College seat
-
ఫీజు కట్టకపోతే నీ సీటు రద్దవుతుంది.. స్వయంగా ప్రిన్సిపాలే రాసి ఇచ్చి..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం ఫీజుల వేధింపులు తప్పడం లేదు. ఏకంగా ఫీజులు చెల్లించక పోతే అడ్మిషన్‌తోపాటు సీటు రద్దు చేస్తామని ఒత్తిళ్లు చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఏపీలో అనుమతులు పొంది, తెలంగాణలో యుజీసీ ప్రత్యేక ఆర్డర్‌తో నగర శివార్లలోని కొండాపూర్, అజీజ్ నగర్, మియాపూర్‌లో వివిధ కోర్సుల తరగతులు నిర్వహిస్తొంది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. నగరానికి చెందిన ఒక విద్యార్థి ఆ యూనివర్సిటీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో చేరారు. కోర్సుకు రూ. 1,85,000 ఫీజు పేర్కొనడంతో ఈ ఏడాది ఏప్రిల్ 24న మొదటి విడతగా రూ. 50 వేలు చెల్లించి అడ్మిషన్ తీసుకొని తరగతులకు హాజరు అవుతున్నారు కాగా తాజాగా పూర్తి ఫీజు చెల్లించాలని విద్యార్థిపై ఒత్తిళ్లు ప్రారంభయ్యాయి. కాగా, గురువారం ఏకంగా ప్రిన్సిపాల్ తక్షణమే ఫీజు చెల్లించకుంటే సీటు రద్దు అవుతుందని లిఖిత పూర్వకంగా రాసి సంతకం చేసి విద్యార్థికి ఇవ్వడం విస్మయానికి గురిచేసింది. ఫీజు కట్టకుంటే సీటు రద్దేంటి..? పూర్తి స్థాయి ఫీజు చెల్లించకుంటే సీటు రద్దు చేస్తామని ప్రిన్సిపాల్ లిఖిత పూర్వకంగా రాయడాన్ని టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ తప్పుబట్టారు. కనీసం గడువు ఇవ్వకుండా ఈ రోజు ఫీజు కట్టకపోతే సీటు రద్దు అవుతుందని పేర్కొనడం సమంజసంకాదన్నారు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడం సరైంది కాదుని వెంటనే వారిని పిలిపించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. -
ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ! పదివేలు దాటినా సీఎస్సీ పక్కా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసిన 1.56 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్‌లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో సీటు దొరుకుతుంది? కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి? కన్వీనర్ కోటా కటాఫ్ ఎంత? వర్సిటీ క్యాంపస్‌లో సీటొచ్చే పరిస్థితి ఉందా? ఇలా ప్రతి విద్యార్థినీ ఎన్నో సందేహాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఈ సందేహాలతోనే చాలామంది మంచి ర్యాంకు వచ్చినా ప్రైవేటు కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీటు కోసం ప్రయత్నిస్తుంటారు. నిజానికి గత ఏడాది ర్యాంకులు, కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు, ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఏ బ్రాంచిలో సీటు వచ్చింది తదితరాలు క్షుణ్ణంగా తెలుసుకుని, కౌన్సెలింగ్‌పై కాస్త అవగాహన పెంచుకుంటే కచ్చితమైన అంచనా తేలికే అంటున్నారు నిపుణులు. విద్యార్థుల డిమాండ్, కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఈసారి కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సుల్లో కొద్దిగా సీట్లు పెరిగే వీలుంది. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్ సీట్లు తగ్గబోతున్నాయి. అయితే ఈ వివరాలను యూనివర్సిటీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. సీఎస్సీకి పెరిగిన డిమాండ్ గత కొన్నేళ్ళ సీట్ల కేటాయింపును పరిశీలిస్తే రాజధాని పరిసరాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్సీ సీటుకు డిమాండ్ బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సుల్లో సీటు రావాలంటే ఓపెన్ కేటగిరీలో అయితే 3 వేల లోపు ర్యాంకు మాత్రమే రావాలి. కానీ జేఎన్టీయూహెచ్ వర్సిటీ కాలేజీలున్న మంథనిలో 10 వేలు దాటినా, సుల్తాన్పూర్ క్యాంపస్‌లో 5 వేలు దాటినా సీఎస్సీ సీటు పక్కాగా వస్తోంది. ఇక టాప్‌టెన్ ప్రైవేటు కాలేజీల్లో 10 వేల ర్యాంకు వరకు కూడా సీఎస్సీ సీటు వచ్చే చాన్స్ ఉంది. ఒక కాలేజీలో మాత్రం గత ఏడాది 25 వేలు దాటిన ర్యాంకుకు కూడా ఆఖరి కౌన్సెలింగ్‌లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చింది. రిజర్వేషన్ కేటగిరీల్లో 20 వేలు దాటినా సీటు వచ్చే అవకాశం కన్పిస్తోంది. కసరత్తు తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి ఎంసెట్ ర్యాంకు వచ్చిన తర్వాత విద్యార్థులు ప్రధానంగా కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలి. వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందనేది గత కొన్నేళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించి అంచనాకు రావాలి. ఈ కసరత్తు చేసిన తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి. – ఎంఎన్ రావ్ (గణిత శాస్త్ర విశ్లేషకులు) -
Hyderabad: ఫేస్బుక్ పరిచయం.. కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి..
