
‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో కేసీఆర్
23 శాతం ఓట్లతో ప్రథమస్థానంలో తెలంగాణ సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వార్తా చానెల్ ‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు. కేసీఆర్, కేరళకు చెందిన ఐపీఎస్ అధికారి విజయన్‌ల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొంది. ప్రముఖ సినీ నటుడు ఆమిర్‌ఖాన్, భారత సైన్యం కంటే అత్యధిక శాతం ఓట్లతో కేసీఆర్(23 శాతం) ముందున్నారు.
కేరళలో మత్తు మందులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విజయన్ 21 శాతం ఓట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ పోటీలో కేసీఆర్‌తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, బీజేపీ చీఫ్ అమిత్ షా, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తదితరులున్నారు.