Coating
-
సీడ్.. ఎదుగుదల స్పీడ్
సాక్షి, హైదరాబాద్: రసాయన, పురుగు మందుల వ్యవసాయంతో భూమిలోని సూక్ష్మజీవులు, పోషకాలు నాశనమై జీవవైవిధ్యం కోల్పోయిన పరిస్థితుల్లో భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) సరికొత్త ఆవిష్కరణను మార్కెట్లోకి తీసుకొచి్చంది. మొక్కల పెరుగుదల, అధిక దిగుబడికి తోడ్పడేలా సూక్ష్మ పోషకాలు, క్రిమి, శిలీంధ్ర సంహారక మందులు విత్తనాలపై ప్రయోగించడానికి ఐసీఏఆర్–ఐఐఓఆర్ శాస్త్రవేత్తలు దేశంలో తొలిసారిగా బయోపాలిమర్ ఆధారిత సీడ్ కోటింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు.ఈ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించిన నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్.శర్మ, ఐఐఓఆర్ డైరెక్టర్ ఆర్కే.మాథూర్‌లతో శ్రీకర్ అగ్రిటెక్ సీఎండీ లింగా శ్రీనివాసరావు, యాదుకా అగ్రిటెక్ ఎండీ ఆదిత్యలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బయో పాలిమర్‌తో లభించే ప్రయోజనాలను వివరించే ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2015 నుంచి ప్రయోగాలు ఇప్పటి వరకు విత్తనాలకు రసాయనాలతో కూడిన సింథటిక్ పాలిమర్‌తో సీడ్ కోటింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత ఆయా కంపెనీలు విత్తన ప్యాకెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేవి. అయితే సింథటిక్ పాలిమర్ కోటింగ్‌తో వచ్చిన విత్తనాలను రైతులు విత్తినా, సరైన ఎదుగుదల లేకపోవడం, దిగుబడి రాకపోవడాన్ని నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) గుర్తించింది. సుమారు 60 ఏళ్లుగా సాగుతున్న రసాయన వ్యవసాయం వల్ల భూమి లో పోషకాలు, సూక్ష్మ జీవులు నశించిపోయాయని తేల్చారు. జీవవైవిధ్యం కోల్పోయి నిస్సారంగా మారిన భూమిని విత్తనాల ద్వారానే తిరిగి పునరుజ్జీవం చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. తద్వారా కనీసం 35 శాతం దిగుబడిని పెంచాలని భావించారు.ఈ మేరకు ఐఐఓఆర్ ప్రధాన శాస్త్రవేత్త ఆర్డి.ప్రసాద్, మరో శాస్త్రవేత్త పూర్ణ చంద్రిక 2015లో బయోపాలిమర్ ఆధారిత కోటింగ్ విధానంపై ప్రయోగాలు ప్రారంభించారు. గత ఏడాది కొత్తగా బయోపాలిమర్‌ను ఆవిష్కరించిన వీరు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందారు. ఈ బయోపాలిమర్‌ను వినియోగించి విత్తనాలను అభివృద్ధి చేసేందుకు శ్రీకర్ అగ్రిటెక్, యాదుక అగ్రిటెక్ ముందుకు రావడంతో ఆ సంస్థలతో కలిసి పనిచేశారు ఈ బయో పాలిమర్ ఆధారిత విత్తనాలు వచ్చే నెల నుంచి రైతులకు అందుబాటులోకి వస్తాయని శ్రీకర్ అగ్రిటెక్ సీఎండీ లింగా శ్రీనివాస్‌రావు తెలిపారు. వేరుశనగ, సన్‌ఫ్లవర్, కుసుమ, నువ్వులు వంటి నూనె గింజెలతోపాటు కందులు, శనగలు, వరి వంగడాలను కూడా ఈ బయోపాలిమర్ కోటింగ్ ద్వారా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రి ఇన్నోవేట్ ఇండియా సీఈవో ప్రవీణ్ మాలిక్, ఆర్ఏసీ చైర్మన్ ఎస్కే.రావు తదితర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
తాజాదనానికి 'సిల్క్' కోటింగ్!