సాక్షి, చందానగర్(హైదరాబాద్): ఫేస్బుక్లో అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం.. ఆపై కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేయడం.. ఇలా రెచ్చిపోతున్న ఓ కేటుగాడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా మహబుబాబాద్‌కు చెందిన సందీప్‌కుమార్ వేమిశెట్టి అలియాస్ అభినవ్‌కుమార్ (34) ఇంటర్మీడియట్ చదివాడు. 2014లో హైదరాబాద్‌కు వచ్చి క్యాటరింగ్ పనిచేశాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని సన్నిహితంగా ఉండేవాడు. కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసేవాడు. ఇదే క్రమంలో చందానగర్ ఠాణా పరిధిలో నివాసం ఉండే ఓ అమ్మాయితో ఫేస్బుక్లో సందీప్‌కుమార్ పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఓ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటలో బీఫార్మసీ సీటు ఇప్పిస్తానని నమ్మించి రూ.46 వేలు వసూలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి పెళ్లి ప్రస్థావన తీసుకురాగా.. అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తన వద్ద ఉన్న ఆమె ఫొటోలను అందరికీ షేర్ చేస్తానని బెదిరించాడు. బీఫార్మసీ సీటు కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. దీంతో బాధితురాలు చందానగర్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో సందీప్‌కుమార్ ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడిపై ఇప్పటికే సైబరాబాద్, ఎల్బీనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుల్లో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్! -
పట్టా కావాలంటే.. మొక్కలు నాటాల్సిందే!
డిగ్రీ చదువుకోవాలంటే ఏం కావాలి.. మనవద్ద అయితే ఇంటర్మీడియట్లో పాస్ కావాలి. కాలేజీలో సీటు రావాలి. ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కోవాలి.. ఇంకా.. కాలేజీకి రెగ్యులర్‌గా వెళ్లాలి.. శ్రద్ధగా చదువుకోవాలి.. పరీక్షలు బాగా రాయాలి.. అప్పుడు కానీ పాస్కాలేం. కానీ ఫిలిప్పీన్స్‌లో మాత్రం డిగ్రీ చదవాలనుకునే ప్రతి ఒక్కరూ 10 మొక్కల చొప్పున నాటాలి. అదేంటి కొత్తగా ఉందే అని అనుకుంటున్నారా..? అవును ఒక్క డిగ్రీనే కాదు హైస్కూల్, కాలేజీ పూర్తి చేయాలన్నా కూడా మొక్కలు నాటాల్సిందేనట. ఈ మేరకు ఓ బిల్లును పార్లమెంటు సభ్యుడు గారీ అలెజానో ప్రవేశపెట్టాడు. ఈ విధానం వల్ల పిల్లల్లో మొక్కలు నాటాలనే తపన పెరుగుతుందని ఆయన వివరించారు. ఇలా ఒక్క తరం పిల్లలు, యువత నాటే మొత్తం మొక్కల్లో కనీసం 10 శాతం బతికినా దాదాపు 52.5 కోట్ల చెట్లు భూమిపై జీవం పోసుకుంటాయని అంచనా. దీంతో పచ్చదనానికి పచ్చదనం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆలోచన బాగుంది కదూ..! -
మజిలీ
‘రమ్య’. పేరు ఎంత బాగుందో ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, ఓ దేవతలా అనిపిస్తుంది నాకు. ఆమె నవ్వుతుంటే, కొన్ని గంటల్లోనే కొన్ని కోట్లసార్లు చూసి ఉంటా. అంత అందంగా నవ్వుతుంది. నాకందుకే అనిపిస్తూ ఉంటుంది, ఆమె పుట్టగానే నవ్విందేమో అని! ఆమెను నేను మొదటిసారి వరంగల్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజీలో చూడటం ఇప్పటికీ అలాగే గుర్తుంది. నా ఫ్రెండ్ వరుణ్ అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ రోజు కాలేజీలో పార్టీ ఉంటే నన్ను కూడా బలవంతంగా తీసుకెళ్లాడు.పార్టీ కావడంతో కాలేజీలో చాలా హడావుడిగా ఉంది. నాలుగు స్తంభాలు ఉన్న దగ్గర నేను నిలబడి ఆలోచిస్తున్నా. ఉన్నట్లు ఉండి ఆకాశం చల్లగా మారింది. రాను రానూ వర్షపు జల్లు నవ్వుతూ పడింది. దూరం నుంచి తెల్లటి డ్రెస్‌లో ఆ వర్షపు జల్లులో అలా నడుచుకుంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఆ వర్షపు జల్లు తనపై పడుతుంటే, నవ్వుతోంది. బహుశా ఆ వర్షపు జల్లు ఆమె కోసమే పడుతున్నట్లు ఆ నిమిషం నాకనిపించింది.ముఖంపైకి వచ్చి పడుతున్న కురులను తన చేతి వేళ్లతో అందంగా వెనక్కి నెట్టిపడేస్తూ చిన్ని చిన్ని అడుగులు వేస్తోంది. ఇంత అందమైన అమ్మాయిని చూడటానికే ఈ రోజు ఇక్కడికి వచ్చినట్లు నా మాటలు నా గుండెకి తాకాయి. ఇది ఆమెపై కలిగిన ప్రేమో, లేక ఆకర్షణో తెలియదు. కానీ, ఆమెకోసం ఏదైనా చేయొచ్చని మనసుకు అనిపించింది. ఇలా అనిపించడం కూడా నాకే వింతగా ఉంది. నా ఫ్రెండ్ వరుణ్‌ను పిలిచి ఆ అమ్మాయి ఎవరని అడిగాను.పేరు రమ్య. ఫస్ట్ ఇయర్. వరుణ్ ఆ అమ్మాయి గురించి చెబుతుంటే, వెళ్లి పరిచయం చేసుకోవాలనిపించింది. కానీ, ఏమో అప్పుడు ఆ సాహసం చేయలేదు. ఆమెకూ నేను నచ్చాలి కదా. అయినా, నేను ఎవరని ఆమె నాతో మాట్లాడుతుంది! ఒక్కటా.. రెండా.. ఎన్నో ప్రశ్నలు. అన్నీ తన చుట్టే! తనని చూసిన తర్వాత ఆరు గంటలు జరిగిన పార్టీ, అర నిమిషంలో ముగిసినట్లు అనిపించింది. తననివదిలి ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఇదే విషయాన్ని వరుణ్‌కి చెప్పాను.‘ప్రేమ ఏంట్రా చరణ్! అయినా ఒక్క రోజులో ప్రేమ పుడుతుందారా? ఇవన్నీ వద్దు. టైం వేస్ట్ చేసుకోకురా. ఇంకో రెండు సంవత్సరాలు అయితే నీ ఇంజనీరింగ్ అయిపోతుంది. మంచి జాబ్ వస్తుంది. అప్పటికి ఆ అమ్మాయి థర్డ్ ఇయర్లోనే ఉంటుంది. అప్పుడు తనకి నీ విషయం చెప్పు. ఏమంటుందో చూడు. తనకీ ఇలాంటి ఫీలింగే ఉంటే, నీ లైఫ్ బాగుంటుంది’ అన్నాడు.‘అంటే ఏంట్రా నువ్వనేది, ప్రేమించిన ప్రతి వాడు చదువుని పక్కనపెట్టి అమ్మాయిల కోసమే తిరుగుతాడా?’‘తిరుగుతాడో లేదో నాకు తెలియదు చరణ్! కానీ నువ్వు ఆ అమ్మాయి కోసం ఇంత రిస్క్ చేయొద్దు. ఎందుకంటే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి.’‘అయితే రేపు కాలేజ్‌కి వచ్చి నా ప్రేమ విషయం చెప్తా’‘హా. వెళ్లి చెప్పు. చెప్పు ఎలా ఉందో చూశావా అని సినిమా స్టైల్లో రిప్లయ్ ఇస్తుంది’‘ఎందుకు రా వరుణ్, నెగటివ్‌గా ఆలోచిస్తున్నావ్?’‘సారీ రా. కానీ ఆమె నాకు ఇవన్నీ నచ్చవంటే నువ్వు బాధపడతావ్. అది నేను చూడలేను. నా మాట విని నువ్వు ఒక టూ ఇయర్స్ వెయిట్ చెయ్యి’‘సరే రా వరుణ్, నాకు నా మీద కంటే నీ మీద నమ్మకం ఎక్కువ. నువ్వు చెప్పినట్లే నా చదువయ్యాకే ఆమెని కలుస్తా‘ అని వాడికి మాటిచ్చా.’ వాడికి ఇచ్చిన మాట ప్రకారమే, ఆమె నుంచి దూరంగా వచ్చేశా. చాలాసార్లు వరుణ్‌కి చెప్పకుండా ఆమెని చూడాలనిపించేది. కానీ, ఆమెను చూశాక నేను ఇక హైదరాబాద్‌కి మళ్లీ వెళ్లనేమో అనిపించింది. అలా చేస్తే నా ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. ఏదేమైనా ఆమె నాకోసమే పుట్టిందన్న ఆ చిన్న నమ్మకంతోనే సంవత్సరం గడిపేశా. తర్వాత వరుణ్‌కి సెలవులని తెలిసి కలవడం కోసం వరంగల్ వెళ్లా. ఆ టైంలో రమ్య గురించి వరుణ్ని చాలాసార్లే అడిగాను. వాడు సమాధానం చెప్పలేదు. ఇక నేను అడగదల్చుకోలేదు. నాలుగు రోజులు ఉండి, తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్‌కి వెళ్లా. రాత్రి సరిగ్గా పన్నెండవుతోంది. బస్ టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్లి కూర్చున్నా. బస్ మొత్తం ఫుల్ అయింది కానీ, నా పక్కనున్న సీట్ మాత్రం ఖాళీగానే ఉంది. అప్పుడే వచ్చింది ఓ అమ్మాయి. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. రాత్రి ఒంటిగంట అవుతోంది. ఆ అమ్మాయి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటోంది. ముఖానికున్న స్కార్ఫ్ మాత్రం తీయలేదు. పాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది. నేను విండోవైపు తిరిగి పడుకున్నా. ఫోన్ కింద పడిన శబ్దం వినిపించి లేచా. కానీ ఆమె నిద్రలోనుంచి ఇంకా బయటకు రాలేదు. ఫోన్ పైకి తీశా. ఆమె నిద్ర ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తున్నా. సరిగ్గా సగం దూరం వచ్చాక లేచింది. ‘‘ఏంటి అలా చూస్తున్నావ్?’’ అని సీరియస్‌గా అడిగింది. ‘కాదండి. మీ ఫోన్ కింద పడిపోయింది. మీరు లేస్తే ఇద్దామని చూస్తున్నా’ అన్నాను.‘అయ్యో! క్షమించు. నిద్ర పట్టేసింది, చూసుకోలేదు. చాలా థ్యాంక్స్, ఫోన్ ఇచ్చినందుకు.’ అని తన స్కార్ఫ్ వెనక ఉన్నమాటలు కనిపించలేదు కానీ, వినిపించాయి.‘పర్లేదండీ! కానీ చాలాసేపే నిద్రపోయారు మీరు..’‘అదేంటో.. నాకు బస్ ఎక్కిన కొద్దిసేపటికే నిద్ర పట్టేస్తుంది. ఇక రాత్రి సమయాల్లో ప్రయాణం అంటే, ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. సరే, మీరు ఏం చేస్తుంటారు?’‘నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ హైదరాబాద్‌లో. మరి మీరు?’‘నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఇక్కడే వరంగల్‌లో..’‘ఓకే. ఏ కాలేజో తెలుసుకోవచ్చా?’‘ఎందుకు?’‘కాదు. నేనొక అమ్మాయిని ఇష్టపడ్డా. ప్రేమించా. ఆ అమ్మాయి మీ కాలేజేమోనని?’‘ఓ సూపర్. ఏ కాలేజ్ మరి ఆ అమ్మాయి?’‘వరంగల్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్!’‘అవునా, నేను అరోరా కాలేజ్. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి?’‘ఆమె పేరు రమ్య. చాలా అందంగా ఉంటుంది. చూడగానే చాలా ఇష్టపడిపోయా. కానీ, నా ఫ్రెండే.. అప్పుడే ఎందుకు లవ్ అని చదువు అయిపోయాక ఆఅమ్మాయిని కలవమని అన్నాడు. కానీ, ఈలోపు ఆ అమ్మాయిని నేను మర్చిపోతానని వాడి నమ్మకం. కానీ, అంత ఈజీగా మర్చిపోలేను. ఇంతకీ మీ పేరు?’‘నా పేరు శ్రీవాణి. ఆ అమ్మాయినిమర్చిపోతావేమో అని నాకు కూడా అనిపిస్తోంది’‘లేదండీ. బీటెక్ అయిపోయిన తర్వాత ఆమెకి నా విషయం చెప్తా’‘అచ్చా! చెప్పగానే ఆ అమ్మాయి ఒప్పుకోదు కదా మిస్టర్’‘అది నిజమే. బట్ వెయిట్ చేస్తా. ఒప్పిస్తా. నన్ను ఒప్పుకుంటుందన్న నమ్మకం ఉంది శ్రీవాణి గారు’‘అది ఓకే. కానీ ఈలోపు ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తే?’‘మీరు లేనిపోని భయాలు పెట్టకండి ప్లీజ్’ ‘జస్ట్అడుగుతున్నా. అప్పుడేం చేస్తావ్?’‘అలానే జరిగితే, తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. కానీ, నాకు నమ్మకం ఉంది. రమ్య నా సొంతం అని’‘సరే, గట్టిగా కోరుకుంటే జరుగుతుంది. నీకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటా’‘చాలా థ్యాంక్స్ అండీ. ఆ అమ్మాయి నా సొంతం’ అని మళ్లీ అనేసి నిద్రలోకి జారుకున్నా. హైదరాబాద్ వచ్చింది. పక్కన మాత్రం శ్రీవాణి లేదు. ఆమె ప్లేస్‌లో ఓ లెటర్ ఉంది. అది చూశాక నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమయింది.‘హాయ్! నిజం చెప్పాలంటే నీ పేరు కూడా నాకు తెలియదు. ఒక అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయిని ఇంతగా ఇష్టపడటం నిజంగా గ్రేట్ అనిపిస్తోంది నాకు. ఎందుకు ఇంత సంతోషమంటే, ఆ అమ్మాయిని నేనే కాబట్టి. నువ్వు చదువుతుంది నిజమే. నేనే రమ్యని. నేనేశ్రీవాణీని. నా పూర్తి పేరు రమ్య శ్రీవాణి. నువ్వు నా గురించి చెబుతున్న విషయాలకు నేను చాలా సంతోషపడ్డా. నువ్వు మంచివాడివో కాదో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకే ఒక్కటి, నువ్వునాకోసం ఎదురుచూస్తున్నావు. నిజం చెప్పాలంటే, బస్సులో నీ మాటలు నా హదయాన్ని కదిలించాయి. ఒక అమ్మాయి కోసం ఆమెకి తెలియకుండా, ఓ అబ్బాయి ఏడాది నుంచి ఇంతలా ఎదురుచూడటం నాకు కొత్తగా అనిపించింది. ఇది నా గురించే కావడం నేను ఇంకా నమ్మలేకపోతున్నా. నా గురించి నువ్వు చెబుతుంటే, నా అనందాన్ని నా స్కార్ఫ్ వెనుక దాచేశాను. ఏ అమ్మాయికైనాకావాల్సింది నిజమైన ప్రేమే. నా గురించి అప్పుడే చెబితే నీ చదువుకు అడ్డం అవుతాననే భయంతోనే నేను అరోరా కాలేజ్, నా పేరు శ్రీవాణీ అని చెప్పాను. నువ్వు నాకోసం అప్పుడే ఒక సంవత్సరం ఎదురుచూశావు. ఇంకా ఒక సంవత్సరం నేను నీకోసం ఎదురుచూస్తాను. నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావో అని’.ఆమె పేపర్ మీద రాసిన మాటలు చూసి బస్సులోనే ఎగిరి గంతేశా. ఎప్పుడు రాసిందో, ఎలా రాసిందో అర్థం కాలేదు. కాసేపు గాల్లో తేలాను. ఆ సంవత్సరమంతా ఆ లెటర్లోని మాటలనే తన మనసుగా చూసుకుంటూ గడిపేశా. మధ్యలో ఓ పదిసార్లు వరంగల్ వెళ్లినా తనని చూడలేదు. ఎందుకంటే, తను నాది కాబట్టి. నా ప్రెండ్షిప్, నా ప్రేమ కోసం సర్దిచెప్పుకున్నా.రెండేళ్ల తర్వాత చదువు పూర్తి చేసి విప్రోలో జాబ్ కొట్టి గౌతమి కాలేజ్ ముందు నిలబడ్డా. చాలామంది కాలేజీ నుంచి వస్తున్నారు. రమ్య మాత్రం కనిపించలేదు. ఆ బాధతోనే వరుణ్ దగ్గరకు వెళ్లాను. ‘రారా చరణ్, ఎలా ఉన్నావ్?’ నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు వరుణ్. ‘వరుణ్, ఈ రోజు మీ కాలేజ్‌కి వెళ్లాను. రమ్య కనిపించలేదు’‘అదేంట్రా కనిపించకపోవడం. సరే, ఈ రోజు రాలేదేమో కాలేజీకి. రేపు వెళ్లి ట్రై చెయ్యి’ఆ మరుసటి రోజు నుంచి దాదాపు నెల రోజులు ఆమె కోసం ఎదురుచూశా. ఏ రోజూ ఆమె కనిపించలేదు. నా మనసుకు గాయం అయినంత పనయింది. ఇదే విషయం వరుణ్‌కి చెప్పాను.అరే చరణ్. నాకు కాలేజ్ అయిపోయి రెండు నెలలవుతోంది. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. అయినా ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. సరే, నా జూనియర్స్కొందరివి నెంబర్స్ ఉన్నాయి. వాళ్లను అడిగి తెలుసుకుంటా’ అని దాదాపు ఓ ముప్ఫై మందికి కాల్ చేశాడు వరుణ్. అందరూ ఎక్కడికి వెళ్లిందోచెప్పలేదనే చెప్పారు. ఓ ఆరు నెలలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతిసారీ వరుణ్ నాకు ధైర్యం చెబుతూనే ఉన్నాడు. కానీ గుండెల్లో నిండివున్న తనని అంత ఈజీగా మర్చిపోలేను కదా. ఓ ఎనిమిది నెలల తర్వాత.. ఫేస్బుక్లో ఓ పోస్ట్ కనిపించింది. ‘దూరం’ అనే కథ అది. పూర్తిగా చదివాను. నా గురించే రాసినట్లు ఉంది. ఈ కథ రాసిందెవరో అని చూశా. తనే. రమ్య. ఫోటో చుశాక నాపై వర్షపుజల్లు సంతోషంతో పడినట్లు అయింది. ఎన్ని నెలలైంది అయింది తనని చూసి. ఉండబట్టలేక, ఆ పోస్ట్ కిందే ‘కథ చాలా బాగుంది’ అని కామెంట్ పెట్టా. తను నాకు రిప్లయ్ ఇచ్చింది. నంబర్ చెప్పింది.ఫోన్ చేశా.‘హాయ్ రమ్య. ఆ రోజు నువ్వు నా పక్కనే ఉన్నా గుర్తించలేకపోయా. నా మదిలో రమ్య ఉంది. అందుకే నేను నీ కళ్లలోకి చూడలేకపోయాను. కానీ, ఆ రమ్యే నా పక్కన ఉందని తెలుసుకోలేకపోయా’నిజం చెప్పాలంటే, నువ్వు మంచివాడివి. ఇంత మంచితనం నేను ఎవరి దగ్గరా చూడలేదు చరణ్’‘నీ గురించి మీ కాలేజీ ముందు ఎన్నో రోజులు చూశా. చాలా బాధపడ్డా’‘నువ్వు అక్కడికి వెళ్తావని నాకు తెలుసు. కానీ, నీ ప్రేమ కోసం నువ్వు ఎంత ఎదురుచూస్తున్నావో, నీకోసం నేను కూడా అంతే ఎదురుచూస్తున్నా’‘నా ప్రేమ ఫలించింది రమ్యా! నేను ఎదురు చూసినందుకు నువ్వు నా సొంతం అయ్యావ్’‘అది నేను ఒప్పుకుంటా చరణ్. ఇంట్లో పెళ్లి చేస్తాం అన్నారు. అందుకే అక్కడ నుంచి ఢిల్లీ వచ్చేశా. అక్క దగ్గర ఉన్నాను. నెల క్రితమే బావకి జాబ్ హైదరాబాద్ షిఫ్ట్ కావడంతో అక్కడికి వెళ్లిపోయారు.ప్రస్తుతం రూంలో ఒక్కదాన్నే ఉంటున్నాను. కానీ నిన్ను ఎలా కలవాలో.. నీతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ బాధే ఈ ‘దూరం’ కథ. ఈ కథ నీవరకు వస్తుందని.. నువ్వు కచ్చితంగా చదువుతావని అనిపించింది. నా ఆశే నిజమైంది’‘నాకోసం నువ్వు ఎంతో గొప్ప పనిచేశావ్ రమ్యా! నిజంగా ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలి నేను’ ‘కచ్చితంగా నాకూ అదే కావాలి. నిన్ను మిస్ చేసుకోలేను. నువ్వు నాకోసం ఢిల్లీ వచ్చెయ్’ ‘వస్తా. కచ్చితంగా’నెలరోజులు టైం లేకుండా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. తన దగ్గరే ఉండేందుకు ఢిల్లీలో కొత్త జాబ్ చూసుకున్నా. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప విషయం. నాకు అమ్మ, నాన్న అన్నీ ఇప్పుడు రమ్యనే కాబోతోంది. నాకంటూ ఎవరూ లేరు ఈ జీవితంలో. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటే, వరుణ్ తల్లిదండ్రులే చదివించారు నన్ను. ఈ ఆనందం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది! భగవంతుడు నా మీద దయ చూపాడు. రైల్వే స్టేషన్లో దిగా. బ్యాగ్ ఓ చేత్తో పట్టుకుని నడుస్తున్నా. రమ్య కాల్ చేసింది. ‘హలో’ అనేలోపు నలుగురు దొంగలు, వెనకాల నుంచి వచ్చి బ్యాగ్ లాక్కెళ్లారు. అరసెకను నాకేం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ల వెనుకే పరిగెత్తాను. మధ్యలో ఓ బండరాయి కాలికి తగిలి ఫోన్ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. తర్వాత అది కనిపించలేదు. వాళ్లు నాకు ముప్పై అడుగుల దూరంలోనే ఉన్నారు. వాళ్ల వెనుకే పరిగెత్తాను. పరిగెడుతూ పరిగెడుతూ పక్కనుంచి వస్తున్న బస్సుని చూసుకోకుండా రోడ్డు దాటబోయాను. గట్టిగా బస్సు హారన్ శబ్దం. బ్రేక్ పడ్డ చప్పుడు. ’ఎయ్’ అని ఎవరో బలంగా లాగిన విషయమూ. అన్నీ సెకండ్లలో వినిపించి, కనిపించాయి. నా చేతిని అందుకున్న మనిషిని చూశా. ఆమె నోటి నుంచి ఏవో మాటలు అలా వస్తూనే ఉన్నాయి. అవేమీ వినిపించడం లేదు. ఆమెను అలా చూస్తూ ఉండిపోయా. రమ్య. ఆమె నా రమ్య. రమేశ్ రాపోలు -
దళారుల గుప్పిట్లో కాలేజీ సీట్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర విద్యావ్యవస్థ దళారులతో భ్రష్టుపట్టింది. అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేకంటే దళారులను ఆశ్రరుుస్తే ఇట్టే పనైపోతోంది. దీంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నెల 2వ తేదీన దాదాపు అన్ని విద్యాసంస్థలను తెరిచారు. అరుునప్పటికీ పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లలకు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విద్యాసంస్థల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. ఎల్కేజీ నుంచి ప్లస్ టూ వరకు కనీస విద్యార్హతను తమ పిల్లకు కలిగించాలని అధిక శాతం మంది ఆశ పడుతున్నారు. తమ ఆశలు ఆశయాలకు అనుగుణంగా విద్యా సంస్థను ఎంచుకుని సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే అక్కడ దళారులు ప్రత్యక్షమవుతున్నారు. కోరిన చోట, కోరిన విద్యాసంస్థల్లో సీటు కావాలంటే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారు. టిప్ టాప్ డ్రస్సుతో కారుల్లో తిరిగే దళారులు విద్యాసంస్థల యాజమాన్యం, అధికారులతో ఉన్న పరిచయాలను ఁక్యాష్* చేసుకుంటున్నారు. యాజమాన్య, అధికారుల వాటా కోసం బ్రోకర్లే వారధిగా నిలుస్తున్నారు. సీట్ల కోసం విద్యాసంస్థల కార్యాలయాల ముందు తల్లిదండ్రులు పడిగాపులు పడుతుండగా బ్రోకర్లు మాత్రం ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. యాజమాన్యాలతో వారి చొరవచూసి విద్యాసంస్థ ఉద్యోగిగా భ్రమపడిన తల్లిదండ్రులు వారంతా బ్రోకర్లని తెలుసుకుని ఖిన్నులవుతున్నారు. తన బిడ్డ ప్లస్‌టూ 94 శాతం మార్కులతో పాసైంది, సీటు కోసం కాలేజీకి వెళితే రూ.2 లక్షలు తెమ్మన్నారని ప్లాట్‌ఫాంపై పూలమ్ముకునే మహిళ వాపోయింది. తమ వంటి పేదలకు లక్షలు ఎక్కడి నుంచి వస్తారుు, ఉన్నత చదువులు పెద్దలకేనా, పేదలకు లేవా అని ఆవేదన వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం ప్రత్యేక ఫిర్యాదుల విభాగంలో లిఖిత పూర్వక ఫిర్యాదును ఇస్తున్నట్లు ఆమె పేర్కొంది. డీపీఐలోనూ బ్రోకర్లదే పెత్తనం