళ్లు (యూపీఏ) రాష్ట్రాన్ని విభజించిన తీరు ఏమిటి? రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతిని నాశనం చేస్తున్నారు. వాళ్లు రెండు ప్రాంతాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సామరస్యపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలి. * సామరస్యపూర్వక పరిష్కారం అంటే.. సమైక్యాంధ్రనా? విభజన జరగాలనా? మేం చెప్పేదేమిటంటే వారి (సీమాంధ్ర ప్రజల) గోడు పట్టించుకోండి. ఇరు ప్రాంతాల ప్రజలను పిలిచి మాట్లాడాలి. * అఖిలపక్షాల్లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ మాట్లాడింది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది. ఇప్పుడేమో ఇదంతా కుట్ర అని మీరు అంటున్నారు? నేను చెప్పేదేమిటంటే.. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. వాళ్ల (సీమాంధ్ర ప్రజల)ను కట్టుబట్టలతో వెళ్లిపొమ్మనలేం. వాళ్ల సమస్యలను పట్టించుకోనప్పుడు వాళ్లని వెళ్లాలని ఎలా అంటాం. * అంటే తెలంగాణ ఇవ్వొద్దంటారా? కాదు. దీనిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. * తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలంటారా? అదికాదు నేను చెప్పేది. తెలుగువారందరికీ శాంతి కావాలి. అదే సమయంలో ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కావాలి. * మిగతా పార్టీల సంగతి సరే. మీరు ఒక పార్టీ అధినేత, మాజీ సీఎం.. మరి మీరు తెలంగాణ తీర్మానానికి మద్దతిస్తారా? లేదా? స్పష్టంగా చెప్పండి అదికాదు.. మీకు ఇద్దరు పిల్లలుంటే మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరో ఒకరు మాత్రమే కావాలంటారా? * ఈ అంశంలో రెఫరెండం పెట్టాలా? మరో అఖిలపక్ష సమావేశం పెట్టాలా? అసలు ఇప్పుడు దీనంతటినీ నిర్ణయిస్తున్నదంతా ఢిల్లీ నేతలే. అందులో ఆంధ్రప్రదేశ్ వారెవరూ లేరు. అలాంటప్పుడు వారెలా నిర్ణయం తీసుకుంటారు? జేఏసీలు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. వారితో చర్చించాలి. అధికారంలో ఉన్న సోనియాగాంధీ ఈ సమస్యను సృష్టించారు. కేంద్రం వల్లే రాష్ట్రం రావణకాష్టంలా మారింది. దీనికి కేంద్రమే పరిష్కారం చూపాలి. -
సిఎన్ఎన్ ఐబిఎన్ సర్వే ఫలితాలు