వాషింగ్టన్ః పక్వానికి వచ్చిన కాయలు త్వరగా పండటానికి, పండ్లు మంచి రంగులో కనిపించడానికి వ్యాపారులు అనేక రసాయనాల వినియోగానికి పాల్పడుతుంటారు. అయితే అటువంటి రసాయనాల వల్ల శరీరానికి ఎంతో నష్టం కలుగుతుందని, కాల్షియం కార్బైట్ వంటి రసాయనాల వినియోగాన్ని నిషేధించాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే పండ్లపై సిల్క్ కోటింగ్ వేస్తే ఫ్రీజర్ తో అవసరం లేకుండా వారం రోజులపాటు తాజాగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. పండ్లపై కనిపించకుండా ఉండే బయో కంపాటిబుల్ సొల్యూషన్ పూస్తే, మృదువుగా ఉండే పండ్లు రిఫ్రిజిరేటర్ లో భద్రపరచాల్సిన అవసరం ఉండదని తాజా పరిశోధనల ద్వారా కనుగొన్నారు. సహజంగా తయారయ్యే సిల్క్ ద్రావణాన్ని వినియోగించి పండ్లను తాజాగా ఉంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. నీటి ఆధార ప్రక్రియతో సున్నితంగా ఉండే పండ్లను భద్రపరచుకోవడం, ఫ్రీజర్ వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గమంటున్నారు. స్ఫటికరూపంలో ఉండే ఫైబ్రాయిన్ ప్రోటీన్ కలిగిన సిల్క్... ఇతర పదార్థాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. స్ట్రాబరీలపై వేసే సిల్క్ కోటింగ్ 27 నుంచి, 35 మైక్రాన్ల మందం ఉంటుందని, ఈ ప్రకియ అనంతరం స్ట్రాబరీలను సాధారణ గది ఉష్ణోగ్రతలో భ్రదపరచుకోవచ్చని చెప్తున్నారు. పూత వేసిన పండ్లను, వేయని వాటిని విడివిడిగా భద్రపరచి పరిశీలించారు. బీటా షీట్ సిల్క్ కోటింగ్ వేసిన పండ్లు సాధారణంగా నిల్వ ఉంచిన పండ్లకంటే తాజాగా, రసంతో ఉన్నట్లు గమనించారు. ఎడిబుల్ సిల్క్ ఫైబ్రాయిన్ కలిగిన బేటా షీట్ కోటింగ్ వల్ల పండ్లలో ఆక్సిజన్ తగ్గిపోకుండా ఉండి తాజాదనాన్ని మరింతకాలం పెంచుతుందని టఫ్ట్స్ యూనివర్శిటీ పరిశోధకులు ఫియోరెంజో తెలిపారు. ఇదే పద్ధతిని అరటిపండ్ల పై కూడ ప్రయోగించి చూశామని, సిల్క్ కోటింగ్ వేసిన పండ్లపై తొక్కలు ఎక్కువకాలం తాజాగా, మృదువుగా ఉండటాన్ని గమనించామని తెలిపారు. అయితే ఈ సిల్క్ పూత వల్ల పండ్ల ఆకారంలో ఎటువంటి మార్పులు రావని, అయితే పూత వేసిన అనంతరం రుచిలో తేడాలపై ఎటువంటి అధ్యయనాలు నిర్వహించలేదని పరిశోధకులు వివరించారు. సిల్క్ పూత పండ్లను సహజ పద్ధతిలో నిల్వ చేసేందుకుకే కాక, రసాయనాలతో పని లేకుండా ఎగుమతులకు కూడ ఉపయోగంగా ఉంటుందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు బెనెడెట్టో మారెల్లీ తెలిపారు. ఈ తాజా అధ్యయనాల వివరాలను జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో నివేదించారు. -
పూతై రాలును ప్రేమ