విద్యాసంస్థల్లో అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ (డీపీఐ) కార్యాలయంలోనూ దళారులు హవా కొనసాగుతోంది. వారు దర్జాగా లోనికి ప్రవేశించడం, సీటు కోసం సంబంధిత అధికారి నుంచి సిఫార్సు లెటర్‌ను తీసుకోవడం నిమిషాల్లో జరిగిపోతోంది. పనుల నిమిత్తం నిజాయితీగా వచ్చేవారికంటే బ్రోకర్లకే అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు. బ్రోకర్ల పెత్తనాన్ని కొందరు అధికారులు సహించలేకున్నా ఁనలుగురితోపాటు నారాయణ* అనే మంత్రాన్ని జపిస్తూ బ్రోకర్లకు సహకరిస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా వేదనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెరిచారు. అరుునప్పటికీ పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లలకు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విద్యాసంస్థల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. ఎల్కేజీ నుంచి ప్లస్ టూ వరకు కనీస విద్యార్హతను తమ పిల్లకు కలిగించాలని అధిక శాతం మంది ఆశ పడుతున్నారు. తమ ఆశలు ఆశయాలకు అనుగుణంగా విద్యా సంస్థను ఎంచుకుని సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే అక్కడ దళారులు ప్రత్యక్షమవుతున్నారు. కోరి న చోట, కోరిన విద్యాసంస్థల్లో సీటు కావాలం టే రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారు. టిప్ టాప్ డ్రస్సుతో కారుల్లో తిరిగే దళారులు విద్యాసంస్థల యాజమాన్యం, అధికారులతో ఉన్న పరి చయాలను క్యాష్ చేసుకుంటున్నారు. యాజ మాన్య, అధికారుల వాటా కోసం బ్రోకర్లే వారధిగా నిలుస్తున్నారు. సీట్ల కోసం విద్యాసంస్థల కార్యాలయాల ముందు తల్లిదండ్రులు పడిగాపులు పడుతుండగా దళారులు మాత్రం ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. యాజమాన్యాలతో వారి చొరవచూసి విద్యాసంస్థ ఉద్యోగిగా భ్రమపడిన తల్లిదండ్రులు వారు దళారులని తెలుసుకుని ఖిన్నులవుతున్నారు. తన బిడ్డ ప్లస్‌టూ 94 శాతం మార్కులతో పాసైంది, సీటు కోసం కాలేజీకి వెళితే రూ.2 లక్షలు తెమ్మన్నారని ప్లాట్‌ఫాంపై పూలమ్ముకునే మహిళ వాపోయింది. తమ వంటి పేదలకు లక్షలు ఎక్కడి నుంచి వస్తారుు, ఉన్నత చదువులు పెద్దలకేనా, పేదలకు లేవా అని ఆవేదన వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం ప్రత్యేక ఫిర్యాదుల విభాగంలో లిఖిత పూర్వక ఫిర్యాదును ఇస్తున్నట్లు పేర్కొంది. డీపీఐలోనూ దళారుల పెత్తనం: విద్యాసంస్థల్లో అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ (డీపీఐ) కార్యాలయంలోనూ దళారుల హవా కొనసాగుతోంది. వారు దర్జాగా లోనికి ప్రవేశించడం, సీటు కోసం సంబంధిత అధికారి నుంచి సిఫా ర్సు లెటర్‌ను తీసుకోవడం నిమిషాల్లో జరిగి పోతోంది. పనుల నిమిత్తం నిజాయితీగా వచ్చేవారికంటే దళారులకే అధికారులు ప్రాధాన్యంనిస్తున్నారు. దళారుల పెత్తనాన్ని కొందరు అధికారులు సహించలేకున్నా ‘నలుగురితోపాటు నారాయణ’ అనే మంత్రాన్ని జపించాల్సి వస్తోంది. దీంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా వేదనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.