చదువుకూ ప్రాధాన్యం ఇవ్వాలి
ఏలూరు (మెట్రో) : క్రీడలతో పాటు చదువుకూ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే జీవితంలో రాణించగలుగుతారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ సూచించారు. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలు, నాలుగు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు బుధవారం కలెక్టరేట్‌కు రాగా కలెక్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసాపత్రాలు అందజేశారు. కొంతమంది కేవలం క్రీడలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, దానివల్ల చదువులో కొంత వెనుకబాటుతనం కనపడుతుందని, చదువులేకపోతే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స ఫెడరేష¯ŒS నిర్వహించిన స్విమ్మింగ్ పోటీలలో ఏలూరుకు చెందిన ఐదుగురు క్రీడాకారులు విష్ణు, కిషోర్, సాయి అక్షిత, నీహారిక, రిత్విక ఈ పతకాలు సాధించడం అభినందనీయమని చెప్పారు. జిల్లా క్రీడల అధికారి ఎస్ అజీజ్, కోచ్ బి.గణేష్ పాల్గొన్నారు.