మాధవ్ శింగరాజు చిలుక.. మన్మథుడి వాహనం. చిలక పలుకు.. మగవాడి మంత్రదండం. పూలు.. మన్మథుడి బాణాలు. పురుషులు.. పూలతో మోకరిల్లే పుంగవులు! అమ్మాయిలూ విన్నారా.. ఇవాళ్టి నుంచి ఇది శ్రీ మన్మథనామ సంవత్సరం. కాస్త జాగ్రత్త. ప్రేమ ఎక్కడి నుంచి ఊడిపడుతుందో దేవుడైనా చెప్పలేడు. బ్రహ్మదేవుడికే గుబులు పుట్టించినవాడు, పరమశివుడినీ వివశుణ్ణి చేసినవాడు.. మన్మథుడు! అతి ప్రమాదకారి. పొదిలో ఎప్పుడూ పంచశరాలు ఉంటాయి. అరవిందం, అశోకపుష్పం, నీలోత్పలం, మల్లె, మావిపూత. వాటితో పడగొడతాడు. దేవతలందర్లోకీ మన్మథుడు మహా ఎఫెక్టివ్ అంటోంది రుగ్వేదం. ఎంత ఎఫెక్టివ్వో మత్స్యపురాణంలో ఉంది. ఉగాది నాడు బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు, ఆయన చేతుల మీదుగా ‘శతరూప’ అనే అతిలోక సుందరి కూడా పుట్టుకొస్తుంది. ఆ సౌందర్యరాశిని చూడగానే అంతపెద్ద బ్రహ్మకూ మతిపోతుంది. కళ్లు తిప్పకుండా ఆమె వెనకెనకే తిరుగుతాడు. ‘నా ప్రేమను కోపంగానో.. నా ప్రేమను ద్వేషంగానో.. చెలియా ఫీల్ మై లవ్’ అంటూ ఆమె చుట్టూ చక్కర్లు కొడతాడు. అంతటితో తృప్తి చెందడు. ఆమెను ఏ దిక్కు నుంచీ మిస్ కాకూడదనుకుని నాలుగు తలలు సృష్టించుకుంటాడు. అదీ తృప్తినివ్వదు. ‘శతరూప’ గగన విహారం చేస్తుంటే ఆమెను చూసేదెలా అని సందేహపడి, పైన ఐదో శిరస్సును ఏర్పాటు చేసుకుంటాడు. బ్రహ్మగారి తీరు శివుడికి పట్టలేనంత కోపాన్ని తెప్పిస్తుంది. ఆగ్రహంతో ఆ ఐదో తల నరికేస్తాడు. అప్పటికి గానీ బ్రహ్మ తన లోకంలోకి తను తిరిగి వచ్చేయడు. పశ్చాత్తాపం చెంది, తన బుద్ధిని పెడదారి పట్టించిన మన్మథుడిని అశరీరుణ్ణి చేసేస్తాడు. ‘అశరీరుడు’ అంటే శరీరం లేనివాడు. శివపురాణంలోనూ ఇలాంటి కథే ఉంది. అందులో బాధితుడు స్వయానా పరమేశ్వరుడు! ఇంద్రుణ్ణి, తక్కిన దేవత ల్ని తారకాసురుడు అనే రాక్షసుడు టార్చర్ పెడుతుంటాడు. శివుడి కుమారుడు తప్ప అతణ్ని ఎవరూ సంహరించలేరని బ్రహ్మ అతడికి ఆల్రెడీ ఓ వరం ఇచ్చి ఉంటాడు కాబట్టి తారకాసురుడు పేట్రేగిపోతుంటాడు. అప్పటికింకా శివుడు బ్రహ్మచారే. పైగా తపస్సులో ఉంటాడు. ఎలా? బ్రహ్మ ఆలోచిస్తాడు. ఆ తపస్సును భంగపరిచి, శివుడి బ్రహ్మచర్యాన్ని భగ్నం చేయడానికి మన్మథుణ్ణి పురమాయిస్తాడు. మన్మథుడు ఉత్సాహంగా వెళ్లి, వింటినారిని సాగదీసి ఓ పూలబాణం శివుడిపైకి సంధిస్తాడు. శివుడు లిప్తకాలం తడబడి, తమాయించుకుని మూడో కన్ను తెరిచి మన్మథుణ్ని భస్మం చేసేస్తాడు. మన్మథుడి భార్య రతీదేవి వెళ్లి తన భర్తను బతికించమని శివుణ్ణి వేడుకుంటుంది. శివుడు అతడిని బతికిస్తాడు. కానీ అనంగుడిని చేస్తాడు. ‘అనంగుడు’ అంటే అంగాలు లేనివాడు. అశరీరుడే అయినా, అనంగుడే అయినా, నేటికీ మన్మథుడు తలచుకుంటే ఏ మలుపులోనో మీ తలపై ప్రేమ వేపపూతై రాలిపడొచ్చు. పుస్తకాల్లోకి తల దూర్చేసి ధ్యానముద్రలో ఉన్నప్పుడు ఏ గండు కోయిల ప్రేమ రాగమో కిటికీలోంచి మీ చెవులకు సోకవచ్చు. పగలు విన్న తియ్యని మాటలకు రాత్రి నిద్రలో మీ పెదవులు విచ్చుకోవచ్చు. ఉప్పూకారం చల్లిన పుల్లని మామిడి పిందెల కబుర్లు మీ మన సును గిల్లి, గిలిగింతలు పెట్టవచ్చు. మన్మథుడు గొప్ప అని కాదు. మన బాయ్స్ మన్మథుడినే బ్యాడ్‌బాయ్‌గా మార్చగల గొప్ప ప్రావీణ్యులు. అందుకే అమ్మాయిలూ... కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ పూతలకు పరవశించకండి. ప్రేమరాగాలకు శ్రుతి తప్పకండి. ప్రియభాషణల ప్రేమబాణాలకు హృదయాన్ని పరవకండి. ప్రేమకబుర్ల గుబుర్ల మాటున సిలబస్‌లో లేని సబ్జెక్టులను నేర్చుకోకండి. కష్టమే. కానీ, తర్వాత వచ్చే కష్టాలకంటేనా!! ఈ మన్మథనామ సంవత్సరం మీకు మనశ్శాంతిగా, నిశ్చింతగా గడవాలి. -
ఆదిలోనే అదుపుచేద్దాం..
తామర పురుగులు ఆకుముడత లేదా తామర పురుగులు మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుంచి ఆఖరి కోత వరకు పైరును ఆశిస్తాయి. రసాన్ని పీల్చడం వలన పై ముడత వస్తుంది. ఆకులు, పిందెలు రాగి లేదా ఇటుక రంగులలోకి మారి పూత, పిందె నిలిచి పోతుంది. మొక్కలు గిడసబారి పూత రాలిపోతుంది. పూత పిందెగా మారదు. లేతకాయలు గిడసబారి చారలు ఏర్పడుతాయి. కాయల నాణ్యత లోపిస్తుంది. దిగుబడి తగ్గుతుంది. నివారణ: కార్బరిల్ 3 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ, డెఫైన్ థియోరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. నాటిన 15, 45 రోజుల్లో ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేస్తే పై ముడతను నివారించుకోవచ్చు. తెల్లనల్లి చిన్న, పెద్ద పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసంపీల్చుతాయి. ఆకులు వెనుకకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో ఉం టాయి. ఆకు పెరుగుదల తగ్గి పూత పూయటం నిలిచిపోతుంది. దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో తేమ అధికంగా ఉన్న సమయంలో ఉంటుంది. నివారణ: డైకోపాల్ 5 మి.లీ లేదా ఫోసలోన్ 3 మి.