ఉక్కులో కూలిన కోక్ బకెట్
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ కోక్‌ఓవెన్స్ సీడీసీపీ–1లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కోక్ బకెట్ కుప్పకూలింది. అదష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..విభాగం ఛాంబర్ 4లో వేడి కోక్‌ను చల్లార్చడానికి సుమారు 25 టన్నుల కోక్‌ను బకెట్లో వేసి సుమారు 40 అడుగుల ఎత్తులో ఉన్న చాంబర్‌కు తరలిస్తున్నారు. ఎత్తుపైకి వెళ్లిన బకెట్ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. బకెట్ కింద ఉన్న ట్రాక్‌పై పyì నుజ్జయింది. వెంటనే కోక్ నుంచి మంటలు రావడంతో సిఐఎస్ఎఫ్ ఫైర్ విభాగం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చే శారు. ఈడీ నాగరాజన్, విభాగాదిపతి ఏకే సింగ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్, బకెట్ మరమ్మతు పనులు ప్రారంభించారు. బకెట్ మరమ్మతు పనులు పూర్తికావడానికి వారం రోజుల పడుతుందని తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన సిటు, ఇంటక్ నాయకులు నిర్వహణ లోపాల వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.