in collecterate
-
సాగునీటి కోసం రూ.5 వేల కోట్లు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రతి సెంటు భూమికి సేద్యపు నీరు అందించడానికి రూ.5 వేల కోట్లతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్.షరీఫ్ తెలిపారు. బిందు సేద్యం అమలు తీరుపై వివిధ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం ఆయన కలెక్టరేట్లో సమీక్షించారు. జిల్లాలో సేద్యపునీరు అవసరాలకు పూర్తి స్థాయిలో నీటి వనరులను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయగా ప్రతిపాదన పంపించినట్టు చెప్పారు. జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, ఉద్యానవన పంటల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గతేడాది 13 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేసి రైతులకు మరింత చేరువ అయ్యామని, ఈ ఏడాది మిగిలిన 45 వేల హెక్టార్లలో అమలు చేసి జాతీయస్థాయిలో రికార్డు సృష్టించాలన్నదే కలెక్టర్ అభిమతమన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో 22 కంపెనీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తమ పరిధిలో డ్రిప్ ఇరిగేషన్ అమలు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ఏపీఎంఐసీ ఓఎస్డీలు బి.రవీంద్రబాబు, డి.రమేష్ పాల్గొన్నారు. -
చదువుకూ ప్రాధాన్యం ఇవ్వాలి
ఏలూరు (మెట్రో) : క్రీడలతో పాటు చదువుకూ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే జీవితంలో రాణించగలుగుతారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ సూచించారు. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలు, నాలుగు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు బుధవారం కలెక్టరేట్‌కు రాగా కలెక్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసాపత్రాలు అందజేశారు. కొంతమంది కేవలం క్రీడలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, దానివల్ల చదువులో కొంత వెనుకబాటుతనం కనపడుతుందని, చదువులేకపోతే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స ఫెడరేష¯ŒS నిర్వహించిన స్విమ్మింగ్ పోటీలలో ఏలూరుకు చెందిన ఐదుగురు క్రీడాకారులు విష్ణు, కిషోర్, సాయి అక్షిత, నీహారిక, రిత్విక ఈ పతకాలు సాధించడం అభినందనీయమని చెప్పారు. జిల్లా క్రీడల అధికారి ఎస్ అజీజ్, కోచ్ బి.గణేష్ పాల్గొన్నారు. -
జంతువుల సంరక్షణకు స్థలాన్ని కేటాయిస్తాం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో జంతు సంరక్షణ చర్యల్లో భాగంగా రక్షించిన జంతువులను ఓ చోట పెట్టేందుకు అనుకూలంగా ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ తెలిపారు. జిల్లా జంతు హింసా నివారణ సంఘం సమావేశం అదనపు జాయింట్ కలెక్టర్ అ«ధ్యక్షతన కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు పశువుల అక్రమ రవాణాను నిరోధించే సమయంలో రక్షించిన పశువులను ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీనిపై స్పందించిన ఏజేసీ ఎక్కడ అనువుగా భూమి ఉంటే ఆ వివరాలు తెలపాలని, కలెక్టర్ ద్వారా భూమి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో పశు సంతలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని సభ్యులు తెలిపారు. దీనిపై స్పందించిన మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి మాట్లాడుతూ నిబంధనలు పాటించని మాట వాస్తవమేనని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రశేఖర్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.