లీ లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగుభాగం కూడా తడిచేటట్లు పిచికారీ చేయాలి. కింది ముడత ఎక్కువగా ఉన్నప్పుడు సింతటిక్ పైరిథ్రాయిడ్ మందును వాడొద్దు. నత్రజని ఎరువు వాడకాన్ని తగ్గించాలి. పేనుబంక ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన లేత కొమ్మలను ఆశించి రసం పీలుస్తాయి. ఇవి తేనెవంటి పదార్థాన్ని విసర్జించటం వల్ల చీమలు చేరుతాయి. ఈ పదార్థంపైన నల్లని శిలీంద్రపు పెరుగుదల వల్ల ఆకులు, కాయలు మసిబారి పోతాయి. ఇవి ఆశించిన ఆకులు మెలికలు తిరిగి మొక్కల ఎదుగుదల నశిస్తుంది. నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. నివారణ: మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ తెల్లదోమలు గుంపులుగా చేరి ఆకుల రసాన్ని పీల్చుతాయి. ఆకుల ఎర్రబారి మొక్కల ఎదుగుదల క్షీణిస్తుంది. ఠనివారణ: ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా లీటర్ నీటిలో దయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగులు మిరపనాశించు కాయతొలుచు పురుగుల్లో పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగులు ముఖ్యమైనవి. వీటి వల్ల పంటకు 50 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. శనగపచ్చ పురుగు పిల్లలు మొదట ఆకులు, పూత దశలో పూభాగాలు తిని పంటకు నష్టం చేస్తాయి. కాపు దశలో కాయలో తల భాగాన్ని జొప్పించి మిగిలినదాన్ని తినడం వల్ల తాలు కాయలుగా మారుతాయి. పొగాకు లద్దె పురుగు పిల్లలు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి పచ్చని పదార్థాన్ని తిని జల్లెడలా మారుస్తాయి. కాపు దశలో ముచ్చిక వద్ద రంధ్రం చేసి కాయ లోపలకు చేరి గింజలు, గుజ్జును తింటాయి. ఫలితంగా కాయను ఆరబెట్టినప్పుడు తాలుబారుతాయి. పచ్చరబ్బర్ పరుగు కూడా మొదటి దశలో ఆకులు, తరువాత దశలో కాయలను నష్టపరుస్తాయి. ఠనివారణ: 2 మి.లీ ఎండోసల్ఫాన్ లేదా 2 మి.లీ క్లోరిఫైరీఫాస్ లేదా 3 గ్రాముల కార్బరిల్ లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.35 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన లద్దె పురుగులను విషపు ఎర ద్వారా కూడా నివారించవచ్చు. ఐదు కిలోల తవుడు, 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా క్లోరిఫైరీఫాస్ను 500 గ్రాముల బెల్లంతో కలపాలి. తగినంత నీటిని జోడించి చిన్నచిన్న ఉండలుగా తయారు చేయాలి. సాయంత్రం వేళ పొలంలో మొక్కల మొదళ్ల దగ్గర పెట్టడం వల్ల లార్వాలను నివారించవచ్చు. వేరుపురుగు ఇటీవలి కాలంలో మిరప పండించే కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు సమస్య అధికంగా ఉంది. వీటి పిల్ల పురుగులు భూమిలో 5-10 సెం.మీ లోతులో మిరప వేర్లు, కాండాలను తిని నష్టం కలుగ జేస్తాయి. ఫలితంగా మొక్కలు వడలి చని పోతాయి. నివారణ: ఎకరాకు 8 కిలోల ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు వాడాలి. ఈ గుళికలు భూమిలో తేమ ఉన్నప్పుడు వేయాలి. మట్టితో కప్పి పెట్టాలి.