Coffer Dam construction
-
కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్‌ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తతో చేపట్టిన ఈ రక్షణ చర్యలను మంగళవారం సీడబ్ల్యూసీ (డిజైన్స్ విభాగం) సీఈ డీసీ భట్ ప్రశంసించారు. నిజానికి.. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 28.5 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికే సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ చేసింది. ఆ మేరకే పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. కానీ, గోదావరి బేసిన్లో ఈనెల 13 నుంచి కురిసిన భారీ వర్షాలవల్ల పోలవరం వద్దకు 28.50 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. కానీ, 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్‌ను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈనెల 14న జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన 40.5 మీటర్ల నుంచి 43 మీటర్ల వరకూ రివిట్మెంట్పైన కోర్ (నల్లరేగడి మట్టి) వేసి, దానిపై ఇసుక బస్తాలను వేశారు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటర్ ఎత్తుతో మట్టి, రాళ్లువేసి కాఫర్ డ్యామ్ ఎత్తును 43 నుంచి 44 మీటర్లకు పాక్షికంగా పెంచే పనులను 48గంటల రికార్డు సమయంలోనే అధికారులు పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ అనుమతి కోరిన అధికారులు సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. ఇలా గరిష్టంగా వరద వచ్చినా ఎదుర్కొనేలా కాఫర్ డ్యామ్‌ను పటిష్టంచేసే పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో మరింత పటిష్టపర్చడం.. పూర్తిస్థాయిలో 44 మీటర్ల ఎత్తుకు పెంచే పనులు చేపట్టడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ అనుమతిని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కోరారు. దీనిపై సీడబ్ల్యూసీ సీఈ (డిజైన్స్) డీసీ భట్ అధ్యక్షతన మంగళవారం కేంద్రం వర్చువల్‌గా సమావేశం నిర్వహించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈ (డిజైన్స్) రాజేష్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాఫర్ డ్యామ్ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీడబ్ల్యూసీ, పీపీఏ అభినందించాయి. ఎత్తు పెంపు పనులకు శ్రీకారం.. ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో 2,454 మీటర్ల పొడవున నిర్మించారు. 40.5 మీటర్ల వరకూ కాఫర్ డ్యామ్ మధ్యలో అడుగుభాగాన గరిష్టంగా 237 మీటర్లు (మధ్యలో 16.2 మీటర్లు వెడల్పుతో కోర్).. పైభాగానికి వచ్చేసరికి కనిష్టంగా 9 మీటర్ల (మూడు మీటర్ల వెడల్పుతో కోర్) వెడల్పుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించారు. నీటి లీకేజీలను అడ్డుకునేందుకు కోర్ వేసిన మట్టం అంటే 40.5 మీటర్ల వరకూ డ్యామ్‌లో నీటి మట్టం చేరినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పైభాగాన 2.5 మీటర్లు రాళ్లు, మట్టితో పనులు చేశారు. 40.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నీటిమట్టం పెరిగితే.. లీకేజీలవల్ల కాఫర్ డ్యామ్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇటీవల గరిష్టంగా 26.9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరంలో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 38.76 మీటర్లు నమోదైంది. కానీ, గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్‌కు నష్టం కలగకుండా ఉండాలంటే 43 మీటర్ల వరకూ 3 మీటర్ల వెడల్పుతో కోర్‌వేసి.. పాక్షికంగా రెండు మీటర్ల వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచిన పనులకు తోడుగా మిగతా ఏడు మీటర్లు వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనపై సీడబ్ల్యూసీ సీఈ డీసీ భట్ ఆమోదముద్ర వేశారు. కోర్‌ను పొరలు పొరలుగా వేసి.. రోలింగ్ చేస్తూ.. పటిష్టతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పనులుచేయాలని సూచించారు. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. -
పోలవరం పనులు భేష్
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే, గేట్ల పనితీరు, ఎగువ కాఫర్ డ్యామ్, ఫిస్ లాడర్, దిగువ కాఫర్ డ్యామ్ పనుల పురోగతిపై వివరాలడిగి తెలుసుకున్నారు. వరదల సమయంలో వరద నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేసే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, గేట్ల పనితీరు తదితర అంశాలపై ఆయనకు వివరించారు. సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ కె.లతాకుమారి, ఈఈలు పి.సుధాకర్‌రావు, మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వాసితుల వినతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌కు నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు. వరదల సమయంలో పాత గ్రామాలను విడిచి అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేరుకున్నామన్నారు. పాత గ్రామాల్లో తమకు సంబంధించిన పశువులు, ఇంటి సామగ్రి, వ్యవసాయ పనిముట్లు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని తెచ్చుకునేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని తూటికుంట సర్పంచ్ కుంజం లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. -
