కోల్ ఇండియా కొత్త రికార్డు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో వాటా విక్రయానికి ఊహించిన విధంగానే స్పందన వచ్చింది. శుక్రవారం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో కేంద్రం 10 శాతం వరకూ వాటాను విక్రయించగా రూ. 22,557.63 కోట్లు లభించాయి.
దేశీ స్టాక్ మార్కెట్లలో ఇప్పటిదాకా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ(2010 అక్టోబర్లో ఐపీఓ ద్వారా రూ.15,199 కోట్ల సమీకరణ) కోల్ ఇండియాదే. ఇప్పుడు ఓఎఫ్ఎస్తో వాటా విక్రయంతో కోల్ఇండియా కొత్త రికార్డు నెలకొల్పింది. కాగా ఈ వాటా అమ్మకానికి వ్యతిరేకంగా సంస్థ కార్మిక యూనియన్లు ఆందోళన నిర్వహించాయి.