వేగంగా పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ పనులను ఇప్పటికే దాదాపు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దిగువ కాఫర్ డ్యామ్ పనులను వేగవంతం చేసింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కుడి వైపున 96 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో డయా ఫ్రమ్ వాల్ (పునాది) నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా సోమవారం ప్రారంభించింది. నెలాఖరు నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను రక్షిత స్థాయికి పూర్తి చేసి.. సెప్టెంబరులో కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న సుమారు 0.4 టీఎంసీల నీటిని బయటకు తోడే పనులు చేపట్టనుంది. నీటిని పూర్తిగా తోడివేశాక.. ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులు చేపట్టి నిరంతరాయంగా చేయడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసేలా సీఎం వైఎస్ జగన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దాని అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ప్రణాళిక మేరకు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వేను రికార్డు సమయంలో ప్రభుత్వం పూర్తి చేసింది. జల వనరుల శాఖాధికారులు, డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్న దృశ్యం కాఫర్ డ్యామ్‌లపై ప్రత్యేక దృష్టి పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేది ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్‌లోనే. ఈ డ్యామ్‌ను గోదావరి నది గర్భంలో ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున మూడు భాగాలుగా (గ్యాప్–1లో 564 మీటర్లు, గ్యాప్–2లో 1,750 మీటర్ల మేర ఈసీఆర్‌ఎఫ్‌ను, గ్యాప్–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్) నిర్మించాలి. ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వీలుగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించేందుకు నదికి అడ్డంగా 2,480 మీటర్ల పొడవున 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యామ్‌ను.. స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేసిన నీరు గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడువున నిర్మించే ఈసీఆర్ఎఫ్ వైపు ఎగదన్నకుండా 1,613 మీటర్ల పొడవున 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలి. ఇందులో ఎగువ కాఫర్ డ్యామ్ పనులను 40 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. ఈ పనులు నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. దిగువ కాఫర్ డ్యామ్‌కు పునాదిని జెట్ గ్రౌటింగ్ విధానంలో చేశారు. కుడి వైపున నేల మృదువుగా ఉండటం వల్ల 96 మీటర్ల పొడవున డయా ఫ్రమ్ వాల్‌ను నిర్మిస్తున్నారు. నెలాఖరు నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులను రక్షిత స్థాయికి పూర్తి చేయనున్నారు. -
పోలవరం కాఫర్ డ్యామ్ డిజైన్ తిరస్కరణ
-
పోలవరం కాఫర్ డ్యామ్ డిజైన్ తిరస్కరణ
సాక్షి, అమరావతి: ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ రూపొందించిన పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ డిజైన్‌ను జలవనరుల శాఖ తిరస్కరించింది. డిజైన్‌లో లోపాల్ని ఎత్తిచూపి.. వాటిని సరిదిద్దుతూ సరికొత్త డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించింది. ఈ నెల 1న పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, గేట్ల తయారీ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో కాఫర్ డ్యామ్ డిజైన్‌ను ప్రధాన కాంట్రాక్టు సంస్థ సీఎంకు అందించింది. ఈ డిజైన్‌ను పరిశీలించిన జలవనరులశాఖ ఉన్నతాధికారులు భారీ లోపాలున్నట్లు గుర్తించారు. గతంలో 31 మీటర్ల ఎత్తు వరకు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఆమోదించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇటీవల 41 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవడానికి అనుమతిచ్చింది. కాఫర్ డ్యాం నిర్మాణంలో ఊటను నియంత్రించేందుకు షీట్ ఫైల్స్‌ను వినియోగిస్తామని డిజైన్‌లో కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. కానీ 41 మీటర్ల ఎత్తుతో నిర్మించే కాఫర్ డ్యామ్‌కు షీట్ ఫైల్స్‌తో ఊటను నియంత్రించడం అసాధ్యమని జలవనరులశాఖ అధికారులు తేల్చారు. కొత్త డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించారు.